భారత-మధ్య ప్రాచ్య-ఐరోపా ఆర్థిక కారిడార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఇది సహకారం, ఆవిష్కరణలు, ఉమ్మడి ఆశలు-ఆకాంక్షల సాకారం దిశగా పయనాన్ని సుగమం చేస్తుందన్నారు. అలాగే భాగస్వామ్య పురోగమనానికి తోడ్పడగలదని హామీ ఇచ్చారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఉమ్మడి ఆశలు-ఆకాంక్షల సాకారం దిశగా ప్రయనాన్ని భారత-మధ్యప్రాచ్య-ఐరోపా ఆర్థిక కారిడార్ సుగమం చేస్తుంది. అంతేకాకుండా సహకారం, ఆవిష్కరణలు, భాగస్వామ్య ప్రగతికి దోహదం చేస్తామని హామీ ఇస్తోంది. చరిత్ర విస్తరించేకొద్దీ, మానవాళి కృషితోపాటు ఖండాల మధ్య ఐక్యతకు ఈ కారిడార్ ఒక ఉదాహరణగా రూపొందుతుందని ఆశిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.
Charting a journey of shared aspirations and dreams, the India-Middle East-Europe Economic Corridor promises to be a beacon of cooperation, innovation, and shared progress. As history unfolds, may this corridor be a testament to human endeavour and unity across continents. pic.twitter.com/vYBNo2oa5W
— Narendra Modi (@narendramodi) September 9, 2023