భారత, ఫ్రాన్స్ వ్యూహాత్మకంగా నిలిచిన శక్తులు కావడంతో పాటు భారత పసిఫిక్ ప్రాంతంలో కీలక భాగస్వామ్యం గల దేశాలు. హిందూ మహాసముద్రంలో భారత-ఫ్రెంచి భాగస్వామ్యం ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన అంశం. ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత-ఫ్రాన్స్ వ్యూహాత్మక సహకార విజన్’’పై 2018 సంవత్సరంలో ఉభయ దేశాలు ఒక అంగీకారం కుదుర్చుకున్నాయి. మనం ఇప్పుడు దాన్ని పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ప్రయత్నాలకు విస్తరించాయి.
ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత, భద్రతతో కూడిన శాంతియుత ప్రదేశంగా నిలపాలని మన ఉభయ దేశాలు విశ్వసిస్తున్నాయి. సొంత ఆర్థిక, భద్రతా ప్రయోజనాలు కాపాడుకోవడంతో పాటు ప్రపంచ దేశాల ఉమ్మడి ప్రయోజనాలు కాపాడేలా అందరికీ అందుబాటులో ఉంచడానికి; ఆ ప్రాంతంలో సుసంపన్నత, సుస్థిరతకు దోహదపడే భాగస్వామ్యాల నిర్మాణానికి; అంతర్జాతీయ చట్టాల నిబంధనలు చెల్లుబాటులో ఉండేలా చేయడం; ప్రాంతీయంగా అంతర్గతంగాను, వెలుపల ఉన్న అందరితోనూ కలిసికట్టుగా పని చేయడం; సార్వభౌమత్వ, ప్రాదేశిక సమగ్రత కోణంలో ప్రాంతీయంగా సమతూకమైన, సుస్థిర వ్యవస్థ నెలకొనేలా చేయడానికి మన సహకారం విస్తరించాలని ఉభయ దేశాలు కట్టుబడి ఉన్నాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతలోని సాగర్ (ప్రాంతీయంగా అందరి భద్రత, వృద్ధి; అధ్యక్షుడు మాక్రాన్ దార్శనికతలోని భద్రత, సహకారం రెండూ కలగలిసి ఫ్రాన్స్ కు చెందిన భారత, పసిఫిక్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఉన్నాయి. మన సహకారం సమగ్రమైనది. అది రక్షణ, భద్రత, ఆర్థిక, కనెక్టివిటీ, మౌలిక వసతులు, సుస్థిరత, మానవ కేంద్రీకృత వృద్ధి అన్నింటికీ విస్తరిస్తుంది.
మన ద్వైపాక్షిక సహకారం భారత పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు మద్దతు ఇవ్వడంతో పాటు పరస్పర భద్రతను ముందుకు నడుపుతుంది. మన సహకారం సముద్ర ఉపరితలం నుంచి అంతరిక్షం వరకు విస్తరిస్తుంది. ప్రాంతీయ భాగస్వామ్య దేశాల సహకారంతో సాగరతల సహకారాన్ని పెంచుకోవడంతో పాటు ప్రాంతీయ చైతన్యాన్ని, పరిస్థితుల ఆధారంగా సహకారం, మార్పిడిని మరింత లోతుగా విస్తరించుకోవాలి. మనం నౌకాదళ సందర్శనల ద్వారా మిలిటరీ సహకారం విస్తరించుకోవడంతో పాటు భారతదేశంలో రక్షణ పారిశ్రామిక సామర్థ్యాలు విస్తరించుకోవాలి. ఇతర దేశాల అవసరాలు కూడా ఉమ్మడిగా తీర్చేందుకు ప్రయత్నం చేయాలి. ఫ్రెంచి సముద్ర ఉపరితల ప్రాంతాలైన లా రీయూనియన్, న్యూ కాలెడోనియా, ఫ్రెంచి పోలినీసియాలకు మన సమగ్ర సహకారం విస్తరించుకోవడాన్ని కొనసాగించాలి.
ఆఫ్రికా, హిందూ మహాసముద్ర ప్రాంతం, దక్షిణాసియా, ఆగ్నేయాసియా, పసిఫిక్ సహా ప్రాంతీయంగా అన్ని దేశాలకు అభివృద్ధి భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించాలి. ఆస్ర్టేలియా, యుఏఇలతో బహుముఖీన ఏర్పాట్లను బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రాంతీయంగా మరిన్ని సహకారాలు నిర్మించుకోవాలి. అంతే కాదు...ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం, ఇండియన్ ఓషన్ కమిషన్, జిబోటి కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎడిడిఎం+, ఏఆర్ఎఫ్ లతో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి.
భారతదేశంలో ఐఎఫ్ సి-ఐఓఆర్; యుఏఇ, అట్లాంటాల్లో ఇఎంఏఎస్ఓహెచ్, సిషెల్స్ లో ఆర్ సిఓసి, మడగాస్కర్లో ఆర్ఎంఐఎఫ్ సి, సింగపూర్ లో రికాప్ ద్వారా మన సాగర భద్రతా సహకారం పటిష్ఠం చేసుకోవలసిన అవసరం ఉంది. కంబైన్డ్ మారిటైమ్ ఫోర్స్ ల్లో (సిఎంఎఫ్) చేరాలన్న భారత ఆకాంక్షకు ఫ్రాన్స్ మద్దతు ఇస్తుంది.
ఏడు మూలస్తంభాల ఆధారంగా ప్రాంతీయంగా ఎదురవుతున్న ఉమ్మడి సవాళ్లను సహకారపూర్వక కార్యాచరణతో పరిష్కరించుకోవడమే ఇండో పసిఫిక్ సాగర ఇనీషియేటివ్ ప్రధాన లక్ష్యం. దీన్ని మరింత పెంచుకునేందుకు కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంది. ఫ్రాన్స్ ప్రధాన భాగస్వామిగా గల మారిటైమ్ వనరుల స్తంభంపై వివిధ ఆచరణీయ ప్రాజెక్టుల అమలుకు ఉభయ దేశాల మధ్య గల వివిధ ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ భాగస్వామ్యాల పరిధిలో సముద్ర వనరుల కోసం సుస్థిర అభివృద్ధితో కూడిన వాతావరణం కల్పనకు, ఐయుయు ఫిషింగ్ కార్యకలాపాల విస్తరణకు మనం కలిసికట్టుగా పని చేయాలి.
భారత, ఫ్రాన్స్ అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ ను ప్రారంభించాయి. ప్రాంతీయంగా పునరుత్పాదక ఇంధన వనరులు నెలకొల్పాలని కట్టుబాటును ప్రకటించాయి. ప్రాంతీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టార్టప్ లు సోలార్ ఎక్స్ చాలెంజ్ ప్రాజెక్టు ద్వారా లాభం పొందాలని ప్రతిపాదించాయి.
భారత, ఫ్రాన్స్ ఇండో-పసిఫిక్ పార్కుల భాగస్వామ్యం అమలును కొనసాగించాలని నిర్ణయించాయి. ప్రత్యేకించి పసిఫిక్ దేశాలకు మాంగ్రోవ్ సంరక్షణ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి.
ఉభయ వర్గాలు ఇండియా-ఫ్రాన్స్ ఇండో-పసిఫిక్ ట్రయాంగులర్ డెవలప్ మెంట్ కోఆపరేషన్ నిధి ప్రతిపాదనను కార్యరూపంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని నిర్ణయించాయి. అలాగే వైపరీత్యాలను తట్టుకోగల మౌలిక వసతుల సహకార వేదికలో మన భాగస్వామ్యం ప్రాంతీయంగాను ప్రత్యేకించి చిన్న ద్వీపకల్ప దేశాల సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుంది. పసిఫిక్ ప్రాంతంలో ఎలాంటి ప్రతికూలతలనైనా తట్టుకునే వాతావరణ మార్పుల కార్యక్రమం రూపకల్పన, జీవ వైవిధ్య సంరక్షణ కోసం రూపొందించిన మల్టీ డోనర్ కార్యక్రమంలో భారతదేశం కూడా చేరాలని ఫ్రాన్స్ ఆహ్వానించింది.
ఇండో-పసిఫిక్ ప్రాంతానికి ప్రత్యేకించి ఇండో-ఫ్రెంచి హెల్త్ క్యాంపస్ ఏర్పాటుకు భారత, ఫ్రాన్స్ కలిసికట్టుగా కృషి చేయనున్నాయి. పరిశోధన, అకడమియాకు ప్రాంతీయ మాగ్నెట్ నిర్మించడం దీని లక్ష్యం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సాధించిన అనుభవం ఆధారంగా పసిఫిక్ ద్వీపకల్ప జాతీయుల కోసం ఒక క్యాంపస్ ప్రారంభించాలన్న ప్రతిపాదనను మనం పరిశీలించాలి.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పర అనుసంధానిత ఏర్పాట్లలో భారత-ఫ్రాన్స్ భాగస్వామ్యం అత్యంత కీలకమని మనం విశ్వసిస్తున్నాం. ఇండో పసిఫిక్ ప్రాంత శాంతి, సుసంపన్నతలకు ఇది అత్యంత కీలకం.