1. భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించిన మీదట బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా 2019 అక్టోబర్ 05న భారతదేశాన్ని ఆధికారికం గా సందర్శించారు. న్యూ ఢిల్లీ లో వివిధ ఆధికారిక కార్యక్రమాల తో పాటు అక్టోబర్ 3వ, 4వ తేదీల లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సమిట్ కు బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా ను ముఖ్య అతిథి గా ఆహ్వానించడమైంది.
2. ఇరువురు ప్రధానులు అత్యంత స్నేహపూర్వకమైన, ఉత్సాహభరితమైన వాతావరణం లో జరిగిన సమగ్ర చర్చల లో పాలు పంచుకొన్నారు. అనంతరం ఇరువురు ప్రధాన మంత్రులు ద్వైపాక్షిక అవగాహన పత్రాల తో పాటు పర్యటన సందర్భం గా సంతకాలైన ఒప్పంద పత్రాల ను కూడా ఇచ్చి పుచ్చుకొనేందుకు ఏర్పాటైన కార్యక్రమం లో పాల్గొన్నారు. వారు వీడియో లింక్ ద్వారా మూడు ద్వైపాక్షిక ప్రోజెక్టుల ను ప్రారంభించారు.
ఈ సమావేశం సందర్భం గా ఇరువురు నేత లు ప్రస్తుతం అద్భుత స్థితి లో ఉన్న ద్వైపాక్షిక సంబంధాల పట్ల సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఈ ద్వైపాక్షిక సంబంధాలు లోతైన చారిత్రక పునాది ఆధారం గా ఏర్పడిన సోదర బంధం. ఇది సార్వభౌమాధికారం, సమానత్వం, నమ్మకం , వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మించిన అవగాహన ల ఆధారంగా అన్నిటినీ కలిగివున్న ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
వారు సమగ్రమైన, ఫలప్రదమైన చర్చలను నిర్వహించారు. ఈ చర్చ ల సందర్భం గా ద్వైపాక్షిక సంబంధాల కు సంబంధించిన అన్ని అంశాల ను వారు సమీక్షించారు. అలాగే ప్రాంతీయ అంశాలపై వారు తమ అభిప్రాయాల ను కలబోసుకున్నారు.
సాంప్రదాయక రంగాలలో , సంప్రదాయేతర రంగాల లో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి అందివచ్చే వివిధ అవకాశాల ను పూర్తి గా ఉపయోగించుకొనేందుకు ప్రధానులు ఇద్దరూ అంగీకరించారు. ఈ పటిష్ట భాగస్వామ్యం బాంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తో ప్రారంభమైన ఘన వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకుపోయేదిగా ఉంటుంది.
ఇండియా- బాంగ్లాదేశ్ బంధం వ్యూహాత్మక సంబంధాల కు మించిన బంధం
3. చరిత్ర, సంస్కృతి, భాష, లౌకికవాదం , ఇరు దేశా భాగస్వామ్యాన్ని వివరించే ఇతర ప్రత్యేకమైన
ఏకరూప అంశాల ను ఇరువురు ప్రధానులు గుర్తు చేసుకున్నారు.
1971 బాంగ్లాదేశ్ విముక్తి యుద్ధం లో ప్రాణ త్యాగం చేసిన ముక్తి యోధులు, భారతీయ సైనికులు, బాంగ్లాదేశ్ ప్రజల కు వారు ఘన నివాళులను అర్పించారు. ప్రజాస్వామ్యం, సమానత్వం వంటి ఘనమైన విలువల ను కొనసాగించేందుకు బాంగ్లాదేశ నాయకత్వం ప్రదర్శించిన చిత్తశుద్ధి ని కొనియాడారు. బాంగ్లాదేశ్ జాతిపిత వంగబంధు శేఖ్ ముజిబుర్ రహ్మాన్ కలల కు అనుగుణం గా ఈ ఉమ్మడి విలువల ను కాపాడేందుకు ఇరువురు నేత లు సంకల్పం చెప్పుకొన్నారు. సుసంపన్నమైన, శాంతియుతమైన, అభివృద్ధి చెందిన బాంగ్లాదేశ్ ను సాధించేందుకు బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా దార్శనికత సాకారం అయ్యేందుకు భారతదేశం సంపూర్ణంగా మద్దతిస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన హామీ ని పునరుద్ఘాటించారు.
సరిహద్దు భద్రత, నిర్వహణ
4. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించబోమన్న బాంగ్లాదేశ్ ప్రభుత్వ విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఈప్రాంతంలో శాంతితి, సుస్థిరత, భద్రతకు బాంగ్లాదేశ్ ప్రధానమంత్రి శేఖ్‌హసీనా పట్టుదలతో చేస్తున్నకృషిని కూడా ఆయన కోనియాడారు. ఈ ప్రాంతంలోను, ఉభయ దేశాల శాంతి, సుస్థిరత విషయంలోనూ ఉగ్రవాదం ఒక చెప్పుకోదగిన ముప్పుగా ఉన్న విషయాన్ని గుర్తిస్తూ, ఏ రూపం లోని ఉగ్రవాదాన్ని అయినా సమూలంగా నిర్మూలించేందుకు ఇరువురు ప్రధానులు వారి చిత్తశుద్ధి ని పునరుద్ఘాటించారు. అలాగే ఏ ఉగ్రవాద చర్య అయినా దానికి ఎలాంటి సమర్ధత లేదని పేర్కొన్నారు. 2019వ సంవత్సరం ఆగస్టు లో బాంగ్లాదేశ్ హోం మంత్రి భారతదేశాన్ని సందర్శించిన సందర్భం గా ఇరు దేశాల హోం మంత్రుల మధ్య చర్చలు ఫలప్రదం గా జరగడాన్ని గురించి ఇరువురు నేత లు ప్రస్తావించారు. అలాగే తీవ్రవాదం, రాడికల్ గ్రూపు లు, ఉగ్రవాదులు, స్మగ్లర్లు, నకిలీ కరెన్సీని తరలించే ముఠాలు, వ్యవస్థీకృత నేరాల విషయం లో మరింత సన్నిహిత సహకారాని కి ప్రాధాన్యమివ్వాలని ఉభయ దేశాలు నిర్ణయించాయి.
5. ఇరు దేశాల మధ్య ప్రజల రాకపోకలనుస ఉలభతరం చేయాలని ఉభయలు పరస్పరం నొక్కి చెప్పారు. బాంగ్లాదేశ్ ప్రజలు రోడ్డు లేదా రైలు మార్గం లో భారతదేశాని కి రావడానికి ప్రయాణ నిబంధనల ను సులభతరం చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చూపిన చిత్తశుద్ధికి బాంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా కృతజ్ఞత లు తెలిపారు. ఇదే స్ఫూర్తి కి అనుగుణం గా నౌకా మార్గం లో ప్రస్తుత భూతల ఓడరేవు ల ద్వారా వచ్చే బాంగ్లాదేశ్ ప్రయాణికుల కు అన్ని రకాల ఆంక్షల ను ఉపసంహరించాలని ఆమె కోరారు. తగిన సరైన పత్రాల తో భారత్ లోని పోర్టుల ద్వారా రాక పోకల ను సాగించడానికి బాంగ్లాదేశ్ పౌరుల పై గల మిగిలిన ఆంక్షల ను దశల వారీగా ఉపసంహరించేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయి. ఇందుకు ముందుగా అఖౌరా (త్రిపుర), ఘోజడంగా (పశ్చిమ బెంగాల్) చెక్ పోస్టులతో దీని ని ప్రారంభిస్తారు
6. నేరాలు లేని, సుస్థిరమైన, ప్రశాంతమైన పరిస్థితులను నెలకొల్పేందుకు పటిష్టమైన సరిహద్దు నిర్వహణ అవసరమని ఇరువురు నాయకులూ స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన దిశగా,ఉభయదేశాల మధ్యగల అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పెండింగ్ లో ఉన్న సెక్టార్లలో కంచె నిర్మాణపనులను , వీలైనంత త్వరగా పూర్తి చేయవలసింది గా సంబంధిత సరిహద్దు బలగాల ను ఉభయ ప్రధానులు ఆదేశించారు. సరిహద్దుల వెంట సామాన్య పౌరుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఇరువురు నేత లు అంగీకరించారు. సరిహద్దులలో ఇటువంటి ఘటనల ను పూర్తి గా నివారించేందుకు ఉభయ దేశాల సరిహద్దు బలగాలు మరింత సమన్వయం తో పనిచేయాలని తమ బలగాల ను ఇరువురు ప్రధానులు ఆదేశించారు.
7. విపత్తు నిర్వహణ విషయం లో పరస్పరం సహకరించుకోవాలని ఇరువురు నేత లు అంగీకరించారు. విపత్తు నిర్వహణ సహకారానికి సంబంధించి ఉభయుల కు ప్రయోజనకర రీతిలో వ్యాపర భాగస్వామ్యానికి సంబంధించి నిర్ణీత కాలావధి లో అవగాహనపూర్వక ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసుకోవలసిన అవసరాన్ని వారు స్వాగతించారు.
8. బాంగ్లాదేశ్ ఎల్.డి.సి ( అత్యంత వెనుకబడిన దేశం) స్థాయి నుంచి పైకి ఎదగడాన్ని భారత్ స్వాగతించింది. ఇందుకు భారతదేశం బాంగ్లాదేశ్‌కు తన హృదయపూర్వక అభినందనలు తెలిపింది. ఈ నేపథ్యంలో భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి (సిఇపిఎ) గల అవకాశాలపై ఒక సంయుక్త అధ్యయనాన్ని సత్వరం ఏర్పాటుచేసేందుకు ఉభయ పక్షాలూ అంగీకరించాయి.
9. అఖౌరా – అగర్తలా పోర్టు నుండి ట్రేడ్ అవుతున్న ఉత్పత్తుల పై పోర్టు ఆంక్షల ను ఉపసంహరించుకోవలసిందిగా భారతదేశం చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ బాంగ్లాదేశ్, ఈ ఆంక్షలను సమీప భవిష్యత్తు లో రెగ్యులర్ ట్రేడ్ కు సంబంధించిన చాలావరకు సరకుల పై తొలగించనున్నట్టు తెలియజేసింది.
10. జనపనార ఉత్పత్తుల తో సహా బాంగ్లాదేశ్ నుండి భారతదేశాని కి ఎగుమతి అవుతున్న పలు ఉత్పత్తుల పై యాంటీ డంపింగ్, యాంటీ సర్‌కమ్ వెన్షన్ సుంకాల విధింపు సమస్య పై దృష్టి సారించ వలసిందిగా భారత అధికారులను బాంగ్లాదేశ్ కోరింది.
ఇందుకు భారతదేశం బదులిస్తూ ప్రస్తుత చట్టాల ప్రకారం ట్రేడ్ రెమిడియల్ ఇన్వెస్టిగేశన్ లను చేపట్టడం జరుగుతుందని తెలిపింది. ఈ అంశం లో సామర్ధ్యాల నిర్మాణం, ట్రేడ్ రెమిడియల్ చర్యల విషయం లో పరస్పర సహకారాని కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు ను వేగవంతం చేయవలసింది గా అధికారుల ను ఉభయ నేత లు ఆదేశించారు.
11. మారుమూల సరిహద్దు ప్రాంతాలలోని ప్రజల జీవనం, జీవనోపాధిపై ఎంతగానో ప్రభావితం చూపుతున్న సరిహద్దు మార్కెట్ల సానుకూల ప్రభావాన్ని ఇరువురు నేత లు అభినందించారు. సరిహద్దు వెంట ఉభయ దేశాలు అంగీకరించిన చోట 12 సరిహద్దు మార్కెట్ల ను ఏర్పాటు చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఉభయ నేత లు ఆదేశించారు.
12. బాంగ్లాదేశ్ స్టాండర్డ్స్, టెస్టింగ్ ఇన్ స్టిట్యూషన్ (బిఎస్‌టిఐ)కి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందం పొడిగింపు ను ఉభయ నేత లు స్వాగతించారు. ఈ అవగాహనపూర్వక ఒప్పందం ఇరు దేశాల మధ్య సమతుల్యత తో ఉత్పత్తుల వాణిజ్యం పెంపు కు దోహద పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలూ ఏసియా పసిఫిక్ లేబరెటరీ అక్రిడేశన్ కో ఆపరేశన్ లో సభ్యదేశాలు అయినందున బిఎబి, ఎన్.ఎ.బి.ఎల్ సర్టిఫికేషన్ ను పరస్పరం పరిగణనలోకి తీసుకోవాలని ఉభయ దేశాలూ అంగీకరించాయి. బిఎస్‌టిఐ , ఎన్.ఎ.బి.ఎల్ ప్రమాణాల కు అనుగుణం గా కొన్ని సదుపాయాల ను బిఎస్‌టిఐ చేపట్టింది.
13. భారతీయ విపణుల కు బాంగ్లాదేశ్ ఎగుమతుల కు డ్యూటీ ఫ్రీ, కోటా ఫ్రీ సదుపాయాన్ని కల్పించేందుకు భారతదేశం సంసిద్ధత ను వ్యక్తం చేయడం పట్ల బాంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా హర్షం వ్యక్తం చేశారు. ప్రప్రథమం గా బాంగ్లాదేశ్ ఎగుమతులు భారతదేశాని కి 2019 లో 1 బిలియన్ డాలర్ల ను దాటడం తో పాటు ఎగుమతుల లో ఏటికేడాది 52 శాతం వృద్ధి నమోదు కావడాన్ని వారు స్వాగతించారు.
14. టెక్స్ టైల్, జనపనార పరిశ్రమ ల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని ముందుకు తీసుకుపోయేదిశగా భారత ప్రభుత్వానికి చెందిన టెక్స్‌టైల్ మంత్రిత్వశాఖకు, బాంగ్లాదేశ్ టెక్స్‌టైల్, జూట్ మంత్రిత్వశాఖకు మద్య వీలైనంత త్వరగా ఒక అవగాహనా ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఉభయదేశాలూ అంగీకరించాయి.
భూతల మార్గం,జలాలు, గగనతలంలో అనుసంధానంత మరింతపెంపు
15. గగనతల మార్గాలు, జలమార్గాలు, రైలుమార్గాలు, రహదారి మార్గాల ద్వారా సంధానం మరింత పెరగడం వల్ల పరస్పర ప్రయోజనకర రీతి లో ఆర్థిక సహకారం మరింత పెరగడానికి అవకాశాలు ముమ్మరం అవుతాయని, ముఖ్యం గా బాంగ్లాదేశ్ కు భారతదేశం లోని ఈశాన్య రాష్ట్రాల కు, మరి కొన్ని ఇతర ప్రాంతాల కు ప్రయోజనకరం గా ఉంటుందని ఉభయ పక్షాలూ గుర్తించాయి.
చత్తోగ్రామ్, మోంగ్లా పోర్టుల నుండి ఇండియా కు, అలాగే ఇండియా నుండి సరకుల రవాణా కు ప్రమాణీకృత నిర్వహణా నిబంధనలు ఖరారు కావడాన్ని ఇరువురు నాయకులూ స్వాగతించారు. ప్రత్యేకించి భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల కు, అక్కడి నుండి సరకు రవాణాకు ఇది ఉభయ దేశాల ఆర్థిక వ్యవస్థలకూ ప్రయోజనకర స్థితి ని కల్పిస్తుంది.
16. దేశీయ జలమార్గాలు, కోస్తా నౌకా వాణిజ్యాన్ని ఉపయోగించుకుని సరకురవాణా చేపట్టడానికి పుష్కలంగా గల అవకాశాలను ఇరువురు నాయకులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ దిశగా ధులియాన్-గడగరి- రాజస్థాన్ -దౌలాత్‌దియా- అరిచా మార్గాన్ని(రాక, పోకలు), అలాగే దౌద్‌కండి- సోనామురా మార్గాన్ని( రాక పోకల కు) ప్రొటోకాల్ ఆన్ ఇన్ లాండ్ వాటర్ ట్రాన్జిట్ అండ్ ట్రేడ్ లో భాగం గా కార్యరూపం లోకి తెచ్చేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించారు.
17. ఒక దేశం సముద్ర పోర్టుల ను మరోక దేశం వినియోగించుకొని తమ దేశ సరకుల ను ఇతర దేశాల కు పంపడానికి వాటిని వాడుకోవడం ద్వారా ఉభయ దేశాల ఆర్థిక వ్యవస్థల కు కలగనున్న అద్భుత ప్రయోజనాన్ని దృష్టి లో పెట్టుకొని ఇందుకు అనుసరించవలసిన విధి విధానాల పై సత్వరం చర్చలు చేపట్టాలని ఉభయ పక్షాలూ అంగీకరించాయి.
18. ఇరు దేశాల మధ్య ప్రయాణికుల రాకపోకల ను, సరకు రవాణా ను సులభతరం చేసేందుకు మరింత సంధాన సదుపాయాలుకల్పించే ది శగా బిబిఐఎన్ మోటార్ వెహికిల్ ఒప్పందాన్నివీలైనంత త్వరగా కార్యరూపం లోకి తెచ్చేందుకు ఇరు దేశాల నాయకులు అంగీకరించారు. బిబిఐన్ మోటార్ వెహికిల్ ఒప్పందం సానుకూలత వ్యక్తం చేసి సిద్ధంగా ఉన్న సభ్యత్వ దేశాల మధ్య ప్రయాణికుల రాకపోకల కు, సరకు రవాణా కు ఉపయోగపడుతుంది. లేదా ఇందుకు అనుగుణం గా ఇండియా- బాంగ్లాదేశ్ మోటార్ వెహికిల్ ఒప్పందం దిశగా కృషి చేసేందుకు ఉపకరిస్తుంది.
19. ఇరు దేశాల మధ్య రహదారి సంధానాన్ని మరింతగా పెంచే దిశ గా, ఢాకా- సిలిగురి బస్ సర్వీసు ప్రారంభాని కి జరుగుతున్న ప్రయత్నాల ను ఇరువురు నేత లు స్వాగతించారు.
20. ఢాకా లో ఇరు దేశాలకు చెందిన జలవనరుల కార్యదర్శుల మధ్య 2019 ఆగస్టు లో జరిగిన చర్చల పట్ల ఇరువురు నాయకులూ సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఆ తరువాత జాయింట్ టెక్నికల్ కమిటీ ఏర్పాటు, 1996 నాటి గంగా జలాల పంపిణీ ఒప్పందం లో భాగం గా బాంగ్లాదేశ్ అందుకొనే జలాల ను పూర్తి స్థాయి లో సద్వినియోగం చేసుకునేందుకు వీలు గా బాంగ్లాదేశ్ లో చేపట్టాలని ప్రతిపాదించిన గంగా -పద్మా బరాజ్ ప్రోజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనాని కి సంబంధించిన అంశాల ను ఖరారు చేసేందుకు అవసరమైన సంయుక్త సాంకేతిక కమిటీ ఏర్పాటు పై ఇరువురు నేత లు సంతృప్తి ని వ్యక్తం చేశారు.
21. జాయింట్ రివర్స్ కమిశన్ సాంకేతిక స్థాయి కమిటీ తాజా సమాచారాన్ని వీలైనంత త్వరగా ఇచ్చి పుచ్చుకోవాలని, తాత్కాలికం గా ఆరు నదుల కు సంబంధించి, అంటే మను, ముహురి ఖోవాయి, గుమ్తి, ధార్లా, దుద్‌కుమార్ నదుల జలాల పంపిణీ ఒప్పందాని కి సంబంధించి ముసాయిదా ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలని ఇరువురు నేత లు జాయింట్ రివర్ కమిశన్ టెక్నికల్ లెవల్ కమిటీ ని ఆదేశించారు.
22. ఉభయ దేశాలూ 2011 లో అంగీకరించిన విధం గా తీస్తా జలాల పంపిణీ కి సంబంధించిన తాత్కాలిక ఒప్పందం ఫ్రేమ్ వర్క్ పై వీలైనంత త్వరగా సంతకాలు, అమలు కు సంబంధించి బాంగ్లాదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారని బాంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా ప్రధానం గా ప్రస్తావించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇందుకు బదులిస్తూ ఈ ఒప్పందాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేసేందుకు సంబంధిత పక్షాల తో తమ ప్రభుత్వం చర్చిస్తున్నట్టు తెలిపారు.
23. త్రిపుర లోని సబ్‌రూమ్ ప ట్టణ ప్రజల తాగునీటి కోసం ఫెనీ నది లో నుండి 1.82 క్యూసెక్కుల జలాల ను ఉపయోగించుకునేందుకు వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు ఢాకా లో జరిగిన జల వనరుల కార్యదర్శుల స్థాయి సమావేశం లో తీసుకొన్న నిర్ణయాన్ని ఇరువురు నేత లు అభినందించారు.
24. రైల్వేల రంగంలో రెండు దేశాల మధ్య విస్తృత సహకారానికి ఉన్న అవకాశాన్ని ఇద్దరు నేతలు గుర్తించారు. రెండు దేశాల రైల్వే మంత్రుల మధ్య 2019 ఆగస్టు లో జరిగిన నిర్మాణాత్మక చర్చల తీరు పట్ల వారు సంతృప్తి ని వ్యక్తం చేశారు.
25. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించవలసిన ఆవశ్యకతను ఉభయ నేతలు ఉద్ఘాటించారు. అందుకు తీసుకునే చర్యల లో భాగంగా మైత్రీ ఎక్స్ ప్రెస్ రైలు ను వారానికి 4 సార్లకు బదులుగా 5 సార్లు మరియు బంధన్ ఎక్స్ ప్రెస్ రైలు ను వారానికి ఒకసారికి బదులు రెండు సార్లు నడుపడాన్ని ఇద్దరు ప్రధాన మంత్రులు స్వాగతించారు.
26. భారతదేశం నుండి బాంగ్లాదేశ్ కు రైలు పెట్టెలు, ఇంజిన్ లు, కంటెయినర్లు, గూడ్స్ వ్యాగన్ ల వంటివాటి సరఫరా కు తగిన పద్ధతుల ను మరియు బాంగ్లాదేశ్ లో సైదాపూర్ వర్క్ శాప్ ఆధునికీకరణ కు అవసరమైన ఏర్పాట్ల ను త్వరితగతి న పూర్తి చేయాలని సంబంధిత అధికారుల ను ఉభయ నేత లు ఆదేశించారు.
27. భారతదేశం నుండి సహాయంగా అధిక సంఖ్యలో బ్రాడుగేజ్, మీటర్ గేజ్ ఇంజన్లను సరఫరా చేసే విషయాన్ని పరిశీలించనున్నందుకు బంగ్లా ప్రధాని షేఖ్ హసీనా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరగడానికి తోడ్పడనుంది.
28. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు పెంచాలన్న నిర్ణయాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. ఇప్పుడు వారానికి 61 ఉన్న సర్వీసులను 2019 వేసవి షెడ్యూలు నుంచి 91కి మరియు 2020 శీతాకాల షెడ్యూలు నుంచి వారానికి 120 సర్వీసులకు పెంచుతారు.
రక్షణ సహకారం పెంపునకు చర్యలు
29. 1971 డిసెంబరు లో జరిగిన బాంగ్లా విముక్తి పోరాటం లో ఉభయ సేన లు పోరు లో పరస్పరం అందించుకొన్న చారిత్రక సహకారాన్ని పరిగణన లోకి తీసుకొని ఇరుగు పొరుగు లో మరింత సమగ్ర భద్రత కు రక్షణ సహకారం పెంపొందించవలసిన అవసరాన్ని నేత లు ఇరువురూ గుర్తించారు.
30. సముద్రతీర భద్రత లో భాగస్వామ్యం పెంపొందించడానికి తీసుకుంటున్న చర్యలను ఇద్దరు ప్రధానమంత్రులు స్వాగతించారు. బాంగ్లాదేశ్ లో తీర నిఘా రాడార్ వ్యవస్థ ఏర్పాటుపై అవగాహన ఒప్పందానికి తుదిరూపం ఇవ్వడం లో జరిగిన ప్రగతి ని ఇద్దరు నేతలు గమనించారు. అవగాహన ఒప్పందం పై త్వరగా సంతకాలు చేయాలని ఉభయుల ను ప్రోత్సహించారు.
31. బాంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం భారతదేశం 500 మిలియన్ అమెరికా డాలర్ల ఋణం ఇవ్వడానికి సంబంధించిన పనుల ను త్వరితం చేయాలని ఇద్దరు నేత లు అంగీకరించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కు 2019వ సంవత్సరం ఏప్రిల్ లో తుదిరూపమిచ్చారు.
అభివృద్ధి సహకారం స్థిరీకరణ
32. బాంగ్లాదేశ్ లో అట్టడుగు స్థాయి వరకు సామాజిక ఆర్ధిక అభివృద్ధి ఫలితాలు చేరేలా సహాయపడే లక్ష్యం తో ఆ దేశం లో వివిధ ప్రభావశీల అభివృద్ధి పథకాల ను భారతదేశం చేపడుతున్నందుకు ప్రధాని హసీనా భారత ప్రభుత్వాని కి కృతజ్ఞత లు తెలిపారు.
33. రెండు దేశాల మధ్య కుదిరిన రుణ ఒప్పందాల అమలు లో, వినియోగం లో జరిగిన ప్రగతి పట్ల ఇరువురు ప్రధానులు సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఈ రుణాల ద్వారా చేపట్టదలచిన ప్రోజెక్టుల ను త్వరితగతిన అమలు చేయాలని రెండు దేశాల కు చెందిన అధికారుల ను వారు ఆదేశించారు.
34. బంగ్లాకు భారత ప్రభుత్వం ఇస్తున్న రుణాలకు సంబంధించిన పనులు కొనసాగేందుకు వీలుగా ఆధార ఒప్పందం పై సంతకాలు చేయడం పట్ల ఉభయ పక్షాలు సంతృప్తి ని వ్యక్తం చేశాయి. దీనివల్ల ఢాకా లో ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి కార్యాలయం పని చేయడం మొదలవుతుంది.
35. అక్టోబర్ 5వ తేదీన ఇద్దరు నేతలు వీడియో లింక్ ద్వారా మూడు ద్వైపాక్షిక భాగస్వామ్య అభివృద్ధి పథకాల ను ప్రారంభించారు. అవి:
ఎ) బాంగ్లాదేశ్ నుండి భారీ గా ఎల్ పి జి దిగుమతి;
బి) ఢాకా లో గల రామకృష్ణ మిశన్ లో వివేకానంద భాబన్ (విద్యార్ధుల హాస్టల్) ప్రారంభోత్సవం;
సి) ఖుల్ నా లో బాంగ్లాదేశ్ డిప్లొమా ఇంజనీర్ల సంస్థ వద్ద బాంగ్లాదేశ్-ఇండియా వృత్తి నైపుణ్య అభివృద్ధి సంస్థ ప్రారంభోత్సవం.
36. బాంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారుల సామర్ధ్యం పెంపు పై ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం పై రెండు దేశాలు సంతృప్తి ని వ్యక్తం చేశాయి. భారత ప్రభుత్వం తమకు ఉమ్మడి వారసత్వం గా సంక్రమించిన న్యాయశాస్త్రాన్నిఇచ్చి భవిష్యత్తు లో బాంగ్లాదేశ్ న్యాయాధికారుల శిక్షణ కార్యక్రమాల పెంపు కు తోడ్పడనుంది.
ఖండాంతర ఇంధన సహకారం
37. బాంగ్లాదేశ్ ట్రక్కులను వినియోగించి బాంగ్లాదేశ్ నుండి త్రిపుర కు భారీ మొత్తం లో వంటగ్యాసు ను తెచ్చే ప్రోజెక్టు ను ఇరువురు ప్రధాన మంత్రులు ప్రారంభించారు. ఇటువంటి ఇంధన సంబంధాల వల్ల ఖండాంతర ఇంధన వాణిజ్యం పెంపొందగలదనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.
38. విద్యుత్తు రంగం లో భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య ఢాకా లో ఇటీవల జరిగిన 17వ జె ఎస్ సి సమావేశం లో భారతదేశం లో గల కతిహార్ నుండి బాంగ్లాదేశ్ లోని పార్బతిపుర్, ఇంకా భారతదేశం లోని బోర్నగర్ వరకు 765 కిలోవాట్ల డబుల్ సర్క్యూట్ ఖండాంతర విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు కు కుదిరిన ఒప్పందాన్ని ఉభయులు స్వాగతించారు. దీనివల్ల అదనపు ఉత్పత్తి సామర్ధ్యం ఏర్పడుతుంది; భారతదేశం, నేపాల్, భూటాన్ లలో జల విద్యుత్తు పథకాలు అంతర్ ప్రాంతీయ విద్యుత్తు వాణిజ్యానికి దోహదం చేసే విధం గా చౌక లో విద్యుత్తు ను ఉత్పత్తి చేయగలవు.
విద్య మరియు యువత మార్పిడి
39. భవిష్యత్తు కు పెట్టుబడిగా రెండు దేశాల యువత మధ్య సహకారానికి గల ప్రాముఖ్యతను ఉభయ పక్షాలు ఉద్ఘాటించాయి. ఈ దిశ లో ముందడుగు చర్యగా యువత వ్యవహారాలలో సహకారానికి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని వారు ప్రస్తావించారు.
బాంగ్లాదేశ్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన శిక్షణ కార్యక్రమాలు మరింత ఉత్పాదకం కాగలవని ఇద్దరు నేతలు గుర్తించారు.
40. విద్యార్హతల ను పరస్పరం గుర్తించుకునేందుకు సంబంధించిన అవగాహన ఒప్పందానికి త్వరగా తుదిరూపాన్ని ఇవ్వాలని రెండు దేశాల కు చెందిన సంబంధిత అధికారులను ఉభయ నేతలు ఆదేశించారు.
సాంస్కృతిక సహకారం – మహాత్మ గాంధీ 150వ జయంతి సంవత్సరం (2019), బంగ బంధు జయంతి శతాబ్ది (2020) మరియు బాంగ్లాదేశ్ విముక్తి పోరాటం 50వ వార్షికోత్సవం (2021)
41. రెండు ముఖ్యమైన వార్షికోత్సవ సంవత్సరాల ను జరుపుకోవడానికి మరింత సహకారానికి గల ఆవశ్యకత ను ఉభయ నేతలు ఉద్ఘాటించారు. బంగ బంధు జయంతి శతాబ్ది (2020), బాంగ్లాదేశ్ విముక్తి పోరాటం మరియు భారత్ – బంగ్లా మధ్య ద్వైపాక్షిక దౌత్య సంబంధాల ఏర్పాటు 50వ వార్షికోత్సవం (2021).. ఈ రెండు చారిత్రాత్మక సంవత్సరాల స్మారకార్ధం రెండు దేశాల మధ్య సాంస్కృతిక అన్యోన్యతను పెంపొందించాలని ఉభయ నేతలు అంగీకరించారు. రెండు దేశాల కు అనువైనప్పుడు 2019-2020 మధ్య కాలం లో బాంగ్లాదేశ్ లో భారతీయ ఉత్సవాన్ని జరుపుతామన్న భారత ప్రధాన మంత్రి ప్రతిపాదన కు బాంగ్లాదేశ్ ప్రధాని కృతజ్ఞత లు తెలిపారు.
42. సాంస్కృతిక మార్పిడి కి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని పర్యటన సందర్భం గా నవీకరించడాన్ని ఇరువురు ప్రధానులు స్వాగతించారు.
43. 2020లో జయంతి శతాబ్ది కల్లా బంగ బంధు షేఖ్ ముజిబుర్ రహమాన్ జీవితం పై కథాచిత్రాన్ని విడుదల చేసేందుకు వీలు గా సహ నిర్మాణం చేపట్టేందుకు రెండు దేశాల చలనచిత్ర అభివృద్ధి సంస్థ లు ఎన్ ఎఫ్ డి సి మరియు బి ఎఫ్ డి సి ల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి సంబంధించిన పనుల ను త్వరితం చేయాలని అధికారుల ను ఇరువురు ప్రధానులు ఆదేశించారు.
44. వలసవాదాని కి, అసమానత కు వ్యతిరేకం గా పోరాటం జరిపి ప్రపంచవ్యాప్తంగా మన్నన పొందిన అహింసామూర్తి మహాత్మ గాంధీ 150వ జయంతి సంవత్సరం సందర్భంగా స్మారక తపాలా బిళ్ళ ను విడుదల చేసేందుకు ఒప్పుకున్న బాంగ్లాదేశ్ ప్రభుత్వాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞత లు తెలిపారు.
45. భారతదేశం లోని జాతీయ మ్యూజియమ్ మరియు బాంగ్లాదేశ్ లోని బంగ బంధు మ్యూజియమ్ ల మధ్య సహకారాని కి అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు. వీలైనంత త్వరగా ఎంఓయు కు తుది రూపాన్ని ఇవ్వాలని సంబంధిత అధికారుల ను వారు ఆదేశించారు.
మయన్మార్ దేశం లోని రేకైన్ రాష్ట్రపు నిర్వాసితులు
46. మయన్మార్ దేశం లోని రేకైన్ రాష్ట్ర నిర్వాసితుల కు ఆశ్రయం కల్పించి మానవతాపూర్వక సహాయాన్ని అందజేస్తున్న బాంగ్లాదేశ్ ఔదార్యాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. రోహింగ్యాల కు కాక్స్ బజార్ ప్రాంతం లోని తాత్కాలిక శిబిరాల లో ఆశ్రయం కల్పించడానికి బాంగ్లాదేశ్ ప్రభుత్వం చేస్తున్న మానవీయ యత్నాల కు మద్దతుగా భారతదేశం ఐదో విడత సహాయాన్ని అందజేస్తుంది. ఈ సహాయం లో భాగంగా గుడారాలు, సహాయ, రక్షణ సామగ్రి, మయన్మార్ నుండి బలవంతం గా పంపించబడిన మహిళల కు నేర్పించేందుకు ఒక వేయి కుట్టు మిషన్ లు ఉంటాయి. అంతేకాక మయన్మార్ లోని రేకైన్ రాష్ట్రంలో భారతదేశం 250 గృహాల ను నిర్మించే పథకాన్ని కూడా పూర్తి చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో సామాజిక ఆర్ధికాభివృద్ధి ప్రాజెక్టుల అమలు కు సిద్దమవుతోంది.
47. మయన్మార్ నుండి నిర్వాసితులై వచ్చిన వారి అవసరాలు తీర్చేందుకు భారతదేశం అందించిన మానవతాపూర్వక సహాయాని కి బాంగ్లాదేశ్ ప్రభుత్వం తరపున ప్రధాని శేఖ్ హసీనా కృతజ్ఞత లు తెలిపారు. వారి ని సురక్షితంగా మయన్మార్ కు పంపేందుకు సత్వర చర్యల ను తీసుకోవాలని ప్రధానులు ఇరువురు అంగీకరించారు. ఇందుకోసం రేకైన్ రాష్ట్రం లో భద్రతా పరిస్థితులతో పాటు సామాజిక ఆర్ధిక పరిస్థితులు కూడా మెరుగుపరచడానికి గట్టి ప్రయత్నాలు చేయవలసిన ఆవశ్యకత ఉందని వారు అంగీకరించారు.
ప్రాంతంలో మరియు ప్రపంచంలో భాగస్వాములు
48. ఐక్య రాజ్య సమితి లో మరియు బహువిధ సంస్థల లో సన్నిహితంగా కలసి పని చేయాలనే తమ కట్టుబాటును ఇద్దరు ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. ముఖ్యం గా అంతర్జాతీయ క్షేత్రంలో కలసి పనిచేస్తామని, అంతేకాక అజెండా 2030లో పొందుపరచిన అంశాలను/వాగ్దానాలను అమలు చేయాలని వారు అభివృద్ధిచెందిన దేశాలకు పిలుపు ఇస్తామని కూడా వారు పునరుద్ఘాటించారు.
49. రెండు దేశాల కు ప్రాంతీయ, ఉప ప్రాంతీయ సహకారం ప్రాధాన్యతా అంశమని ఇద్దరు నాయకులు అంగీకరించారు. అన్ని సభ్య దేశాల సమష్టి సౌభాగ్యమనే లక్ష్య సాధనకోసం ఉప ప్రాంతీయ సహకారానికి ఒక సమర్ధవంతమైన వాహకంగా మార్చడానికి బిమ్స్ టెక్ కార్యకలాపాలను క్రమబద్దం చేయాలని వారు అంగీకరించారు.
50. పర్యటన సందర్భం గా దిగువ పేర్కొన్న ద్వైపాక్షిక పత్రాల పై సంతకాలు చేసి, ఆమోదించి, పరస్పరం ఆదాన ప్రదానం చేసుకోవడమైంది:
– తీర ప్రాంత నిఘా వ్యవస్థ ఏర్పాటు కు అవగాహనపూర్వక ఒప్పందం;
– భారత్ నుండి సరుకుల రవాణా కోసం చట్టోగ్రామ్, మోంగ్ లా ఓడరేవుల ను ఉపయోగించి రాక పోక లు జరిపేందుకు ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్ఒపి) అమలు;
– భారతదేశం లోని త్రిపుర రాష్ట్రం లో గల సబ్ రూమ్ పట్టణానికి మంచినీటి సరఫరా కోసం ఫేనీ నది నుండి 1.82 క్యూసెక్కుల నీటి ని భారతదేశం వినియోగించుకొనేందుకు అవగాహనపూర్వక ఒప్పందం;
– బాంగ్లాదేశ్ కు భారతదేశం ఇచ్చిన రుణ వాగ్దానాల అమలు కు ఒప్పందం;
– హైదరాబాద్ యూనివర్సిటీ, ఢాకా యూనివర్సిటీ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం;
– సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం నవీకరణ ;
– యువత వ్యవహారాలలో సహకారానికి అవగాహనపూర్వక ఒప్పందం.
51. చెన్నై లో బాంగ్లా డిప్యూటీ హై కమిశన్ కార్యాలయం ప్రారంభించాలన్న అభ్యర్ధన కు సమ్మతించినందుకు ప్రధాని శేఖ్ హసీనా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి కృతజ్ఞత లు తెలిపారు.
ఉన్నత స్థాయి పర్యటన ల ద్వారా ఒరవడి కొనసాగింపు
52. తమ పర్యటన సందర్భంగా తనకు, బంగ్లా ప్రతినిధివర్గానికి లభించిన సాదర స్వాగతానికి, ఆదరాభిమానాలకు, ఆతిధ్యానికి ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
53. బాంగ్లాదేశ్ సందర్శన కు రావలసిందిగా ప్రధాని శేఖ్ హసీనా భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఆహ్వానించారు. అందుకు మోడీ అంగీకారం తెలిపారు. పర్యటన తేదీలను దౌత్య వర్గాలు ఖరారు చేస్తాయి.