ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ లు 2022వ సంవత్సరం లో మార్చి నెల 21వ తేదీ న భారతదేశం-
ఆస్ట్రేలియా రెండో వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు. 2020వ సంవత్సరం లో జూన్ 4వ తేదీ నాడు జరిగిన చరిత్రాత్మకమైనటువంటి ఒకటో వర్చువల్ సమిట్ లో ఈ సంబంధాన్ని ఒక సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం గా ఉన్నతీకరించిన పరిణామాని కి తరువాయి గా ఈ శిఖర సమ్మేళనం చోటు చేసుకోనుంది.
రాబోయే వర్చువల్ సమిట్ సందర్బం లో, నేత లు సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం లో భాగం గా వేరు వేరు కార్యక్రమాల లో పురోగతి ని పరిశీలించనున్నారు. ఈ వర్చువల్ సమిట్ కొత్త కార్యక్రమాల కు మార్గాన్ని వేయడం తో పాటు గా భారతదేశాని కి మరియు ఆస్ట్రేలియా కు మధ్య విభిన్న రంగాల లో మరింత ఎక్కువ సహకారాని కి కూడా బాట ను పరచనుంది. నేత లు వ్యాపారం, ముఖ్య ఖనిజాలు, ప్రవాసం మరియు గతిశీలత, విద్య తదితర రంగాల లో సన్నిహిత సహకారానికి వచనబద్ధత ను వ్యక్తం చేసేందుకు ఆస్కారం ఉంది.
నేత లు ఉభయ పక్షాల పరస్పర హితం ముడిపడ్డ ప్రాంతీయ అంశాల ను మరియు అంతర్జాతీయ అంశాల ను కూడా చర్చించనున్నారు. ఇరు దేశాలు వాటి ద్వైపాక్షిక సంబంధాల కు కట్టబెట్టినటువంటి ప్రాముఖ్యం తో పాటు గా ప్రాంతీయ అంశాల పైన మరియు ప్రపంచ అంశాల పైన ఉభయ పక్షాల సన్నిహిత సహకారాన్ని కూడాను ఈ శిఖర సమ్మేళనం ప్రముఖం గా ప్రకటించనుంది.
కోవిడ్-19 మహమ్మారి తలెత్తినప్పటికీ రెండు దేశాలు విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం, రక్షణ, సైబర్, క్రిటికల్ ఎండ్ స్ట్రాటజిక్ మెటీరియల్స్, జల వనరుల నిర్వహణ లకు తోడు గా ప్రభుత్వ పరిపాలన, ఇంకా గవర్నెన్స్ లు సహా విస్తృత శ్రేణి రంగాల లో సన్నిహిత సహకారాన్ని కొనసాగించాయి. ఈ విధం గా భారతదేశం-ఆస్ట్రేలియా సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక చక్కటి పురోగతి ని నమోదు చేసింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ లు కోవిడ్-19 మహమ్మారి ప్రబలిన అనంతరం 2021 సెప్టెంబరు లో వాశింగ్ టన్ డిసి లో క్వాడ్ నేత ల శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో మొట్టమొదటి సారి గా ఒకరి తో మరొకరు ముఖాముఖి సమావేశమయ్యారు. అటు తరువాత అదే సంవత్సరం లో నవంబరు నెల లో సిఒపి26 జరిగిన సందర్భం లో గ్లాస్ గో లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫార్ రిజిలియంట్ ఐలండ్ స్టేట్స్ (ఐఆర్ఐఎస్) ను వారు సంయుక్తం గా ప్రారంభించారు.