భారతదేశం మరియు యుఎస్ లు కలసి, గ్లోబల్ ఆంత్రప్రనర్ షిప్ సమిట్ (జిఇఎస్)కు 2017 నవంబర్ 28-30వ తేదీల మధ్య హైదరాబాద్ లో ఆతిథ్యమివ్వనున్నాయి.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ట్విటర్ అకౌంట్ లో వరుసగా నమోదు చేసిన ట్వీట్ లలో:
‘‘భారతదేశం మరియు యుఎస్ లు గ్లోబల్ ఆంత్రప్రనర్ షిప్ సమ్మిట్ (జిఇఎస్)కు2017 నవంబర్ 28-30వ తేదీల మధ్య హైదరాబాద్ లో సహ ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి.
ఈ శిఖరాగ్ర సభ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరియు స్టార్ట్- అప్ లు ప్రపంచ నేతలతో భేటీ అయ్యేందుకు ఒక అపూర్వమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది.
హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఆంత్రప్రనర్ షిప్ సమిట్ - 2017 కు తరలివచ్చే యుఎస్ ప్రతినిధి వర్గానికి నాయకురాలుగా ఇవాంకా ట్రంప్ హాజరవుతారని నేను ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
India and US will co-host the Global Entrepreneurship Summit at Hyderabad from 28-30 November 2017. @realDonaldTrump @IvankaTrump
— Narendra Modi (@narendramodi) August 10, 2017
The Summit is a unique opportunity for bringing together entrepreneurs and start ups with global leaders. #GES2017
— Narendra Modi (@narendramodi) August 10, 2017
Look forward to Ms. Ivanka Trump’s presence at #GES 2017 Hyderabad as the leader of the US delegation. @realDonaldTrump @IvankaTrump
— Narendra Modi (@narendramodi) August 10, 2017