భారతదేశం మరియు అఫ్గానిస్తాన్ కోవిడ్-19 పై కలసికట్టుగా పోరాటాన్ని సాగిస్తాయి, ఇందుకోసం అవి సంఘీభావం తో, ఉమ్మడి సంకల్పం తో ముందంజ వేస్తాయి అని
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పేర్కొన్నారు.
అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు డాక్టర్ అశ్ రఫ్ గనీ పొందుపరచిన ఒక ట్వీట్ పట్ల ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ ఈ మాటలు అన్నారు. అఫ్గానిస్తాన్ కు భారతదేశం అత్యవసర మందులు హైడ్రోక్సీ క్లోరోక్విన్, పేరాసిటామోల్ లను, ఇంకా ఇతర వస్తువుల ను పంపినందుకు భారతదేశాని కి అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు ట్విటర్ మాధ్యమం ద్వారా కృతజ్ఞతల ను వ్యక్తం చేశారు.
“భారతదేశం మరియు అఫ్గానిస్తాన్ చారిత్రిక, భౌగోళిక మరియు సాంస్కృతిక సంబంధాలపైన ఆధారపడినటువంటి ఒక ప్రత్యేకమైన మైత్రి ని కలిగివున్నాయి. చాలా కాలం గా, మనం ఉగ్రవాదం అనే సంకటానికి ఎదురొడ్డి నిలచి సంయుక్తం గా పోరాడాము. మనం ఇదే విధం గా కలసికట్టుగాను మరియు ఉమ్మడి సంకల్పం తోను కోవిడ్ -19ని ఎదుర్కొందాము” అంటూ అఫ్గానిస్తాన్ అధ్యక్షుడి కి ప్రధాన మంత్రి శ్రీ మోదీ ట్విటర్ లో పొందుపరచిన తన సమాధానం లో పేర్కొన్నారు.
India and Afghanistan share a special friendship, based on ties of history, geography, and culture.
— Narendra Modi (@narendramodi) April 20, 2020
For long, we have fought jointly against the scourge of terrorism. We will similarly combat COVID-19 together, with solidarity and shared resolve. @ashrafghani https://t.co/du6Rw0jvPV