టర్కీ లో ఈ రోజు న సంభవించిన భూకంపం వల్ల తలెత్తిన స్థితి ని అధిగమించడం కోసం చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం లో, తక్షణ సహాయక చర్యల ను గురించి చర్చించడం కోసం ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి డాక్టర్ శ్రీ పి.కె. మిశ్ర సౌత్ బ్లాక్ లో ఒక సమావేశాన్ని నిర్వహించారు. టర్కీ గణతంత్ర ప్రభుత్వం తో సమన్వయాన్ని ఏర్పరచుకొని ఎన్ డిఆర్ఎఫ్ లోని వెదకులాట మరియు రక్షక బృందాల ను, వైద్య బృందాల ను, ఉపశమన కారక సామగ్రి తో సహా వెనువెంటనే పంపించడం జరుగుతుంది.
వెదకులాట మరియు రక్షణ కార్యకలాపాల లో పాలుపంచుకోవడం కోసం ఈ బృందాల ను భూకంప బాధిత ప్రాంతాని కి వాయు మార్గం ద్వారా పంపించడం కోసం ఎన్ డిఆర్ఎఫ్ కు చెందిన 100 మంది సిబ్బంది తో కూడిన రెండు బృందాల ను, అవసరమైన సహాయక సామగ్రి ని మరియు ప్రత్యేకంగా శిక్షణ ను ఇచ్చిన జాగిలాల దళాల తో సహా సిద్ధం గా ఉంచడమైంది. సుశిక్షిత వైద్యులను, పారామెడిక్ సిబ్బందిని అత్యవసర మందుల తో సన్నద్ధం చేస్తున్నారు. సహాయక సామగ్రి ని టర్కీ గణతంత్ర ప్రభుత్వం, అంకారా లో భారతీయ దౌత్య కార్యాలయం మరియు ఇస్తాంబుల్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ల సమన్వయం తో పంపించడం జరుగుతుంది.
ఈ సమావేశాని కి కేబినెట్ సెక్రట్రి, హోం అఫైర్స్ మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ ప్రతినిధుల తో పాటు ఎన్ డిఎమ్ఎ, ఎన్ డిఆర్ఎఫ్ ల ప్రతినిధులు హాజరు అయ్యారు.