ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) లో 2021 వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన శిక్షణ లో ఉన్న అధికారులు 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాస భవనం లో ఆయన తో ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి వారి తో అరమరికలు లేనటువంటి విధంగా మరియు లాంఛనప్రాయం గా మాట్లాడుతూ, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ట్రైనీ లు సర్వీసు లో చేరినందుకు గాను వారిని అభినందించారు. వారికి ఇక మీదట ప్రపంచ రంగస్థలం లో భారతదేశాని కి తినిధ్యం వహించే ఒక అవకాశం దక్కగలదు అని ఆయన అన్నారు. వారు ఈ సర్వీసు లో చేరడానికి వెనుక ఉన్న కారణాల ను గురించి కూడా ప్రధాన మంత్రి చర్చించారు
అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం గా 2023వ సంవత్సరాన్ని పాటించనున్న అంశాన్ని ఆయన ప్రస్తావించి, జొన్నలు, మొక్కజొన్న వంటి వాటి కి మరింత గా ఆదరణ లభించేటట్లు గా, తద్ద్వారా మన రైతులు లాభపడే విధం గా చూడటం కోసం వారు ఏ విధమైనటువంటి తోడ్పాటు ను అందించగలుగుతారనే విషయం పై విస్తారం గా చర్చించారు. చిరు ధాన్యాలు అనేవి పర్యావరణాని కి ఏ విధం గా హితకరమో, వాటి వల్ల మానవుల ఆరోగ్యాని కి ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయో కూడా ఆయన వివరించారు. ‘లైఫ్ స్టయిల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్’ (ఎల్ఐఎఫ్ఇ) ని గురించి కూడా ఆయన మాట్లాడుతూ, పర్యవరణాని కి మేలు కలిగేలా ఒక వ్యక్తి తన యొక్క జీవన శైలి లో చిన్నవైన మార్పుల ను ఏ రకం గా తీసుకు రావచ్చో సూచనలు చేశారు. అధికారి శిక్షణార్థులు ఈ సంవత్సరం లో ప్రధాన మంత్రి ఇచ్చిన స్వాతంత్య్ర దిన ఉపన్యాసం లో ఆయన తెలిపిన పంచ్ ప్రణ్ (ఐదు ప్రతిజ్ఞ) లను గురించి పేర్కొని, ఈ విషయం లో ఐఎఫ్ఎస్ అధికారులు ఎటువంటి తోడ్పాటు ను అందించగలరో అనే దానిపైన వారి అభిప్రాయాల ను వెల్లడించారు.
రాబోయే 25 సంవత్సరాల దీర్ఘ కాలం గురించి ఆలోచించవలసింది గా ప్రధాన మంత్రి శిక్షణ లో ఉన్న అధికారుల ను ప్రోత్సహించారు. ఆ కాలం లో వారి ని వారు ఏ విధం గా అభివృద్ధి పరచుకోగలరు, మరి దేశం యొక్క వృద్ధి కోసం వారు ఏ విధం గా ఉపయోగపడగలరు అనే అంశాలను గురించి ప్రణాళికల ను తయారు చేసుకోండి అంటూ వారి కి ప్రధాన మంత్రి ఉద్బోధించారు.