డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన తో తనకు ఉన్న సంబంధాల తో ముడిపడ్డ క్షణాల ను గురించి వెల్లడించారు.
శ్రీ నరేంద్ర మోదీ తో డాక్టర్ కలామ్ కు ఉన్న ప్రేమ భరితమైనటువంటి బంధాన్ని గురించి, అలాగే డాక్టర్ కలామ్ యొక్క వారసత్వాన్ని గౌరవించడం కోసం ప్రధాన మంత్రి చేసిన ప్రయాసల కు సంబంధించిన జ్ఞాపకాల ను గురించి ‘మోదీ స్టోరీ’ అనే ఒక ట్వీట్ లో డాక్టర్ కలామ్ గారి బంధువు శేర్ చేయగా, ప్రధాన మంత్రి ఆ ట్వీట్ కు జవాబిస్తూ మరొక ట్వీట్ లో -
‘‘అనేక సంవత్సరాల పాటు డాక్టర్ కలామ్ గారి తో దగ్గరి నుండి మాట్లాడేటటువంటి భాగ్యం నాకు దక్కింది. నేను భారతదేశం ప్రగతి మొదలుకొని ఆయన ప్రతిభ, వినమ్రత మరియు ఉద్వేగాన్ని చాలా సమీపం నుండి చూశాను.’’ అని పేర్కొన్నారు.
I’ve been fortunate to have interacted closely with Dr. Kalam over the years. I have witnessed at close quarters his brilliance, humility and passion towards India’s progress. https://t.co/8a0k6V4mci
— Narendra Modi (@narendramodi) October 15, 2022