అఫ్గానిస్తాన్ స్వాతంత్య్రం సముపార్జించుకొని నేటి కి 100 సంవత్సరాలు అయిన సందర్భం లో భారతదేశం లోని 1.3 బిలియన్ మంది ప్రజల పక్షాన మరియు స్వయం గా తన తరఫున హృదయ పూర్వక శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి అఫ్గానిస్తాన్ ప్రజల కు వ్యక్తం చేశారు.
అన్ని రంగాల లో దృఢమైన మద్దతు ను ఇస్తున్నంకు భారతదేశాని కి పూర్వ అధ్యక్షుడు ధన్యవాదాలు పలకడం తో పాటు ఉభయ దేశాల ప్రజల మధ్య నెలకొన్న అసాధారణమైనటువంటి సద్భావన పట్ల సంతోషాన్ని కూడా వెలిబుచ్చారు.
ప్రజాస్వామికమైనటువంటి, శాంతియుతమైనటువంటి, భద్రమైనటువంటి, సమ్మిళితమైనటువంటి, సమైక్యమైనటువంటి మరియు యథార్థం గా స్వతంత్రత ను కలిగివున్నటువంటి అఫ్గానిస్తాన్ కై భారతదేశం మద్దతు ను కొనసాగించగలదంటూ ప్రధాన మంత్రి ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు.