ప్రభుత్వం అమలు పరుస్తున్న అనేక పథకాలు దీపావళి సందర్భం లో ప్రతి ఒక్క కుటుంబాని కి సంతోషాన్ని ప్రసాదిస్తున్నాయి అనే సంతృప్తి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
పిఎమ్ ఆవాస్ యోజన, ఉజ్జ్వల యోజన, పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధాన మంత్రి ముద్ర యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన, యుపిఐ డిజిటల్ పేమెంట్స్, స్టార్ట్-అప్ ఇండియా మొదలైన పథకాల తాలూకు ప్రయోజనాల ను గురించి తెలియజెప్పే ఒక వీడియో ను మైగవ్ ఇండియా (MyGovIndia) ఎక్స్ హేండిల్ పోస్టు చేసింది.
మైగవ్ ఇండియా లో ఎక్స్ పోస్టు కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించినటువంటి మా యొక్క పథకాల తో ప్రస్తుతం దీపావళి పండుగ సందర్భం లో దేశం లోని ప్రతి ఒక్క గృహం వెలుగులీనుతూ ఉండడం గురించి తెలిసి నాకు చాలా సంతోషం గా ఉంది. #VocalForLocal’’ అని ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో పేర్కొన్నారు.
मुझे बहुत संतोष है कि दीपावली के त्योहार पर जनकल्याण की हमारी योजनाओं से आज देश का हर घर रोशन है। #VocalForLocal https://t.co/yZFJDP5m58
— Narendra Modi (@narendramodi) November 10, 2023