Quoteఎకానమీస్ ఆఫ్ స్కేల్‌ను పెంచడంతో పాటు ఈ పథకం భారత కంపెనీలు గ్లోబల్ ఛాంపియన్‌లుగా ఎదగడానికి సహాయపడుతుంది
Quoteసహాయక కార్యకలాపాల పనుల్లో ప్రత్యక్షంగా 7.5 లక్షల మందికి పైగా మరియు పరోక్షంగా అనేక లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పించడంలో సహాయపడుతుంది
Quoteపెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడానికి ఈ పథకం మార్గం సుగమం చేస్తుంది
Quoteరూ. 10,683 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ఐదేళ్లలో పరిశ్రమకు అందించబడతాయి
Quoteఈ పథకం వల్ల రూ. 19,000 కోట్లకు పైగా తాజా పెట్టుబడులు మరియు ఐదు సంవత్సరాలలో రూ .3 లక్షల కోట్లకు పైగా అదనపు ఉత్పత్తి టర్నోవర్ లభిస్తుందని భావిస్తున్నారు
Quoteయాస్పేరేషన్‌ జిల్లాలు మరియు & టైర్ 3,4 పట్టణాలలో పెట్టుబడికి అధిక ప్రాధాన్యత
Quoteఈ పథకం ముఖ్యంగా గుజరాత్, యూపి, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఏపి, తెలంగాణ, ఒడిశా మొదలైన రాష్ట్రాలపై సానుకూల ప్రభావం చూపుతుంది.

గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా అడుగులు ముందుకు వేస్తూ, బడ్జెట్‌తో ఎంఎంఎఫ్‌ అపెరల్, ఎంఎంఎఫ్‌ ఫ్యాబ్రిక్స్ మరియు టెక్నికల్ టెక్స్‌టైల్స్ 10 విభాగాలు/ ఉత్పత్తుల కోసం రూ. 10,683 కోట్లతో పిఎల్‌ఐ పథకాన్ని ఆమోదించింది.  వస్త్రపరిశ్రమ కోసం పిఎల్‌ఐతో పాటు ఆర్‌ఓఎస్‌సిటిఎల్‌,ఆర్‌ఓడిటిఈపి మరియు  ప్రభుత్వ ఇతర చర్యలు ఉదాహరణకు  సరసమైన ధరకు ముడిసరుకు అందించడం, నైపుణ్యాభివృద్ధి మొదలైనవి వస్త్రాల తయారీలో కొత్త యుగాన్ని తెలియజేస్తాయి.

టెక్స్‌టైల్స్ కోసం పిఎల్‌ఐ స్కీమ్ అనేది 2021-22 కేంద్ర బడ్జెట్‌లో గతంలో చేసిన 13 రంగాల కోసం పిఎల్‌ఐ స్కీమ్‌ల మొత్తం రూ. 1.97 లక్షల కోట్ల ప్రకటనలో భాగం. 13 రంగాలకు పిఎల్‌ఐ పథకాలను ప్రకటించడంతో భారతదేశంలో కనీస ఉత్పత్తి సుమారు  5 సంవత్సరాలలో రూ. 37.5 లక్షల కోట్లు మరియు 5 సంవత్సరాలలో కనీస అంచనా ఉపాధి దాదాపు 1 కోటి.

వస్త్రరంగం కోసం పిఎల్‌ఐ పథకం దేశంలో అధిక విలువ కలిగిన ఎంఎంఎఫ్‌ ఫ్యాబ్రిక్, వస్త్రాలు మరియు సాంకేతిక వస్త్రాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ప్రోత్సాహక నిర్మాణం చాలా సూత్రీకరించబడింది. ఈ విభాగాలలో తాజా సామర్థ్యాలలో పెట్టుబడి పెట్టడానికి పరిశ్రమ ప్రోత్సహించబడుతుంది. ఇది పత్తి మరియు ఇతర సహజ ఫైబర్ ఆధారిత వస్త్ర పరిశ్రమల ద్వారా ఉపాధి మరియు వాణిజ్యం కోసం కొత్త అవకాశాలను సృష్టించడంలో కృషి చేస్తుంది. ఫలితంగా ప్రపంచ వస్త్ర వ్యాపారంలో భారతదేశం దాని చారిత్రక ఆధిపత్యాన్ని తిరిగి పొందడంలో సహాయపడుతుంది.

టెక్నికల్ టెక్స్‌టైల్స్ సెగ్మెంట్ అనేది ఒక కొత్త యుగం టెక్స్‌టైల్. దీనిలో మౌలిక సదుపాయాలు, నీరు, ఆరోగ్యం మరియు పరిశుభ్రత, రక్షణ, భద్రత, ఆటోమొబైల్స్, విమానయానం మొదలైన అనేక ఆర్ధిక రంగాలలో వర్తింపజేయడం ఆర్థిక వ్యవస్థలోని సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఆ రంగంలో ఆర్ అండ్ డి ప్రయత్నాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం గతంలో జాతీయ సాంకేతిక టెక్స్‌టైల్స్ మిషన్‌ను కూడా ప్రారంభించింది. ఈ విభాగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో పిఎల్‌ఐ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

వివిధ రకాల ప్రోత్సాహక  నిర్మాణంతో రెండు రకాల పెట్టుబడులకు సాధ్యమవుతుంది. ప్లాంట్, మెషినరీ, ఎక్విప్‌మెంట్ మరియు సివిల్ వర్క్స్ (భూమి మరియు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఖర్చు మినహా) లో కనీసం ₹ 300 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఎవరైనా (ఎంఎంఎఫ్‌ ఫ్యాబ్రిక్స్, గార్మెంట్) మరియు టెక్నికల్ ఉత్పత్తుల వస్త్రాలు, పథకం మొదటి భాగంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండవ భాగంలో ఏ వ్యక్తి అయినా (ఇందులో సంస్థ / కంపెనీ కూడా) కనీసం ₹ 100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే, ఈ పథకంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీటితో పాటు ఆశించిన జిల్లాలు, టైర్ 3, టైర్ 4 పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ ప్రాధాన్యత కారణంగా వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమ స్థాపన ప్రోత్సహించబడుతుంది. ఈ పథకం ముఖ్యంగా గుజరాత్, యూపి, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఏపి, తెలంగాణ, ఒడిషా మొదలైన రాష్ట్రాలపై సానుకూల ప్రభావం చూపుతుంది.

ఐదు సంవత్సరాల కాలంలో టెక్స్‌టైల్స్ కోసం పిఎల్‌ఐ స్కీమ్ రూ .19,000 కోట్లకు పైగా తాజా పెట్టుబడికి దారితీస్తుందని అంచనా వేయబడింది, ఈ పథకం కింద రూ .3 లక్షల కోట్లకు పైగా సంచిత టర్నోవర్ సాధించబడుతుంది మరియు అదనపు ఉపాధిని సృష్టిస్తుంది. ఈ రంగంలో 7.5 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు మరియు సహాయక కార్యకలాపాల్లో అనేక లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయి. వస్త్ర పరిశ్రమ ప్రధానంగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది, కాబట్టి, ఈ పథకం మహిళలకు సాధికారతనిస్తుంది మరియు ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుంది.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
'Should I speak in Hindi or Marathi?': Rajya Sabha nominee Ujjwal Nikam says PM Modi asked him this; recalls both 'laughed'

Media Coverage

'Should I speak in Hindi or Marathi?': Rajya Sabha nominee Ujjwal Nikam says PM Modi asked him this; recalls both 'laughed'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Uttarakhand meets Prime Minister
July 14, 2025

Chief Minister of Uttarakhand, Shri Pushkar Singh Dhami met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The Prime Minister’s Office posted on X;

“CM of Uttarakhand, Shri @pushkardhami, met Prime Minister @narendramodi.

@ukcmo”