పిఎల్ఐ ఆటో ప‌థ‌కం వ‌ల్ల అధునాత‌న ఆటోమోటివ్ టెక్నాల‌జీల అంత‌ర్జాతీయ స‌ర‌ఫ‌రా చెయిన్ ఇండియాలో ఆవిర్భివించేందుకు ప్రోత్సాహం ల‌భిస్తుంది.
ఇది 7.6 ల‌క్ష‌ల మందికిపైగా అద‌నంగా ఉపాధి క‌ల్పించేందుకు కృషి చేస్తుంది.
రూ 26,058 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల ప్రోత్సాహ‌కాల‌ను ఐదేళ్ల పాటు ప‌రిశ్ర‌మ‌కు క‌ల్పించ‌డం జ‌రుగుతుంది.
ఆటో రంగానికి పిఎల్ఐ ప‌థ‌కం వ‌ర్తింప‌చేయ‌డం వ‌ల్ల తాజాగా రాగ‌ల 5 సంవ‌త్స‌రాల‌లో 42, 500 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు త‌ర‌లి రానున్నాయి. అలాగే ఇంక్రిమెంట‌ల్ ఉత్ప‌త్తి 2.3 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా చేరుకోనుంది.
డ్రోన్ల‌కు పిఎల్ ఐ ప‌థ‌కం వ‌ర్తింప చేయ‌డం వ‌ల్ల రాగ‌ల 3 సంవ‌త్స‌రాల‌లో 5,000 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు త‌ర‌లి రానున్నాయి. అలాగే ఇంక్రిమెంట‌ల్ ఉత్ప‌త్తి 1,500 కోట్ల‌కు పైగా జ‌ర‌గ‌నుంది.
ఆటోమోటివ్ రంగానికి పిఎల్ఐ ప‌థ‌కం, అలాగే , అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్స్‌కు ఇప్ప‌టికే ప్రారంభించిన పిఎల్ ఐ ప‌థ‌కం ( 18,100 కోట్లు), విద్యుత్ వాహ‌నాల స‌త్వ‌ర త‌యారీ ప‌థ‌కం (ఫేమ్‌) ( 10,000 కోట్లు) తో విద్యుత్ వాహ‌నాల త‌యారీ రంగానికి పెద్త ఎత్తున ప్రోత్సాహం ల‌భిస్తుంది.
ఇండియా త‌యారీ రంగ సామ‌ర్ధ్యాన్ని పెంచేందుకు ఆటో ప‌రిశ్ర‌మ‌, డ్రోన్ ప‌రిశ్ర‌మ‌కు ఉత్పాద‌క‌త‌తో ముడిప‌డిన ప్రోత్సాహ ప‌థ‌కాన్ని (పిఎల్ఐ) ఆమోదించిన ప్ర‌భుత్వం

 ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ దార్శ‌నిక‌త‌ను మ‌రింత ముందుకుతీసుకువెళ్ళ‌డంలో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం ఆటోమొబైల్ ప‌రిశ్ర‌మ‌, డ్రోన్ ప‌రిశ్ర‌మ‌ల‌కు 26,058 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ కేటాయింపుల‌తో పిఎల్ై ప‌థకాన్ని ఆమోదించింది.ఆటో రంగానికి పిఎల్ఐ ప‌థ‌కం ఉన్న‌త విలువ‌గ‌ల అధునాత‌న ఆటోమోటివ్ టెక్నాల‌జీ వాహ‌నాలు, ఉత్ప‌త్తుల‌కు గ‌ణ‌నీయ‌మైన ప్రోత్స‌హకాలు  క‌ల్పిస్తుంది. దీనితో నూత‌నత‌రం ఉన్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానం, మ‌రింత స‌మ‌ర్ధ‌మైన హ‌రిత ఆటోమోటివ్ త‌యారీకి ఇది వీలు క‌ల్పిస్తుంది.

ఆటోమొబైల్ ప‌రిశ్ర‌మ‌, డ్రోన్ ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పిఎల్ ఐ ప‌థ‌కం , 2021-22 కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌భుత్వం 13 రంగాల‌కు ఇంత‌కు ముందు 1.97 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో ప్ర‌క‌టించిన పిఎల్ఐ ప‌థ‌కంలో భాగం. 13 రంగాల‌కు పిఎల్ఐ ప‌థ‌కం ప్ర‌క‌టించ‌డంతో క‌నీస అద‌న‌పు ఉత్ప‌త్తి ఇండియాలో రాగ‌ల 5 సంవ‌త్సరాల‌లో 37.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లుగా ఉండ‌నుంది. దీనితో అద‌నంగా రాగ‌ల 5 సంవ‌త్స‌రాల‌లో కోటి మందికి ఉఫాధి ల‌భించ‌నుంది.

ఆటో రంగానికి పిఎల్ ఐ ప‌థ‌కం వ‌ర్తింపు అధునాత‌న ఆటోమోటివ్ టెక్నాల‌జీ ఉత్ప‌త్తులు ఇండియాలో త‌యారు చేయ‌డానికి గ‌ల ఖ‌ర్చు ఇబ్బందులను అధిగ‌మించ‌డానికి ఉప‌క‌రిస్తుంది. ఈ రంగానికి క‌ల్పిస్తున్న ప్రోత్సాహ‌క వ్య‌వ‌స్థ‌, ప‌రిశ్ర‌మ‌కు తాజా పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డానికి,  దేశీయంగా  అధునాత‌న ఆటోమోటివ్ టెక్నాల‌జీ ఉత్ప‌త్తుల‌కు అంత‌ర్జాతీయ స‌ర‌ఫ‌రా చెయిన్‌ను

స‌మ‌కూర్చ‌డానికి ఉప‌క‌రిస్తుంది. రాగ‌ల 5 సంవ‌త్స‌రాల‌లో ఈ రంగంలో 42,500 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు త‌ర‌లి రావ‌డానికి ఇది ఉప‌క‌రిస్తుంది. అలాగే ఇంక్రిమెంట‌ల్ ఉత్ప‌త్తి 2.3 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగానే ఉంటుంది. ఇది అదనంగా 7.5 ల‌క్ష‌ల మందికి ఉపాధి కల్పించ‌నుంది. దీనికితోడు ఇది అంత‌ర్జాతీయ  అటోమోటివ్ వాణిజ్యంలో ఇండియా వాటా ను పెంచ‌డానికి దోహ‌ద‌ప‌డ‌నుంది.

పిఎల్ ఐ ప‌థ‌కం ఆటో రంగంలోని ప్ర‌స్తుత ఆటో మోటివ్ కంపెనీల‌కు ,ప్ర‌స్తుతం  ఆటో మొబైల్ రంగంలో లేని కొత్త ఇన్వెస్ట‌ర్లకు లేదా ఆటో విడిప‌రిక‌రాల త‌యారీ రంగ‌లోని వారికి ఉప‌క‌రిస్తుంది. ఈ ప‌థ‌కంలో రెండు భాగాలున్నాయి అందులో ఒక‌టి ఛాంపియ‌న్ ఒఇఎం ఇన్సెంటివ్ స్కీమ్‌, రెండోది కాంపొనెంట్ ఛాంపియ‌న్ ఇన్సెంటివ్ స్కీమ్‌.ఛాంపియ‌న్ ఒఇఎం ఇన్సెంటివ్ ప‌థ‌కం అనేది అమ్మ‌కం విలువ తో అనుసంధాన‌మైన ప‌థ‌కం. అన్నిరంగాల‌కు చెందిన బ్యాట‌రీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, హైడ్రోజ‌న్ ఫ్యూయ‌ల్ సెల్ వాహ‌నాలు, సికెడి, సెమి సికెడి  కిట్లు, ద్విచ‌క్ర, త్రిచ‌క్ర‌, పాసింజ‌ర్‌, క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాలు, ట్రాక్ట‌ర్ల‌ అగ్రిగేట్స్‌కు ఇది వ‌ర్తిస్తుంది. 

ఆటోమోటివ్ రంగ పిఎల్ఐ ప‌థ‌కం, దానితోపాటు ఇప్ప‌టికే ప్రారంభించిన ఆడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ పిఎల్ఐ ప‌థ‌కం 

( 18,100 కోట్లు), విద్యుత్‌వాహ‌నాల స‌త్వ‌ర త‌యారీ(ఫేమ్ ) ప‌థ‌కం (10,000 కోట్లు) వ‌ల్ల ఇండియా సంప్ర‌ప‌దాయ శిలాజ ఇంధ‌న ఆధారిత ఆటోమొబైల్ ర‌వాణా రంగ వ్య‌వ‌స్థ‌నుంచి ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌ర‌మైన సుస్థిర‌, అధునాత‌న‌, మ‌రింత స‌మ‌ర్ధ‌మైన విద్యుత్ వాహ‌నాల ఆధారిత వ్య‌వ‌స్థ‌కు మారేందుకు వీలుక‌లుగుతుంది.

 

డ్రోన్‌లు, డ్రోన్ ఉప‌క‌ర‌ణాల ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన పిఎల్ఐ ప‌థ‌కం వ్యూహాత్మ‌కంగా విప్ల‌వాత్మ‌క సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగంలోకి తేవ‌డానికి వీలు క‌లిగిస్తుంది. డ్రోన్ల‌కు సంబంధించి ఉత్ప‌త్తి ప్రత్యేక పిఎల్ఐ ప‌థ‌కానికి స్ప‌ష్ట‌మైన రెవిన్యూ ల‌క్ష్యాలు ఉన్నాయి. ఇది దేశీయ విలు వ‌జోడింపుపై దృష్టిపెడుతుంది.దీనికితోడు సామ‌ర్ధ్యాల‌పెంపుపై దృష్టి సారిస్తుంది. ఇవి ఇండియా వృద్ధి వ్యూహానికి చోద‌క శ‌క్తిగా ప‌నిచేస్తాయి. డ్రోన్ల‌కు, డ్రోన్ కాంపొనెంట్ ప‌రిశ్ర‌మ‌కు పిఎల్ఐ ప‌థ‌కం రాగ‌ల మూడు సంవ‌త్స‌రాల‌లో, 

5000 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌కు మార్గం సుగ‌మం చేస్తుంది. అలాగే 1500 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల అమ్మ‌కాలు పెర‌గ‌డంతో పాటు 10 వేల మందికి ఇది ఉపాధి క‌ల్పించ‌నుంది.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi