ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎగుమతుల రంగానికి ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఈరోజు ఇసిజిసి లిమిటెడ్ ( పూర్వపు ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) కు ఐదు సంవత్సరాల కాలంలో రూ 4,400 కోట్ల రూపాయలను 2021-22,2025-26 ఆర్ధిక సంవత్సర కాలానికి పెట్టుబడి సమకూర్చేందుకు ఆమోదించింది. ప్రస్తుతం ఆమోదించిన పెట్టుబడిని ఇసిజిసి లిస్టింగ్ ప్రక్రియతో అనుసంధానం చేస్తూ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరరరింగ్ ద్వారా సమకూర్చనుంది. ఇది మరిన్ని ఎగుమతులకు మద్దతు నిచ్చేందుకు అండర్ రైటింగ్ సామర్ధ్యాన్ని పెంచనుంది.
కార్మికులు అధికంగా గల రంగాలనుంచి ఎగుమతులకు మద్దతునిచ్చేందుకు ఇసిజిసి కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే చిన్న ఎగుమతిదారులకు బ్యాంకు రుణాలను ప్రోత్సహించి తిరిగి వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు ఇది ఉపకరిస్తుంది. ఇసిజిసికి పెట్టుబడి సమకూర్చడం ద్వారా ఎగుమతి దాయక పరిశ్రమలు , ప్రత్యేకించి కార్మికులు ఎక్కువగా గల రంగాలకు తన కార్యకలాపాలను విస్తరించడానికి ఉపకరిస్తుంది. ఆమోదిత మొత్తం, వాయిదాల రూపంలో సంస్థలోకి పంపడం జరుగుతుంది. ఇది అండర్ రైటర్ రిస్క్‌లను 88 వేల కోట్ల రూపాయల వరకు పెంచనుంది. ఇది ఇసిజిసికి 5.28 లక్షల కోట్ల రూపాయల మేరకు అదనపు ఎగుమతులకు రాగల 5 సంవత్సరాల కాలానికి ప్రస్తుత విధానంలో మద్దతునిస్తుంది.
దీనికి అదనంగా, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ కార్మిక సంస్థ లు 2019లో ప్రకటించిన నివేదికలకు అనుగుణంగా 5.28 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు 2.6 లక్షల కార్మికుల ఫార్మలైజేషన్‌కు ఉపకరిస్తుంది. దీనికి తోడు మొత్తం కార్మికుల సంఖ్య (వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత ) రంగాలలో ఉద్యోగుల సంఖ్య ఈ నివేదిక ప్రకారం 59 లక్షలకు పెరగనుంది.
ఇసిజిసి పనితీరు ముఖ్యాంశాలు.
1. ఇండియాలో ఎగుమతుల క్రెడిట్ ఇన్సూరెన్స్ మార్కెట్‌కు సంబంధించి ఇసిజిసి 85 శాతం మార్కెట్‌తో మార్కెట్ లీడర్‌గా ఉంది.
2.ఇసిజిసి మద్దతుతో సాగిన ఎగుమతులు 2020-21లో రూ 6.02 లక్షలు. ఇవి ఇండియా వాణిజ్య ఎగుమతులలో సుమారు 28 శాతం వరకు ఉన్నాయి.
3. 31-3-2021 నాటికి ప్రయోజనం పొందిన ప్రత్యేక ఎగుమతి దారులు 7,372, ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ ఇన్సూరెన్స్ ఫర్ బ్యాంక్స్ కింద ప్రయోజనం పొందినవారు 9,535. ఇందులో 97 శాతం చిన్న ఎగుమతి దారులు ఉన్నారు.
4. బ్యాంకులు చేసే మొత్తం రుణ పంపిణలో 50 శాతం మొత్తానికి ఇసిజిసి ఇన్సూర్ చేస్తుంది. ఇందులో 22 బ్యాంకులు ఉన్నాయి. ( 12 ప్రభుత్వరంగ బ్యాంకులు, 10 ప్రైవేటు బ్యాంకులు)
5. ఇసిజిసి వద్ద 5 లక్షలమందికి పైగా విదేశీ కొనుగోలుదార్ల డాటాబేస్ ఉంది.
6. ఇది గత దశాబ్దంలో రూ 7,500 కోట్ల రూపాయల మేరకు క్లెయిమ్‌లను పరిష్కరించింది.
7. ఇది ఆఫ్రికా ట్రేడ్ ఇన్సూరెన్స్ (ఎటిఐ) లో 11.7 మిలియన్ డాలర్లుపెట్టుబడి పెట్టింది. ఆఫ్రికా మార్కెట్‌కు భారతీయ ఎగుమతులు చేసేందుకు వీలుగా ఇసిజిసి క్రమంతప్పకుండా మిగులు సూచించింది. అలాగే గత 20 సంవత్సరాలుగా భారత ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లిస్తూ వస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన వివిధ ఎగుమతి సంబంధిత పథకాలు:
1. కోవిడ్ -19 మహమ్మారి నేపథయంలో విదేశీ వాణిజ్య విధానం (2015-20)ని 30-09-2021 వరకు పొడిగించారు.
.2.స్క్రిప్ట్ బేస్ స్కీమ్ కింద కోవిడ్ -19 కాలంలో లిక్విడిటీ కల్పించేందుకు రూ 56,027 కోట్ల రూపాయలను 2021 సెప్టెంబర్‌లో విడుదల చేయడం జరిగింది.
3. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్, టాక్సెస్, అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రాడక్ట్స్ ( ఆర్.ఒ.డి.టి.ఇ.పి ) పేరుతో కొత్త పథకాన్ని తీసకురావడం జరిగింది. ఈపథకానికి 2021-22, ఆర్ధిక సంవత్సరంలో ఆమోదిత మొత్తం రూ 12,454 కోట్ల రూపాయలు. పన్నులు, సుంకాలు, లెవీల తిరిగి చెల్లింపునకు సంబంధించి డబ్ల్యుటిఒ విధివిధానాలకు అనుగుణమైనది. ప్రస్తుతం ఏ ఇతర విధానం కింద కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిలో రిఫండ్ పొందని వాటికి ఇది వర్తిస్తుంది.
4. కేంద్ర, రాష్ట్ర పన్నులను ఆర్.ఒ.ఎస్.సి.టి.ఎల్ పథకం కింద రెమిషన్ ద్వారా టెక్స్‌టైల్ రంగానికి మద్దతు కల్పించడం జరిగింది. దీనిని 2024 మార్చి వరకు పొడిగించడం జరిగింది.
5సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజన్‌కు కామన్ డిజిటల్ ప్లాట్‌ఫారం ప్రారంభించడం జరిగింది. ఎగుమతిదారులు ఎఫ్.టి.ఎ వినియోగాన్ని పెంచేందుకు, వాణిజ్యానికి వీలుగా దీనిని ప్రారంభించారు.
6. సమగ్ర వ్యవసాయ ఎగుమతుల విధానం ఎగుమతుల సంబంధిత వ్యవసాయం, పండ్లతోటలు, పశుగణాభివృద్ధి, మత్స్యపరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ఊతం ఇస్తుంది. ఇది ప్రస్తుతం అమలులో ఉంది.
7. పన్నెండు ఛాంపియన్ సర్వీసెస్ రంగాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను చేపట్టడం ద్వారా సేవల ఎగుమతులను ప్రోత్సహించడం, వైవిద్యీకరించడానికి చర్యలు
8. జిల్లాలను ఎగుమతుల హబ్‌లుగా ప్రోత్సహించడం. ప్రతి జిల్లాలో ఎగుమతుల సామర్ధ్యంగల ఉత్పత్తులను గుర్తించి , ఈ ఎగుమతిదాయక ఉత్పత్తులకు సంబంధించి ఇబ్బందులను తొలగించడం, స్థానిక ఎగుమతిదారులు, తయారీదారులకు జిల్లాలో ఉపాధి కల్పించడం,
9. ఇండియా వాణిజ్యం, పర్యాటకం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు విదేశాలలోని భారతీయ మిషన్‌లు క్రియాశీల పాత్ర పోషించేట్టు చూడడంతోపాటు పెట్టుబడి లక్షాలనుపెంచడం..
10. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో దేశంలోని పరిశ్రమలు ప్రత్యేకించి ఎం.ఎస్.ఎం.ఇలకు వివిధ బ్యాంకుల ద్వారా మద్దతు నివ్వడం, ఆర్థిక రంగ చర్యలు ఎగుమతుల విషయంలొ ప్రధాన వాటా కలిగి ఉన్నాయి.
11. ఎగుమతుల పథకానికి ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ( టిఐఇఎస్), మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ (ఎం.ఎ.ఐ) పథకం, ట్రాన్స్‌పోర్ట్, మార్కెటింగ్ అసిస్టెన్స్ (టిఎంఎ) పథకాలు వాణిజ్య మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ ప్రోత్సాహకానికి సంబంధించినవి.