జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం అయినటువంటి ఈ రోజు న వివిధ రంగాల లో ప్రముఖ భారతీయ మహిళా శాస్త్రవేత్తల పేర్ల తో 11 పీఠాల కు ప్రభుత్వం ప్రకటించింది. వేరు వేరు రంగాల లో రాణిస్తున్న , యువ మహిళా పరిశోధకుల కు తగిన గుర్తింపు ను ఇవ్వడం కోసం, మరి అలాగే మహిళల లో స్ఫూర్తి ని నింపి, వారి ని ప్రోత్సహించడానికి, వారికి సాధికారిత ను కల్పించడానికిగాను ఈ చర్య ను తీసుకోవడమైంది.
మహిళ ల సాధికారిత కు అనేక పథకాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. మరి తాజా చర్య ఈ సంవత్సరం యొక్క జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం తాలూకు ఇతివృత్తం అయినటువంటి ‘విజ్ఞాన శాస్త్రం లో మహిళలు’ కు అనుగుణం గా ఉన్నది.
వ్యవసాయం, బయోటెక్నాలజీ, వ్యాధి నిరోధక చికిత్స విధానం, ఫైటోమెడిసిన్, బయో కెమిస్ట్రీ, వైద్య శాస్త్రం, సామాజిక విజ్ఞాన శాస్త్రాలు, అర్థ్ సైన్స్ & మీటియరోలజి, ఇంజినీరింగ్, గణితశాస్త్రం మరియు భౌతిక శాస్త్రం, ఇంకా మౌలిక పరిశోధన లు సహా పరిశోధన సంబంధి భిన్న భిన్న రంగాల లో ఈ 11 పీఠాల ను ఏర్పాటు చేయడమైంది.
ఈ పీఠాల లో ఒక పీఠాన్ని ప్రముఖ మానవ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఐరావతి కార్వే పేరిట స్థాపించడం జరిగింది.
వివరణ ఈ క్రింది విధంగా ఉంది:
వ. సం. ఎవరి పేరిట పీఠాన్ని ఏర్పాటు చేయనున్నది ఏ ఏ రంగాల తో శాస్త్రవేత్త కు అనుబంధం ఉన్నది
1. ప్రముఖ జీవకణ వంశానుగత తత్వ శాస్త్రవేత్త డాక్టర్ అర్చన శర్మ (1932-2008) వ్యవసాయం మరియు సంబంధిత పరిశోధన
2. అగ్రగామి వృక్ష సంబంధ శాస్త్రవేత్త,
డాక్టర్ జానకి అమ్మాళ్ (1897-1984) బయోటెక్నాలజీ
3. ఆర్గానిక్ కెమిస్ట్ డాక్టర్ దర్శన్ రంగనాథన్ (1941-2001) వ్యాధినిరోధక చికిత్స విధానం
4. శ్రేష్ఠురాలైన రసాయన శాస్త్రవేత్త,
డాక్టర్ అశిమ చటర్జీ (1917-2006) ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫైటోమెడిసిన్
5. అపోహ ను ఛేదించినటువంటి ఒక వైద్యురాలు డాక్టర్ కాదంబిని గాంగులి (1861-1923) వైద్య శాస్త్రం
6. మానవుల సంబంధిత అధ్యయనం లో
డాక్టర్ ఐరావతి కార్వే (1905-1970) సమాజ శాస్త్రం
7. అగ్రగామి భారతీయ వాతారవణ శాస్త్రవేత్త
డాక్టర్ అణ్ణా మణి (1918-2001) వాతావరణ శాస్త్రం
8. కర్నాటక కు చెందిన రాష్ట్ర ప్రథమ మహిళా ఇంజినీర్
డాక్టర్ రాజేశ్వరీ చటర్జీ (1922-2010) ఇంజినీరింగ్
9. గణిత శాస్త్రవేత్త (భట్ నాగర్ అవార్డు, 1987 స్వీకర్త) డాక్టర్ రామన్ పరిమళ (పుట్టిన సంవత్సరం 1948) గణిత శాస్త్రం
10. బిభ చౌధరి (1913-1991) భౌతిక శాస్త్రం
11. కమల్ రణదివే (నవంబర్ 8, 1917- 2001) [ వైద్య శాస్త్రం ] బయో మెడికల్ రిసర్చ్
పరిశోధన రంగాలు మరియు పీఠాల కు సంబంధించిన మరింత వివరణ కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.