ఏసుక్రీస్తు కరుణకు నిలువెత్తు ప్రతిరూపమని అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సందేశం ఇచ్చారు. "ఏసుక్రీస్తు జీవితంలోని సంఘర్షణలను త్యాగాలను గుడ్ ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది. కరుణకు నిలువెత్తు రూపమైన ఆయన- ఆర్తులను ఆదుకోవడానికి ఆపన్నులకు ఉపశమనం కల్పించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు" అని ఆ సందేశంలో ప్రధాని పేర్కొన్నారు.
Good Friday reminds us about the struggles and sacrifices of Jesus Christ. A perfect embodiment of compassion, He was devoted to serving the needy and healing the sick.
— Narendra Modi (@narendramodi) April 2, 2021