అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ రెండు మెగా రోడ్‌షోలు నిర్వహించారు. మొదటి రోడ్‌షో అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి సబర్మతి ఆశ్రమం వరకు జరిగింది, అక్కడ నాయకులు మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. మరో రోడ్‌షో సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభమై మోటెరాలోని క్రికెట్ స్టేడియంలో ముగిసింది, ఇక్కడ 'నమస్తే ట్రంప్' కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ లకు స్వాగతం పలకడానికి అన్ని వర్గాల ప్రజలు వీధుల్లోకి వచ్చారు.


