ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో చైనా స్టేట్ కౌన్సిలర్ మరియు రక్షణ మంత్రి జనరల్ శ్రీ వెయ్ ఫెంఘే ఈ రోజు సమావేశమయ్యారు.
భారతదేశానికి, చైనా కు మధ్య రక్షణ, ఇంకా సైన్య సంబంధ ఆదాన ప్రదానాల రంగాలు సహా అన్ని రంగాల లో ఉన్నత స్థాయి సంబంధాలు వేగాన్ని పుంజుకోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రశంసలు కురిపించారు.
ప్రపంచం లో స్థిరత్వానికి భారతదేశం-చైనా సంబంధాలు ఒక కారణమని ప్రధాన మంత్రి పేర్కొంటూ, భారతదేశం, చైనా ల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ఇంకా ప్రశాంతత ల యొక్క పరిరక్షణ ఆ రెండు పక్షాలు వాటి మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను వివాదాలుగా ముదరనివ్వకుండా సున్నితత్వంతోను, పరిణతి తోను పరిష్కరించుకొంటూ ఉండడాన్ని సూచిస్తోందని వివరించారు.
అధ్యక్షులు శ్రీ శీ జిన్ పింగ్ తో ఇటీవల వుహాన్ లో, కింగ్ డావో లో, ఇంకా జోహాన్స్ బర్గ్ లో తాను జరిపిన సమావేశాలను కూడా ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఉత్సాహంగా గుర్తుకు తెచ్చుకున్నారు.