QuoteOur freedom was not only about our country. It was a defining moment in ending colonialism in other parts of the world too: PM
QuoteThe menace of corruption has adversely impacted our country's development journey: PM Modi
QuotePoverty, lack of education and malnutrition are big challenges that our nation faces today, says PM Modi
QuoteIn 1942, the clarion call was 'Karenge Ya Marenge' - today it is 'Karenge Aur Kar Ke Rahenge.'
QuoteFrom 2017-2022, these five years are about 'Sankalp Se Siddhi’, says PM Modi

క్విట్ ఇండియా ఉద్య‌మానికి నేటితో 75 సంవ‌త్స‌రాలు పూర్తి అవుతున్న సంద‌ర్భంగా, లోక్ స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. 

క్విట్ ఇండియా ఉద్య‌మం వంటి ఉద్య‌మాల‌ను జ్ఞ‌ప్తికి తెచ్చుకోవ‌డం, వాటిని నుండి ప్రేర‌ణ పొంద‌డానికి ఒక మార్గమ‌ని, ఆ త‌ర‌హా ఉద్య‌మాల వార‌స‌త్వాన్ని భావి తరాల‌వారికి అంద‌జేసే బాధ్య‌త ప్ర‌స్తుత త‌రం పైన ఉంద‌ని ఆయ‌న అన్నారు. 

క్విట్ ఇండియా ఉద్య‌మం ఆర‌ంభంలో మ‌హాత్మ గాంధీ వంటి సీనియ‌ర్ నాయ‌కులను ఎంద‌రినో జైలులో పెట్టినప్ప‌టికీ, ఆ శూన్యాన్ని భ‌ర్తీ చేస్తూ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకుపోవడానికి కొత్త త‌రం నేత‌లు ఎదిగి వచ్చార‌ని ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. 

స్వాతంత్య్ర పోరాటం అనేక ద‌శ‌లలో సాగింద‌ని, 1857 నాటి నుండి వేరు వేరు కాలాల‌లో భిన్న‌మైన ఉద్య‌మాలు జ‌రిగాయ‌ని, వాటికి వివిధ నాయ‌కులు ఆవిర్భ‌వించార‌ని కూడా ఆయ‌న గుర్తు చేశారు. 1942 లో మొద‌లైన క్విట్ ఇండియా ఉద్య‌మం ఒక నిర్ణ‌యాత్మ‌క‌మైనటువంటి ఉద్య‌మ‌మ‌ని ఆయ‌న చెప్పారు. గాంధీ గారి మాట‌ల‌ను ప్ర‌ధాన మంత్రి ఉదాహ‌రిస్తూ, మ‌హాత్మ గాంధీ ఇచ్చిన “డు ఆర్ డై” నినాదాన్ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు అందుకొని ఉద్య‌మంలో చేరార‌ని వివ‌రించారు. రాజ‌కీయ నేత‌ల మొద‌లు సామాన్య మాన‌వుడి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు మనస్సులో ఇదే ప్రేర‌ణ‌తో న‌డుచుకొన్నార‌ని ఆయ‌న అన్నారు. ఒకసారి ఈ ఉమ్మ‌డి సంక‌ల్పాన్ని యావ‌త్ దేశం తీసుకొన్న తరువాత, స్వాతంత్య్ర ల‌క్ష్యాన్ని సాధించ‌డానికి 5 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే ప‌ట్టింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. 

ఆ కాలం నాటి మాన‌సిక అవ‌స్థ‌ను వ‌ర్ణించడానికి ర‌చ‌యిత రామ‌వృక్ష బేణిపురి తో పాటు క‌వి సోహ‌న్ లాల్ ద్వివేదీ ల మాట‌ల‌ను ప్ర‌ధాన మంత్రి ఉదాహ‌రించారు. 

|

అవినీతి, పేద‌రికం, నిర‌క్ష‌రాస్య‌త మ‌రియు పోషకాహార లోపాలు ప్ర‌స్తుతం భార‌త‌దేశం ఎదుర్కొంటున్న స‌వాళ్ళ‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, ఈ స‌వాళ్ళ‌ను అధిగ‌మించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. ఈ స‌వాళ్ళ‌ను అధిగ‌మించ‌డానికి ఒక స‌కారాత్మ‌కమైన ప‌రివ‌ర్త‌న‌ తో పాటు ఒక ఉమ్మ‌డి సంక‌ల్పం కూడా అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. స్వాతంత్య్ర స‌మ‌రంలో మ‌హిళ‌లు పోషించిన పాత్ర‌ను సైతం ఆయ‌న ప్ర‌స్తావించారు. మ‌న ఉమ్మ‌డి ల‌క్ష్యాల సాధ‌న‌లో మ‌హిళ‌లు ఈనాటికీ విస్తృత‌మైన శ‌క్తిని జోడించ‌గ‌ల‌ర‌ు అని ఆయ‌న అన్నారు. 

హ‌క్కులు మ‌రియు విధుల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, మ‌న హ‌క్కులు ఏమిట‌న్న‌ది మ‌న‌కు ఎరుకేన‌ని, మ‌న విధుల‌ను మ‌నం మ‌ర‌చిపోకూడ‌ద‌ని, మ‌న జీవ‌న విధానంలో ఇవి త‌ప్ప‌క ఒక‌ భాగం కావాల‌న్నారు. 

వ‌ల‌స రాజ్య పాల‌నకు నాంది భార‌త‌దేశంలో జరిగింద‌ని, అలాగే భార‌త‌దేశ స్వాతంత్య్ర సిద్ధితో దానికి భ‌ర‌త వాక్యం ప‌ల‌క‌డం కూడా జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. త‌ద‌నంత‌రం ఆసియా మ‌రియు ఆఫ్రికా అంత‌టా వేగంగా వ‌ల‌స రాజ్యాల ప‌త‌నం చోటు చేసుకొన్నట్లు ఆయ‌న చెప్పారు. 

1942వ సంవ‌త్స‌రంలో భార‌త‌దేశం స్వాతంత్య్రం సంపాదించుకోవ‌డానికి అంత‌ర్జాతీయంగా అనుకూల‌మైన‌ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అదే విధంగా ప్ర‌పంచంలోని స్థితిగ‌తులు మ‌రో మారు భార‌త‌దేశానికి అనువుగా ఉన్నాయ‌ని చెప్పారు. 1857 నుండి 1942 వ‌ర‌కు స్వాతంత్య్రం దిశ‌గా ప‌య‌నం సాగుతూ వ‌చ్చింద‌ని, అయితే 1942 నుండి 1947 మధ్య కాలం మార్పున‌కు ఆస్కారం క‌లిగించేదిగా రూపొంది, ల‌క్ష్యాన్ని సిద్ధింప‌జేసిందని ఆయ‌న అన్నారు. పార్ల‌మెంటు స‌భ్యులు విభేదాలకు అతీతంగా ఎదిగి, 2017 నుండి.. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవ‌త్స‌రాలు పూర్తి అయ్యే 2022 వ‌ర‌కు.. అంటే, వ‌చ్చే 5 సంవ‌త్స‌రాల‌లోనూ, స్వాతంత్య్ర స‌మ‌రయోధులు క‌ల‌లు గ‌న్న ఒక భార‌త‌దేశాన్ని నిర్మించే ఉమ్మ‌డి కృషిలో పాలుపంచుకోవాలని ప్ర‌ధాన మంత్రి కోరారు. 

|

1942వ సంవ‌త్స‌రంలో ఇచ్చిన పిలుపు “క‌రేంగే యా మ‌రేంగే” (చేస్తాం లేదా చ‌స్తాం) అన్న పిలుపును ఇవ్వ‌డం జ‌రుగ‌గా, ప్ర‌స్తుతం “క‌రేంగే ఔర్ క‌ర్ కే ర‌హేంగే” (చేస్తాం మ‌రియు చేస్తూనే ఉంటాం) అనే పిలుపును ఇవ్వాల్సి ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అంతే కాకుండా రానున్న 5 సంవ‌త్స‌రాలు “సంక‌ల్ప్ కే సిద్ధి” ని చాటుతాయ‌ని ఆయ‌న అన్నారు; “స‌ంక‌ల్ప్ కే సిద్ధి” తీర్మానం మ‌న‌ను విజ‌య సాధ‌న వైపు న‌డిపిస్తుంద‌ని చెప్పారు. 

ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగాన్ని ముగించే ముందు- అవినీతిని అధిగ‌మించ‌డం కోసం, పేద‌ల‌కు వారి హ‌క్కుల‌ను అందించ‌డం కోసం, యువ‌త‌కు స్వ‌తంత్రోపాధిని క‌ల్పించ‌డం కోసం, పోషకాహార లోపానికి స్వ‌స్తి ప‌ల‌క‌డం కోసం, మ‌హిళల సాధికార‌త‌కు అవ‌రోధాల‌ను తొల‌గించ‌డం కోసం మ‌రియు నిర‌క్ష‌రాస్య‌త‌ను అంత‌మొందించ‌డం కోసం ఈ కింది సంక‌ల్పాన్ని ప్ర‌స్తావించారు: 

  • हम सभी मिलकर देश से भ्रष्टाचार दूर करेंगे, और करके रहेंगे
  • हम सभी मिलकर गरीबों को उनका अधिकार दिलाएंगे और दिलाकर रहेंगे
  • हम सभी मिलकर नौजवानों को स्वरोजगार के और अवसर देंगे और देकर रहेंगे
  • हम सभी मिलकर देश से कुपोषण की समस्या को खत्म करेंगे और करके रहेंगे
  • हम सभी मिलकर महिलाओं को आगे बढ़ने से रोकने वाली बेड़ियों को खत्म करेंगे और करके रहेंगे
  • हम सभी मिलकर देश से अशिक्षा को खत्म करेंगे और करके रहेंगे
Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Govt launches 6-year scheme to boost farming in 100 lagging districts

Media Coverage

Govt launches 6-year scheme to boost farming in 100 lagging districts
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Lieutenant Governor of Jammu & Kashmir meets Prime Minister
July 17, 2025

The Lieutenant Governor of Jammu & Kashmir, Shri Manoj Sinha met the Prime Minister Shri Narendra Modi today in New Delhi.

The PMO India handle on X wrote:

“Lieutenant Governor of Jammu & Kashmir, Shri @manojsinha_ , met Prime Minister @narendramodi.

@OfficeOfLGJandK”