ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మరియు యూరోప్ మంత్రి అయిన శ్రీ జీన్-యుఎస్ లీ డ్రియాన్ ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు.
ఆయన 2017 జూన్ లో ప్రధాన మంత్రి ఫ్రాన్స్ పర్యటన దరిమిలా ద్వైపాక్షిక సంబంధాలలో చోటు చేసుకొన్న పరిణామాలను గురించి ప్రధాన మంత్రికి వివరించారు.
శ్రీ లీ డ్రియాన్ తన ప్రస్తుత పదవి లోను, అంత క్రితం ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి పదవి లోను భారతదేశం-ఫ్రాన్స్ అనుబంధం పెంపొందడం కోసం అందించిన తోడ్పాటును ప్రధాన మంత్రి అభినందించారు.
భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాదని, ప్రాంతీయ మరియు ప్రపంచ పరిధులలో శాంతికి, స్థిరత్వానికి సైతం తోడ్పడగలదని ప్రధాన మంత్రి అన్నారు.
అధ్యక్షులు శ్రీ మేక్రాన్ ఆయనకు వీలైనంత త్వరగా భారతదేశానికి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలకాలని తాను ఎదురుచూస్తున్నట్లు కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.