ఆహారం , పోషకాహార భద్రత కల్పన దిశగా కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం :
పీఎంజీకెవై కింద ఆధార సబ్సిడీ కింద రానున్న 5 సంవత్సరాల కాలంలో దాదాపు 11.80 లక్షల కోట్లు సమకూర్చనున్న కేంద్ర ప్రభుత్వం
దాదాపు రూ. 11.80 లక్షల కోట్లతో సుమారు 81.35 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా పథకం లో ఒకటిగా గుర్తింపు పొందిన పీఎంజీకెవై

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ( పీఎంజీకెవై ) కింద దేశంలో  81.35 కోట్ల మంది లబ్ధిదారులకు ఐదేళ్లపాటు ఉచిత ఆహారధాన్యాల పంపిణీ చేయాలని ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశం అయిన  కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2024 జనవరి 1వ తేదీ నుంచి కార్యక్రమం అమలు జరుగుతుంది. 

 81.35 కోట్ల మందికి ఆహార, పోషకాహార భద్రత  కల్పించే లక్ష్యంతో  పీఎంజీకెవై కి అమలు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయంతో ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సంక్షేమ పథకాల్లో ఒకటిగా  పీఎంజీకెవై గుర్తింపు పొందుతుంది 5 సంవత్సరాల కాలంలో 11.80 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో పథకం అమలు జరుగుతుంది.  

ప్రజలకు అవసరమైన ఆహారం,పోషకాహార అవసరాలు తీర్చి సమర్థవంతమైన, లక్ష్య సంక్షేమం దిశగా పరిపాలన సాగాలి అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆకాంక్ష కార్యరూపం దాల్చేలా చూసేందుకు మంత్రివర్గం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఉపకరిస్తుంది.  ఆహార భద్రత కల్పించి  ఆకాంక్షాత్మక  అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి అంకితభావంతో కృషి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

పీఎంజీకెవై కింద 1.1.2024 నుంచి  5 సంవత్సరాల పాటు ఉచితంగా సరఫరా చేసే  ఆహార ధాన్యాలు (బియ్యం, గోధుమలు  ముతక ధాన్యాలు/ చిరుధాన్యాలు ) ఆహార భద్రతను పటిష్టం చేస్తాయి.  జనాభాలోని పేద, బలహీన వర్గాలకు చెందిన ప్రజల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.ఒకే విధమైన  లోగో కింద దేశంలో 5 లక్షలకు పైగా సరసమైన ధరల దుకాణాల  ద్వారా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతుంది. 

దేశంలో అమలు జరుగుతున్న ఒక దేశం ఒక రేషన్ కార్డు కార్యక్రమం కింద లబ్ధిదారులు  దేశంలోని ఏదైనా సరసమైన ధరల దుకాణం నుంచి  ఉచితంగా ఆహార ధాన్యాలు తీసుకోవడానికి అవకాశం ఉంది.  పీఎంజీకెవై కింద కూడా ఒక దేశం ఒక రేషన్ కార్డు కింద లబ్ధిదారులు సులువుగా ఉచిత రేషన్ పొందవచ్చు.దీనివల్ల సులభతరం జీవన విధానం గడపవచ్చు దీనివల్ల  వలసదారులకు ప్రయోజనం కలుగుతుంది.డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అమలు జరుగుతున్న సాంకేతిక ఆధారిత సంస్కరణల్లో భాగంగా లబ్ధిదారులు ఒక రాష్ట్రం లేదా తాము నివసిస్తున్న రాష్ట్రంలో ఆహార ధనియాలు పొందవచ్చు.. ఉచిత ఆహార ధాన్యాలు ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఒక దేశం ఒక రేషన్ వార్డు  కింద పోర్టబిలిటీని ఆమోదిస్తుంది. 

పీఎంజీకేఏవై కింద ఆహార ధాన్యాల పంపిణీ చేయడానికి  ఐదేళ్లపాటు ఆహార సబ్సిడీ కింద సుమారు రూ. 11.80 లక్షల కోట్లు ఖర్చవుతుంది. సుబీసీడీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరించి సబ్సిడీగా వచ్చే ఐదేళ్ల కాలంలో 11.80 లక్షల కోట్లు అందిస్తుంది. 

ప్రజలకు ఆహార, పోషకాహార భద్రత కల్పించడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం కలుగుతుందన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా  2024 జనవరి 1 నుంచి  ఐదేళ్లపాటు  పీఎంజీకెవై కింద ఉచిత ఆహార ధాన్యాలు సరఫరా చేస్తారు.  ఉచిత ఆహార ధాన్యాల సరఫరా చేయడం వల్ల  సమాజంలో ప్రభావిత వర్గాల ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయి.  లబ్ధిదారులపై ఎటువంటి ఆర్థిక భారం మోపకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పథకం అమలు జరుగుతుంది. 

ఒక  అంత్యోదయ కుటుంబం తన అవసరాల కోసం 35 కిలోల బియ్యం కోసం 1371 రూపాయలు , 35 కిలోల గోధుమ కోసం  946 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, పీఎంజీకేఏవై  కింద ఈ మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం  భరిస్తుంది.  ఆహారధాన్యాలు కుటుంబాలకు పూర్తిగా ఉచితంగా అందుతాయి.ప్రభుత్వ నిర్ణయం వల్ల  ఉచిత ఆహార ధాన్యాల ఖాతాలో రేషన్ కార్డు కలిగిన వారందరికీ  నెలవారీ పొదుపు గణనీయంగా ఉంటుంది.

తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహార ధాన్యాల సరఫరా చేసి ప్రజలకు ఆహార, పోషకాహార భద్రతను కల్పించి  గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూడాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తోంది. పీఎంజీకేఏవై  పరిధిలోకి వచ్చే81.35 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం వల్ల ప్రయోజనం కలుగుతుంది. 

లబ్ధిదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, లక్ష్య జనాభాకు ఆహార ధాన్యాల లభ్యత, స్థోమత, లభ్యత పరంగా ఆహార భద్రతను బలోపేతం చేయడానికి,దేశ వ్యాప్తంగా ఏకరూపతను కొనసాగించడానికి  ఐదేళ్లపాటు పీఎంజీకేఏవై కింద ఉచితంగా.ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry

Media Coverage

Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 డిసెంబర్ 2024
December 26, 2024

Citizens Appreciate PM Modi : A Journey of Cultural and Infrastructure Development