ప్రపంచం లో అతి ఎత్తయిన విగ్రహాన్ని సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ కు గుర్తు గా గుజరాత్ లో నిర్మించినందుకుగాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి. దెవె గౌడ ప్రశంసించారు. సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ స్మృతి చిహ్నాన్ని ఆయన స్వస్థలమైన గుజరాత్ లోని నాదియాడ్ లో ఇదివరకే నిర్మించడమైందని, అలాగే అహమదాబాద్ విమానాశ్రయం పేరు ను మార్చి సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం గా పునర్ నామకరణం చేయడం జరిగిందని శ్రీ దేవె గౌడ గుర్తు చేశారు.
భారతదేశపు ఉక్కు మనిషి కి ప్రపంచం లో కెల్లా అతి ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించడం ద్వారా ఈ కార్యాల కు ఒక తర్కబద్ధమైనటువంటి ముగింపు ను ఇచ్చినట్లయింది అని ఆయన పేర్కొన్నారు. సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ విగ్రహాన్ని మరింత ఎక్కువ ఆకర్షణీయం గా మలచడం తో పాటు దీని ని అచ్చమైన స్వదేశీ రీతి న తీర్చిదిద్దడం తో ఈ ప్రాంతాల ను సందర్శించడానికి ప్రపంచం నలు మూలల నుండి ప్రజలు తరలి వస్తున్నారని, ఇటు స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని, అటు సర్ దార్ సరోవర్ ఆనకట్ట ను.. ఈ రెండిటి సుందరత్వాన్ని ఆస్వాదిస్తున్నారని శ్రీ దేవె గౌడ అన్నారు. పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి. దేవె గౌడ స్టాట్యూ ఆప్ యూనిటీ ని చూడడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.