Shri Sher Bahadur Deuba, former Prime Minister of Nepal, called on Prime Minister Shri Narendra Modi yesterday.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నేపాల్ పూర్వ ప్రధాని శేర్ బహాదుర్ దేవుబా నిన్న భేటీ అయ్యారు.
భూకంపం అనంతరం పునర్ నిర్మాణ కార్యకలాపాలలో నిమగ్నమైన నేపాల్ కు అవసరమైన మద్దతు అందించడం కోసం భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా అన్నారు.
ముఖ్య రాజ్యాంగ అంశాలను పరిష్కరించడంలో నేపాల్ లో చోటు చేసుకొన్న పురోగతిని ప్రధాన మంత్రి అభినందించారు. అటువంటి అంశాలన్నీ సహకార, సమన్వయ స్ఫూర్తితో వీలైనంత త్వరగా కొలిక్కి రాగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Former Prime Minister of Nepal, Mr. Sher Bahadur Deuba met Prime Minister @narendramodi. pic.twitter.com/0Xl2T31fVU
— PMO India (@PMOIndia) November 8, 2016