అత్యున్నత పౌర పురస్కారం ‘భారత్ రత్న’ ను పూర్వ ప్రధాని శ్రీ చౌధరీ చరణ్ సింహ్ కు కట్టబెట్టడం జరుగుతుంది అన్న సంగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తెలియ జేశారు.
రైతుల హక్కులు మరియు వారి యొక్క సంక్షేమం కోసం యావత్తు జీవనాన్ని శ్రీ చౌధరీ చరణ్ సింహ్ అంకితం చేశారు అంటూ దివంగత నేత ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
దేశ పూర్వ ప్రధాన మంత్రి శ్రీ చౌధరీ చరణ్ సింహ్ గారి ని ‘భారత్ రత్న’ తో సమ్మానించడం మా ప్రభుత్వానికి దక్కుతున్న సౌభాగ్యం. దేశం కోసం ఆయన అందించినటువంటి అసమానమైన తోడ్పాటు కు ఈ గౌరవం అంకితం అని చెప్పాలి. రైతుల హక్కుల కోసం మరియు రైతుల సంక్షేమం కోసం ఆయన తన యావత్తు జీవనాన్ని సమర్పణం చేసి వేశారు. ఉత్తర్ ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా కావచ్చు, లేదా దేశాని కి హోమ్ మంత్రి కావచ్చు మరియు శాసన సభ్యుని గా కావచ్చు.. దేశ నిర్మాణాని కి వేగాన్ని జోడించడం కోసం ఆయన ఎల్ల వేళ ల పాటుపడ్డారు. అత్యవసర పరిస్థితి ని వ్యతిరేకించేందుకు కూడాను ఆయన ధైర్యం చేసి నిటారు గా నిల్చొన్నారు. మన రైతు సోదరుల పట్ల, మన రైతు సోదరీమణుల పట్ల ఆయన చాటినటువంటి సమర్పణ భావం, అత్యవసర పరిస్థితి అమలైన కాలం లో ప్రజాస్వామ్యం పట్ల ఆయన ప్రదర్శించినటువంటి నిబద్ధత పూర్తి దేశాని కి ప్రేరణ ను ఇచ్చేదే.’’ అని పేర్కొన్నారు.
हमारी सरकार का यह सौभाग्य है कि देश के पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह जी को भारत रत्न से सम्मानित किया जा रहा है। यह सम्मान देश के लिए उनके अतुलनीय योगदान को समर्पित है। उन्होंने किसानों के अधिकार और उनके कल्याण के लिए अपना पूरा जीवन समर्पित कर दिया था। उत्तर प्रदेश के… pic.twitter.com/gB5LhaRkIv
— Narendra Modi (@narendramodi) February 9, 2024