ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జపాన్ పూర్వ ప్రధాని శ్రీ యోశీహిదే సుగా ఈ రోజు (2022, మే 24) న టోక్యో లో సమావేశమయ్యారు.
2021వ సంవత్సరం సెప్టెంబర్ లో వాశింగ్ టన్ డి.సి. లో ఒకటో క్వాడ్ లీడర్స్ సమిట్ జరిగిన సందర్భం లో ద్వైపాక్షిక సమావేశం సహా వారు ఉభయులు కడపటి సంభాషణ ను గుర్తు కు తెచ్చుకొన్నారు. భారతదేశం-జపాన్ సంబంధాల ను గాఢతరం గా మలచడం లో, పటిష్ట పరచడం లో శ్రీ సుగా అందించినటువంటి తోడ్పాటును ప్రధాన మంత్రి ప్రశంసించారు.
నేత లు ఇరువురు ఇండియా-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మకమైన మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడాన్ని గురించిన వారి వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడి చేసుకొన్నారు. మీ నాయకత్వం లో జపాన్ ఎంపి ప్రతినిధివర్గాన్ని వెంటబెట్టుకొని భారతదేశాని కి తరలి రండి అంటూ శ్రీ సుగా ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.
Glad to have met former PM @sugawitter in Tokyo. pic.twitter.com/9zdyWIBb8n
— Narendra Modi (@narendramodi) May 24, 2022