భారతదేశం లో ఆధికారిక పర్యటన కు విచ్చేసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ శేఖ్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నేడు సమావేశమయ్యారు.
యుఎఇ అధ్యక్షుడు మరియు యుఎఇ క్రౌన్ ప్రిన్స్ ల యొక్క శుభాకాంక్షల ను, అభినందనల ను ప్రధాన మంత్రి కి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఇదివరకు యుఎఇ లో తాను పర్యటించిన సందర్భాల లో తన పట్ల చూపిన ఆప్యాయత ను, తన కు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని గుర్తు కు తెచ్చుకొంటూ, అధ్యక్షుల వారికి మరియు క్రౌన్ ప్రిన్స్ కు వారు ఇరువురు స్వస్థత తోను, సంతోషం గాను ఉండాలని, అంతే కాక వారు సర్వతోముఖ సాఫల్యాల ను సాధించాలని కోరుకొంటూ శుభాకాంక్షల ను అందించానన్న సంగతి ని వారి కి తెలియజేయండని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ని కోరారు. గడచిన అయిదు సంవత్సరాలు గా ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందడం పట్ల కూడా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
భారతదేశం-యుఎఇ సంబంధాలు ఇదివరకు ఎన్నడూ ఇంతటి ఉత్తమమైన స్థాయి లో లేవు అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అన్నారు. ఉభయ దేశాల ప్రజల పరస్పర లబ్ధి కోసం, అలాగే ఈ ప్రాంతం లో శాంతి, సమృద్ధి మరియు స్థిరత్వం ల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని మరింత గా పెంపొందించుకోవాలన్నదే యుఎఇ దార్శనికత గా ఉంది అని కూడా ఆయన పేర్కొన్నారు.
వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ, శక్తి , పర్యటక రంగం మరియు ప్రజల కు ప్రజల కు మధ్య సంబంధాలు సహా సహకారాని కి సంబంధించిన అన్ని రంగాల లోను సంబంధాల ను ఉన్నత స్థాయిల కు తీసుకు పోవడం కోసం యుఎఇ నాయకత్వం తో కలసి పని చేస్తానంటూ తన బలమైన వాగ్దానాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
Had a great meeting with UAE’s Foreign Minister, His Highness Sheikh Abdullah Bin Zayed Al Nahyan. We talked at length about further improving economic and cultural relations between India and UAE. @ABZayed pic.twitter.com/kD5tX3g7is
— Narendra Modi (@narendramodi) July 9, 2019