భారతదేశాని కి ఆధికారిక యాత్ర నిమిత్తం విచ్చేసిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హుసైన్ అమీరబ్దొల్లాహియాన్ ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మర్యాద పూర్వకం గా సమావేశమయ్యారు.
ఆ ప్రముఖుడి కి ప్రధాన మంత్రి స్వాగతం పలుకుతూ, భారతదేశాని కి మరియు ఇరాన్ కు మధ్య దీర్ఘ కాలం గా ఉన్నటువంటి నాగరకత పరమైన సంబంధాల ను మరియు సాంస్కృతిక పరమైన సంబంధాల ను గురించి ఆప్యాయం గా గుర్తు కు తెచ్చుకొన్నారు. నేత లు ఇరువురు తమ సమావేశం లో ప్రస్తుత ద్వైపాక్షిక సహకార భరిత కార్యక్రమాల ను గురించి చర్చించారు. ఉభయ దేశాలు కోవిడ్ అనంతర కాలం లో ఆదాన ప్రదానాల ను వృద్ధి చెందింప చేసుకోవడం కోసం కృషి చేయాలి అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.
అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం రాయసీ కి కూడాను తన శుభాకాంక్షల ను అందజేయవలసిందని ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ని ప్రధాన మంత్రి అభ్యర్థించారు; అతి త్వరలో ఇరాన్ అధ్యక్షుడి ని కలుసుకోవాలన్న ఆశ ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.