ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ తోశిమిత్సు మోతెగి మరియు జపాన్ రక్షణ శాఖ మంత్రి శ్రీ తారొ కొనొ ఈ రోజు న సమావేశమయ్యారు. వారు ఇండియా-జపాన్ విదేశీ వ్యవహారాలు మరియు రక్షణ మంత్రుల సంభాషణ (2+2) యొక్క ప్రారంభిక సదస్సు కు హాజరు అయ్యేందుకు భారతదేశాని కి వచ్చారు.
అతిథులు గా విచ్చేసిన మంత్రుల కు ప్రధాన మంత్రి స్వాగతం పలికారు. 2018వ సంవత్సరం అక్టోబరు లో జపాన్ లో జరిగిన ఇండియా-జపాన్ పదమూడో వార్షిక శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రధాని శ్రీ ఆబే మరియు తాను నిర్దేశించుకొన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఇరు పక్షాలు సన్నద్ధం అవుతుండటం పట్ల శ్రీ మోదీ సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఈ సమావేశం జపాన్ కు మరియు భారతదేశాని కి మధ్య ద్వైపాక్షికం గా వ్యూహపరమైన, భద్రత పరమైన మరియు రక్షణ పరమైన సహకారాన్ని మరింత గాఢ తరం చేయగలదని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం-జపాన్ రెండు దేశాల ప్రజల లబ్ధికి గాను ఈ దేశాల మధ్య సంబంధాలు సర్వతోముఖ అభివృద్ధి చెందడం ముఖ్యమని, దీని ద్వారా ఈ ప్రాంతాని కి మరియు ప్రపంచాని కి కూడాను మేలు జరుగుతుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఉభయ దేశాల మధ్య క్రమం తప్పక జరుగుతున్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాలు ఈ సంబంధాని కి గల శక్తి ని మరియు గాఢత ను చాటి చెప్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేసేందుకు ప్రధాని శ్రీ ఆబే మరియు తాను ఎనలేని ప్రాముఖ్యాన్ని కట్టబెట్టామని ప్రధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు. వచ్చే నెల లో జరిగే ఇండియా-జపాన్ వార్షిక శిఖర సమ్మేళనాని కి గాను ప్రధాని శ్రీ ఆబే భారతదేశాని కి రానుండగా ఆయన ను ఆహ్వానించడం కోసం తాను వేచి ఉన్నానని కూడా శ్రీ మోదీ చెప్పారు. ఇండో-పసిఫిక్ తాలూకు మా యొక్క దార్శనికత లో జపాన్ తో భారతదేశ సంబంధాలు ఒక కీలక అంశం గా ఉన్నాయి, ఇది ఈ ప్రాంతం లో శాంతి కి, స్థిరత్వాని కి, మరియు సమృద్ధి కి తోడ్పడుతుంది, అదే విధం గా భారతదేశం అనుసరిస్తున్నటువంటి యాక్ట్ ఈస్ట్ పాలిసి కి ఒక ఆధార స్తంభం గా కూడా ఉందని ప్రధాన మంత్రి వివరించారు.