ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెట్ వర్క్ 18 ఈ రోజు నిర్వహించిన రైజింగ్ ఇండియా సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించారు.
మనం ఉన్నతి ని గురించి మాట్లాడుకొంటున్నామంటే, అదీ ఒక దేశం యొక్క ఉన్నతి విషయమై మాట్లాడుకొంటే గనక దాని విస్తృతి చాలా విశాలంగా ఉంటుందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థ యొక్క ఉన్నతి కి అతీతంగా, ‘రైజింగ్ ఇండియా’ అంటే దానికి అర్థం భారతదేశం యొక్క ప్రజల ఆత్మాభిమానం అని నాకు అనిపిస్తుంది అని ఆయన చెప్పారు. సమష్టి ఆత్మశక్తి తో అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చు; ప్రస్తుతం ఈ ఆత్మశక్తి ఒక న్యూ ఇండియా సంకల్పాన్ని నెరవేర్చడం కోసం కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి తెలిపారు.
పలు దేశాలలో ప్రభుత్వాలు అభివృద్ధికి, పరివర్తనకు మార్గదర్శనం చేయాలని, పౌరులు ఆ దారిని అనుసరించాలని ఉన్న సర్వ సాధారణ అవగాహనకు భిన్నంగా, భారతదేశంలో ఆలోచనాధోరణిని గత నాలుగు సంవత్సరాలలో తిప్పివేయడం జరిగింది అని ప్రధాన మంత్రి వివరించారు. ప్రస్తుతం పౌరులు దారి చూపుతుంటే, ప్రభుత్వం ఆ దారిన నడుస్తోంది అని ఆయన పేర్కొన్నారు.
స్వచ్ఛ్ భారత్ అభియాన్ స్వల్ప కాలంలో ఒక ప్రజాందోళనగా మారిపోయిందని ఆయన చెప్పారు. పౌరులు డిజిటల్ పేమెంట్స్ ను అవినీతిపైనా, నల్లధనం పైనా ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు అని కూడా ఆయన తెలిపారు. ప్రభుత్వం పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోవడానికి, ఆ నిర్ణయాలను అమలు చేయడానికి కూడా పౌరులే ప్రభుత్వానికి ప్రేరణను అందించారని ఆయన అన్నారు. భారతదేశంలో చోటుచేసుకొన్నటువంటి పరివర్తనాత్మకమైన బదిలీకి భారతదేశ పౌరుల యొక్క దృఢ సంకల్పమే కారణం అని ఆయన స్పష్టంచేశారు. ఒక దార్శనికతగా చెప్పుకోవాలంటే, ప్రభుత్వం జాతీయ స్థాయిలో అసమతుల్యత భావనను తగ్గించివేసే దిశగా పాటుపడుతోందన్నారు. ఉజ్జ్వల యోజన వంట ఇళ్లలో మాత్రమే కాక యావత్తు కుటుంబాల ముఖచిత్రంలో కూడా ఏ విధమైన పరివర్తనను తీసుకువస్తున్నదీ ఆయన ఒక వీడియో సహాయంతో సభికులకు వివరించారు. ఇది మన సామాజిక వ్యవస్థల లోని ఒక పెద్ద అసమతుల్యతను పరిష్కరిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
మణిపుర్ లో సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించి, స్పోర్ట్స్ యూనివర్సిటీ కి శంకుస్థాపన చేసి, ఇంకా ఈశాన్య ప్రాంతాలకు చెందిన పలు ఇతర ముఖ్యమైన పథకాలకు శ్రీకారం చుట్టి.. ఇలా పగటిపూట అంతా మణిపుర్ లో గడిపి.. తాను తిరిగివచ్చిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఈశాన్య భారతదేశం తాలూకు భావావేవపరమైన ఏకీకరణ మరియు జనాభాపరమైన అనుకూలాంశాన్ని మనస్సులో పెట్టుకొని తీరాలని ఆయన అన్నారు. ప్రభుత్వం ‘యాక్ట్ ఈస్ట్ అండ్ యాక్ట్ ఫాస్ట్ ఫర్ ఇండియాస్ ఈస్ట్’ అనే మంత్రాన్ని వల్లిస్తూ పనిచేస్తోందని ఆయన చెప్పారు. యాక్ట్ ఈస్ట్ అంటున్నప్పుడు, ఇందులో ఒక్క ఈశాన్యం మాత్రమే కాకుండా, తూర్పు ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా ల వంటివి చేరి ఉన్నాయి అంటూ ఆయన విడమరచి చెప్పారు.
ఈ ప్రాంతంలో పథకాలను ప్రారంభించేందుకు ఎంతటి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోందో చాటి చెప్పేందుకు ప్రధాన మంత్రి అసమ్ లోని గ్యాస్ క్రాకర్ ప్లాంటు, గోరఖ్ పుర్, బరౌని మరియు సింద్రీ లలో ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ, జగ్ దీశ్ పుర్- హల్దియా గ్యాస్ పైప్ లైన్, ఇంకా ఢోలా- సాదియా వంతెన లను గురించి ఉదాహరించారు. తూర్పు భారతావనిలో 12 నూతన విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయని ఆయన వెల్లడించారు.
విద్యుత్తు సదుపాయానికి నోచుకోని 18,000 గ్రామాలలో సుమారు 13,000 గ్రామాలు తూర్పు భారతదేశంలోనే ఉన్నాయని, మిగిలిన 5000 గ్రామాలు ఈశాన్య ప్రాంతంలో ఉన్నాయని ప్రధాన మంత్రి తెలిపారు. త్వరలో ఈ గ్రామాలకు విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించే లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన చెప్పారు. సౌభాగ్య యోజన ప్రతి ఇంటికి ఒక కరెంట్ కనెక్షన్ ను అందిస్తుంది అని ఆయన అన్నారు. ఒంటరితనం నుండి ఏకీకరణ వైపుగా సాగుతున్న తూర్పు భారతదేశపు యాత్ర ‘‘రైజింగ్ ఇండియా’’కు బలాన్ని ఇస్తుంది అని ఆయన చెప్పారు.
ఆరోగ్య రంగాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ రంగంలో నాలుగు స్తంభాల మీద ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందని తెలిపారు.
అవే..
ప్రివెంటివ్ హెల్త్;
తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఆరోగ్యసంరక్షణ;
సరఫరాల వైపు నుండి జోక్యాలు; మరియు
మిశన్ మోడ్ ఇంటర్ వెన్శన్.
ప్రివెంటివ్ హెల్త్ ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, 2014లో 6.5 కోట్ల గృహాలలో మరుగుదొడ్లు ఉంటే ఇవాళ 13 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. పారిశుధ్య వసతులు అందుబాటులోకి రావడం అనేది సుమారు 38 శాతం స్థాయి నుండి దాదాపుగా 80 శాతానికి పెరిగిందని ఆయన వివరించారు. యోగ ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ఆయన అన్నారు. ఇటీవలే కేంద్ర బడ్జెటు లో ప్రకటించిన వెల్ నెస్ సెంటర్ లను గురించి ఆయన ప్రస్తావించారు. అలాగే వ్యాధినిరోధం గురించి కూడా ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా 3000కు పైగా జన్ ఔషధి కేంద్రాలను నెలకొల్పడం జరిగిందని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ కేంద్రాలలో 800కు పైగా మందులు తక్కువ ధరలకు లభ్యం అవుతున్నట్లు ఆయన చెప్పారు. స్టెంట్ లు మరియు మోకాలి చిప్ప మార్పిడి కి సంబంధించిన ధరలను క్రమబద్ధీకరించడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు.
ఆయుష్మాన్ భారత్ పథకం సుమారు 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య హామీని ప్రసాదిస్తుందని ఆయన అన్నారు.
వైద్యుల కొరతను పరిష్కరించడం కోసం వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం నాడు ప్రారంభించిన జాతీయ పోషణ్ అభియాన్ ను గురించి ఆయన ప్రస్తావించారు.
ప్రతి రంగంలో ఒక విశిష్టమైన అభివృద్ధి నమూనాను ఆవిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తున్నదీ ప్రధాన మంత్రి చెప్పుకొచ్చారు.
విద్యుత్తు రంగంలో, ఇంతకాలం నడచిన ఆలోచనలను ఛేదించడం, మరియు పరిష్కారాలను అన్వేషించడం.. వీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నొక్కిపలికారు. విద్యుత్తు మంత్రిత్వ శాఖ, నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ మరియు బొగ్గు మంత్రిత్వ శాఖ లు ప్రస్తుతం ఒకే విభాగంలా పనిచేస్తున్నాయి అని ఆయన చెప్పారు. భారతదేశం విద్యుత్తు కొరత స్థితి నుండి విద్యుత్తు మిగులు దశకు , అదే విధంగా నెట్ వర్క్ వైఫల్యం నుండి నికర ఎగుమతిదారు దిశగా పయనిస్తోందని ఆయన వివరించారు.
ప్రస్తుతం ప్రజలు భారతదేశం తన బలహీనతలను వదలిపెట్టగలుగుతుందని మరియు ముందుకు సాగిపోగలుగుతుందని నమ్ముతున్నారని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విశ్వాసం రైజింగ్ ఇండియా కు పునాది అని ఆయన చెప్పారు. ఇవాళ, యావత్తు ప్రపంచం భారతదేశం యొక్క ఉన్నతి ని అంగీకరిస్తోందని ఆయన తెలిపారు. భారతదేశం తన స్వీయ అభివృద్ధికి మాత్రమే ఒక కొత్త దిశను ఇవ్వడంతో సరిపెట్టకుండా, యావత్తు ప్రపంచం యొక్క అభివృద్ధికి కూడా ఒక కొత్త దిశను అందిస్తోందని ఆయన వివరించారు.
భారతదేశం ప్రస్తుతం సౌర విప్లవానికి ముందుండి మార్గదర్శకత్వాన్ని వహిస్తున్నదని, ఈ విషయం ఇటీవల జరిగిన అంతర్జాతీయ సౌర కూటమి సమావేశంలో నిరూపణ అయిందని ఆయన అన్నారు. జి-20 మరియు ఐక్య రాజ్య సమితి ల వంటి అంతర్జాతీయ వేదికలలో భారతదేశం యావత్తు ప్రపంచాన్న ప్రభావితం చేస్తున్న ఉగ్రవాదం, నల్లధనం మరియు అవినీతి ల వంటి సమస్యలను గురించి ప్రస్తావించిందని ఆయన గుర్తుచేశారు.
ఆర్థిక విషయాలకు వస్తే, గత మూడు నాలుగు సంవత్సరాలలో భారతదేశం ప్రపంచ ఆర్థిక వృద్ధి కి సైతం బలాన్ని అందించిందని ప్రధాన మంత్రి అన్నారు. దేశం స్థూల ఆర్థిక పరామితులన్నింటి ప్రకారం చూసినా చక్కటి పనితీరును కనబరుస్తోందని ఆయన చెప్పారు. భారతదేశం రేటింగులను రేటింగ్ సంస్థలు ఎగువ స్థాయిలకు సవరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. యువతీయువకులు, మహిళలు సాధికారితను పొందడంలో ‘ప్రధాన మంత్రి ముద్రా యోజన’ ఒక ప్రభావశీలమైన సాధనంగా మారినట్లు ఆయన వివరించారు.
Read Full Presentation Here