PM Modi conferred the Philip Kotler Presidential award
Philip Kotler Award Citation: PM Modi’s selfless service towards India, combined with his tireless energy has resulted in extraordinary economic, social and technological advances in the country
Philip Kotler Award Citation: Under PM Modi’s leadership, India is now identified as the Centre for Innovation and Value Added Manufacturing
PM Modi’s visionary leadership has also resulted in the Digital Revolution, cites Philip Kotler Award

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రప్రథమ ఫిలిప్ కోట్ లర్ ప్రెసిడెంశియల్ అవార్డు ను న్యూ ఢిల్లీ లోని నంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో నేడు అందుకొన్నారు. ఈ పురస్కారం మూడు ఆధార రేఖల.. పీపుల్, ప్రాఫిట్ మరియు ప్లానెట్..పై కేంద్రితమైంది.

ప్రశస్తి పత్రం లో ఇలా పేర్కొన్నారు..:

‘‘దేశ ప్రజల కు ఉత్కృష్ట నాయకత్వాన్ని ఇచ్చినందుకు శ్రీ నరేంద్ర మోదీ ని ఎంపిక చేయడమైంది. భారతదేశం పట్ల ఆయన యొక్క నిస్వార్థ సేవ కు తోడు ఆయన అలుపెరుగనటువంటి శక్తి ఫలితం గా దేశం అసాధారణమైన ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక విజ్ఞాన పరం గా పురోగతి సాధ్యపడింది.

ఆయన నేతృత్వం లో భారతదేశం ప్రస్తుతం నూతన ఆవిష్కరణ లకు మరియు విలువ జోడించినటువంటి తయారీ (మేక్ ఇన్ ఇండియా) కే కాకుండా సమాచార సాంకేతిక విజ్ఞానం, అకౌంటింగ్, ఇంకా ఫైనాన్స్ ల వంటి వృత్తిపరమైన సేవలకు కూడా కేంద్రం గా గుర్తింపు తెచ్చుకొంది.

ఆయన యొక్క దార్శనికత తో కూడిన నాయకత్వం వల్ల సామాజిక ప్రయోజనాలు మరియు ఫైనాన్శియల్ ఇంక్లూజన్ లకై విశిష్ట గుర్తింపు సంఖ్య, ఆధార్ సహా డిజిటల్ విప్లవం (డిజిటల్ ఇండియా) ఆవిష్కృతం అయ్యాయి. ఇది నవ పారిశ్రామికత్వాని కి, వ్యాపారం చేయడం లో సరళత్వాని కి వీలు కల్పించడం తో పాటు భారతదేశానికి 21వ శతాబ్దానుకూల మౌలిక సదుపాయాలను నెలకొల్పడాని కి కూడాను వీలు కల్పించింది.’’

‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్ట్- అప్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’ ఇంకా ‘స్వచ్ఛ్ భారత్’ ల వంటి కార్యక్రమాలు ‘‘భారతదేశాన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత ఆకర్షణీయమైనటువంటి తయారీ మరియు వ్యాపార గమ్యస్థానాలలో ఒకటి గా నిలబెట్టాయి’’ అని ప్రశస్తి పత్రం లో ప్రస్తావించారు.

ప్రొఫెసర్ ఫిలిప్ కోట్ లర్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ కి చెందిన కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో మార్కెటింగ్ విభాగ ఆచార్యుని గా ప్రపంచ ప్రఖ్యాతి ని గడించారు. ఆయన అనారోగ్యం బారి న పడిన కారణం గా అవార్డు ప్రదానం కోసం యుఎస్ఎ లోని జార్జియా లో ఇమోరీ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ జగదీశ్ సేఠ్ ను ప్రతినిధి గా పంపారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi