ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదవీబాధ్యత లను స్వీకరించిన తరువాత తీసుకొన్న తొలి నిర్ణయం భారతదేశ భద్రత, రక్షణ లతో పాటు దేశ ప్రజల ను పరిరక్షిస్తున్న వారి శ్రేయం పట్ల ప్రధాన మంత్రి యొక్క దార్శనికత కు అనుగుణం గా ఉంది. నేశనల్ డిఫెన్స్ ఫండ్ పరిధి లోని ‘ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకం’లో ఒక పెద్ద మార్పునకు ఆమోద ముద్ర ను వేయడం జరిగింది.
ప్రధాన మంత్రి ఈ క్రింద పేర్కొన్న మార్పుల కు ఆమోదం తెలిపారు:
(i) ఉపకార వేతనం యొక్క మూల్యాల ను బాలికల కు ప్రతి ఒక్క నెల కు 2,250 రూపాయల నుండి 3,000 రూపాయల కు మరియు బాలురకు ప్రతి ఒక్క నెల కు 2,000 రూపాయల నుండి 2,500 రూపాయల కు పెంచడమైంది.
(ii) స్కాలర్‌శిప్ స్కీము పరిధి ని ఉగ్రవాదుల దాడుల లో /నక్సల్ దాడుల లో ప్రాణ సమర్పణం చేసిన/ ప్రాణ సమర్పణం చేసేటటువంటి స్టేట్ పోలీస్ అధికారుల పిల్లల కు కూడాను విస్తరించడం జరిగింది. రాష్ట్ర పోలీసు అధికారుల పిల్లల కు ఉద్దేశించిన కొత్త ఉపకార వేతనాల కోటా ఒక సంవత్సరం లో 500గా ఉంటుంది. ఈ విషయం లో దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖ గా వ్యవహరించనుంది.
పూర్వరంగం:
నేశనల్ డిఫెన్స్ ఫండ్ (ఎన్‌డిఎఫ్)ను 1962 లో ఏర్పాటు చేయడమైంది. జాతీయ రక్షణ కృషి ని ప్రోత్సహించడం కోసం నగదు రూపేణా, ఇంకా ఇతరేతర రూపాల లో స్వచ్ఛందం గా వచ్చే విరాళాలకు ఎన్‌డిఎఫ్ బాధ్యత ను తీసుకొంటుంది.
సాయుధ దళాలు, అర్థ సైనిక బలగాలు, రైల్వే రక్షక దళం యొక్క సభ్యులు మరియు వారిపై ఆధారపడిన వారి సంక్షేమార్థం ప్రస్తుతం ఈ నిధి ని వినియోగించడం జరుగుతోంది. ఈ నిధి ని ఒక కార్యనిర్వాహక సంఘం సంబాళిస్తోంది. ప్రధాన మంత్రి ఈ సంఘాని కి చైర్ పర్సన్ గా, రక్షణ, ఆర్థిక, మరియు హోం మంత్రులు సభ్యులు గా ఉన్నారు.
నేశనల్ డిఫెన్స్ ఫండ్ లో ‘ప్రైమ్ మినిస్టర్స్ స్కాలర్‌షిప్స్ స్కీమ్ (పిఎంఎస్ఎస్)’ ప్రధాన పథకం గా ఉంది. దీని ని సాయుధ దళాలు, అర్థ సైనిక బలగాలు మరియు రైల్వే రక్షక దళం ల యొక్క పూర్వ సైనికోద్యోగ సిబ్బంది/విగతజీవులైనటువంటి సిబ్బంది యొక్క పిల్లలు మరియు వితంతు మహిళలు స్నాతకోత్తర విద్య ను, ఇంకా సాంకేతిక విద్య ను అభ్యసించేటట్లు ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని అమలుపరుస్తున్నారు. సాంకేతిక సంస్థ లలో విద్యాభ్యాసాని కి గాను (వైద్యం, దంత వైద్యం, పశు వైద్యం, ఇంజినీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ, ఇంకా ఎఐసిటిఇ/యుజిసి ఆమోదం పొందిన ఇతర తత్సమాన వృత్తి సంబంధ కోర్సుల ను బోధించే) ఉపకార వేతనాలు అందుబాటు లో ఉన్నాయి.
పిఎంఎస్ఎస్ లో భాగం గా, ప్రతి సంవత్సరం రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణ లో ఉన్న సాయుధ బలగాల యొక్క 5500 మంది పిల్లలకు, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియంత్రణ లో ఉన్న పారామిలటరీ బలగాల కు చెందిన 2000 మంది పిల్లలకు, మరియు రైల్వేల మంత్రిత్వ శాఖ నియంత్రణ లో ఉన్న దళాల కు చెందిన 150 మంది పిల్లల కు కొత్త ఉపకార వేతనాల ను ఇస్తూ వస్తున్నారు.
నేశనల్ డిఫెన్స్ ఫండ్ వెబ్‌సైట్ అయిన ndf.gov.in ద్వారా ఆన్‌లైన్ లో స్వచ్ఛందంగా చందాలను, సహాయాన్ని స్వీకరించడం జరుగుతోంది.