ప్రధాన మంత్రి గా శ్రీ నరేంద్ర మోదీ మూడో పర్యాయం పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం పిఎమ్ కిసాన్ నిధి తాలూకు పదిహేడో కిస్తీ విడుదల కు అనుమతి ని ఇచ్చే తన తొలి ఫైలు పైన సంతకం పెట్టారు. దీనితో 9.3 కోట్ల మంది రైతుల కు ప్రయోజనం లభించనుంది; మరి, సుమారు గా 20,000 కోట్ల రూపాయల ను రైతుల కు వితరణ చేయడం జరుగనుంది.
ఫైలు పైన సంతకం చేసిన తరువాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ‘‘మా ప్రభుత్వం రైతుల సంక్షేమాని కి పూర్తి గా కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ కారణం గా పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత కర్షకుల సంక్షేమాని కి సంబంధించిన మొట్టమొదటి ఫైలు పైన సంతకం చేయడం సరి అయినది గా ఉంది. మేము రాబోయే కాలాల్లో రైతుల కోసం మరియు వ్యవసాయ రంగం కోసం మరింత ఎక్కువ గా పాటుపడాలి అని కోరుకొంటున్నాము’’ అన్నారు.
देशभर के अपने किसान भाई-बहनों का जीवन आसान बनाने के लिए हमारी सरकार प्रतिबद्ध है। यह मेरे लिए सौभाग्य की बात है कि लगातार तीसरी बार प्रधानमंत्री के रूप में कार्यभार संभालने के बाद पहला काम उनके लिए ही करने का अवसर मिला है। इसके तहत पीएम किसान सम्मान निधि की 17वीं किस्त से जुड़ी… pic.twitter.com/YZQK3VCXIH
— Narendra Modi (@narendramodi) June 10, 2024