భారతదేశం లో ఆధికారిక యాత్ర కు విచ్చేసిన శ్రీ లంక ఆర్థిక మంత్రి శ్రీ బెసిల్ రాజపక్షే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో న్యూ ఢిల్లీ లో ఈ రోజు న సమావేశమయ్యారు.
ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని పెంపొందింప చేసుకోవడం కోసం రెండు దేశాలు అమలు చేస్తున్న కార్యక్రమాల పై ఆర్థిక మంత్రి శ్రీ రాజపక్షే ప్రధాన మంత్రి కి వివరించారు. శ్రీ లంక ఆర్థిక వ్యవస్థ కోసం భారతదేశం అందిస్తున్న సమర్ధన కు గాను ఆయన తన ధన్యవాదాల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి భారతదేశం అనుసరిస్తున్న ‘నేబర్ హుడ్ ఫస్ట్’ విధానం మరియు ఎస్.ఎ.జి.ఎ.ఆర్ (సిక్యూరిటి ఎండ్ గ్రోథ్ ఫార్ ఆల్ ఇన్ ది రీజన్) సిద్ధాంతం లో శ్రీ లంక పోషిస్తున్న కేంద్రీయ భూమిక ను గురించి మాట్లాడారు. స్నేహపూర్ణమైన శ్రీ లంక ప్రజానీకాని కి భారతదేశం సదా వెన్నంటి నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
సాంస్కృతిక రంగం సహా, ఇరు దేశాల ప్రజల మధ్య గాఢతరం గా మారుతున్న సంబంధాలను గురించి ఆర్థిక మంత్రి శ్రీ బెసిల్ రాజపక్షే ప్రస్తావించారు. ప్రధాన మంత్రి బౌద్ధ మరియు రామాయణ పర్యటన సర్క్యూట్ లను గురించి సంయుక్తంగా ప్రచారం చేపడితే పర్యటకుల రాక పోక లు పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు.