2021-22 నుంచి 2025-26 కాలానికి, ఆర్థిక సంఘం నివేదిక ప్రతిని 15వ ఆర్థిక సంఘం సభ్యులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి సమర్పించారు. ఈనెల 4వ తేదీన రాష్ట్రపతికి కూడా నివేదిక ప్రతిని అందించారు.
15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ శ్రీ ఎన్.కె.సింగ్, సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, ప్రొ.అనూప్ సింగ్, డా.అశోక్ లాహిరి, డా.రమేష్ చంద్, కార్యదర్శి అరవింద్ మెహతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆర్థిక సంఘం, తమ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రికి మంగళవారం అందించనుంది.
రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రకారం ఏటీఆర్ పద్ధతిలో, వివరణాత్మక మెమోరాండంతో పాటు ఈ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెడతారు.