2023-24 చక్కెర సీజన్ లో చెరకు రైతులకు చక్కెర మిల్లులు చెల్లించాల్సిన కనీస న్యాయమైన, లాభదాయక ధరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం అయిన ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర వర్గం కమిటీ ఆమోదం తెలిపింది. 2023-24 చక్కెర సీజన్ (అక్టోబర్-సెప్టెంబర్) లో 10.25% ప్రాథమిక రికవరీ రేటు వద్ద క్వింటాల్ చెరుకు కు న్యాయమైన, లాభదాయక ధరగా 315 రూపాయలు చెల్లిస్తారు. రికవరీ రేటు 10.25% మించి ఉంటే ప్రతి 0.1% పెరుగుదలకు క్వింటాల్ కు 3.07 రూపాయలు ప్రీమియం గా చెల్లిస్తారు. రికవరీ రేటు 10.25% కంటే తక్కువగా ఉంటే ప్రతి 0.1% తగ్గుదలకు క్వింటాల్ కు 3.07 రూపాయలు తగ్గించి చెల్లిస్తారు.
చెరకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశ్యంతో, రికవరీ 9.5% కంటే తక్కువ ఉన్న చక్కెర మిల్లుల విషయంలో ఎలాంటి తగ్గింపు లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరగతిలోకి రైతులు ప్రస్తుత చక్కెర సీజన్ 2022-23 లో రూ.282.125/క్యూటి ఎల్ స్థానంలో 2023-24 చక్కెర సీజన్‌లో చెరకు కోసం రూ.291.975/క్యూటి ఎల్ పొందుతారు.
2023-24 చక్కెర సీజన్‌కు చెరకు ఉత్పత్తి ఖర్చు రూ.157/క్యూటి ఎల్ గా ఉంటుందని అంచనా. 10.25% రికవరీ రేటుతో ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాల్ కు 315 రూపాయలుగా నిర్ణయించిన న్యాయమైన, లాభదాయక ధర ఉత్పత్తి వ్యయం కంటే 100.6% ఎక్కువ. చక్కెర సీజన్ 2023-24 కోసం ప్రభుత్వం నిర్ణయించిన న్యాయమైన, లాభదాయక ధర ప్రస్తుత చక్కెర సీజన్ 2022-23 కంటే 3.28% ఎక్కువగా ఉంది.
ప్రభుత్వం ఆమోదించిన న్యాయమైన, లాభదాయక ధర 2023-24 చక్కెర సీజన్‌లో (అక్టోబర్ 1, 2023 నుంచి) అమలులోకి వస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతుల నుంచి చక్కెర మిల్లులు చెరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. చక్కెర రంగం ఒక ముఖ్యమైన వ్యవసాయ ఆధారిత రంగం. వ్యవసాయ కార్మికులు, రవాణా రంగం తో సహా వివిధ అనుబంధ కార్యకలాపాలలో ఉపాధి పొందుతున్న వారితో పాటు, చక్కెర మిల్లులలో నేరుగా ఉపాధి పొందుతున్న సుమారు 5 కోట్ల మంది చెరుకు రైతులు వారిపై ఆధారపడిన జీవిస్తున్న వారిపై ప్రభావం చూపిస్తుంది. దాదాపు 5 లక్షల మంది కార్మికుల జీవనోపాధిని చక్కెర రంగం ప్రభావితం చేస్తుంది.
వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ (CACP) నుంచి అందిన సిఫార్సులు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంబంధిత వర్గాలతో సంప్రదించిన తర్వాత సంప్రదించిన తర్వాత న్యాయమైన, లాభదాయక ధరను ప్రభుత్వం నిర్ణయించింది. . చక్కెర సీజన్ 2013-14 నుంచి ప్రభుత్వం ప్రకటించిన న్యాయమైన, లాభదాయక ధర వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
నేపథ్యం:
ప్రస్తుత చక్కెర సీజన్ 2022-23 లో చక్కెర మిల్లులు రూ.1,11,366 కోట్ల విలువైన సుమారు 3,353 లక్షల టన్నుల చెరకు కొనుగోలు చేశాయి. కనీస మద్దతు ధర చెల్లించి సేకరించిన వరి పంట సేకరణ తర్వాత చెరకు రెండవ స్థానంలో ఉంది. ప్రభుత్వం తన రైతు అనుకూల చర్యల ద్వారా చెరకు రైతులకు బకాయిలు సకాలంలో అందేలా చర్యలు అమలు చేస్తోంది.
చెరకు/చక్కెరను ఇథనాల్‌గా మళ్లించడం వల్ల చక్కెర మిల్లుల చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయి. మూలధన వ్యయం కూడా తగ్గింది. దీనివల్ల మిల్లుల ఆర్థిక పరిస్థితి మెరుగు పడి నిల్వలు తగ్గాయి. మిల్లుల వద్ద తక్కువ మిగులు చక్కెర కారణంగా నిధులపై ఒత్తిడి తగ్గింది. దీంతో రైతుల చెరకు బకాయిలను సకాలంలో చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది. 2021-22లో చక్కెర మిల్లులు/డిస్టిలరీలు OMCలకు ఇథనాల్‌ను విక్రయించడం ద్వారా సుమారు రూ.20,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి, దీనివల్ల రైతులు తమ చెరకు బకాయిలను త్వరితగతిన పొందగలిగారు.
ఇథనాల్ బ్లెండెడ్ విత్ పెట్రోల్ (EBP) కార్యక్రమం విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంతో పాటు దేశ ఇంధన భద్రత బలోపేతం చేసింది. దిగుమతి చేసుకున్న శిలాజ ఇంధనం పై ఆధారపడటాన్ని తగ్గించింది. పెట్రోలియం రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. 2025 నాటికి 60 ఎల్ఎంటీ కంటే ఎక్కువ చక్కెరను ఇథనాల్‌కు మళ్లించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చక్కెర నిల్వల సమస్యను పరిష్కరిస్తుంది, మిల్లుల ద్రవ్యతను మెరుగుపరుస్తుంది. రైతులకు చెరకు బకాయిలను సకాలంలో చెల్లించడానికి అవకాశం కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. పెట్రోల్‌తో కలిపి ఇథనాల్‌ను ఉపయోగించడం వల్ల కాలుష్యం తగ్గుతుంది. గాలి నాణ్యత మెరుగుపడుతుంది.
ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు అనుకూల స్నేహపూర్వక విధానాలు రైతులు, వినియోగదారులు, చక్కెర రంగంలో పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనాలను రక్షిస్తున్నాయి చక్కెరను అందుబాటులో ఉంచడం ద్వారా 5 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రయోజనాలు రక్షించడానికి అవకాశం కలిగింది.ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల ఫలితంగా చక్కెర రంగం ఇప్పుడు స్వయం సమృద్ధిగా మారింది.
భారతదేశం ఇప్పుడు ప్రపంచ చక్కెర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద చక్కెర ఎగుమతిదారుగా భారతదేశం అవతరించింది. చక్కెర సీజన్ 2021-22 లో చక్కెరలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారతదేశం అవతరించింది. 2025-26 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తి దేశంగా అవతరిస్తుంది అని అంచనా.