ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో క్యాన్సర్‌ను అంతం చేయటంలో పురోగతి సాధించేందుకు అద్భుతమైన కార్యక్రమాన్ని క్వాడ్ దేశాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ప్రధాన ఆరోగ్య సంక్షోభంగా కొనసాగుతున్న, చాలావరకు నివారించదగిన వ్యాధి అయిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై ఈ కార్యక్రమం పనిచేయనుంది. ఈ ఒక్క రకం క్యాన్సర్‌తో మొదలైన ఈ కార్యకమం ఇతర క్యాన్సర్‌ల సమస్యను కూడా పరిష్కరించేందుకు పునాది వేయనుంది. క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న విస్తృత నిర్ణయాల్లో ఈ కార్యక్రమం ఒకటిగా ఉంది.

ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పరిశోధన భాగస్వామ్యాలను విస్తరించడం, డేటా వ్యవస్థలను అభివృద్ధి చేయటం.. క్యాన్సర్ నివారణ, గుర్తింపు, చికిత్స, సంరక్షణకు మరింత ఎక్కువ సహాయం అందించడం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మొత్తం క్యాన్సర్ సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.

గర్భాశయ క్యాన్సర్‌ను టీకా ద్వారా నివారించొచ్చు. సాధారణంగా ముందుగానే గుర్తించినట్లయితే చికిత్స ద్వారా నయం చేయవచ్చు. ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్ వల్ల సంభవించే మహిళ మరణాల్లో మూడో ప్రధాన కారణం ఈ క్యాన్సరే. ఈ ప్రాంతంలో ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్‌పీవీ)కి సంబంధించిన అన్ని వ్యాక్సిన్లను అందుకున్నారు. 10% కంటే తక్కువ మంది ఇటీవల రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందుబాటులో లేకపోవటం, పరిమిత వనరులు, టీకా ధరల్లో అసమానతలు వంటి సవాళ్లను ఇక్కడి అనేక దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఈ అంతరాలను మూన్‌షాట్ కార్యక్రమం ద్వారా క్వాడ్ దేశాలు పూడ్చనున్నాయి. దీనికోసం హెచ్‌పీవీ టీకాల వేసుకోవటాన్ని ప్రోత్సహించడం, రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన సౌకర్యాలు అందుబాటులో ఉంచటం, వెనుకబడిన ప్రాంతాలలో చికిత్సా, సంరక్షణ విస్తరణ వంటి చర్యలు తీసుకోనున్నాయి.

మొత్తం మీద క్యాన్సర్ మూన్‌షాట్‌ రాబోయే దశాబ్దాల్లో లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతుందని మన శాస్త్రీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.  క్యాన్సర్‌ను అంతం చేయటానికి బైడెన్-హారిస్ అధికార యంత్రాంగానికి ఉన్న స్థిర నిబద్ధత తెలిసిందే. దీనిపైన ఈ కార్యక్రమ కార్యచరణ ఆధారపడి ఉంది.  2047 నాటికి అమెరికాలో క్యాన్సర్ మరణాల రేటును కనీసం సగానికి తగ్గించడం, 4 మిలియన్లకు పైగా క్యాన్సర్ మరణాలను నివారించడం, క్యాన్సర్ బారిన పడిన వ్యక్తుల అనుభవాన్ని మెరుగుపచాలనే అనే లక్ష్యాలతో క్యాన్సర్ మూన్‌షాట్‌ కార్యక్రమాన్ని తీసుకురావాలని అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ రెండేళ్ల క్రితం చర్చకు తీసుకువచ్చారు.

క్యాన్సర్ అనేది ప్రపంచ దేశాలకు సంబంధించిన ఒక సవాలు. దేశాలు వ్యక్తిగతంగా తీసుకునే చర్యలకు మించిన సమిష్టి కార్యచరణ, సహకారం అవసరం. కలిసి పనిచేయడం ద్వారా రోగులు, వారి కుటుంబాలపై క్యాన్సర్ వల్ల పడే ప్రతికూల ప్రభావాన్ని నివారించడానికి, క్యాన్సర్‌ను గుర్తించడానికి, తగ్గించటానికి, చికిత్స చేసేందుకు వినూత్న వ్యూహాలను అమలు చేయాలని క్వాడ్ లక్ష్యంగా పెట్టుకుంది. క్వాడ్ దేశాలు వాటి జాతీయ పరిస్థితులకు అనుగుణంగా , క్యాన్సర్ రంగంలో పరిశోధన, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో సహకరం పొందేందుకు, ఈ ప్రాంతంలో గర్భాశయ క్యాన్సర్‌ను తగ్గించడానికి మద్దతుగా ప్రైవేట్ రంగం, ప్రభుత్వేతర రంగ కార్యకలాపాలను పెంచే విషయంలో కూడా పనిచేయాలని క్వాడ్ దేశాలు భావిస్తున్నాయి. ఈ రోజు క్వాడ్ దేశాలు మన ప్రభుత్వ, ప్రభుత్వేతర భాగస్వాముల ద్వారా ఈ క్రింది ప్రతిష్టాత్మక చర్యలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటించాయి.

క్వాడ్ దేశాలు

 

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్లతో సహా గవి(గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్)కి తమ మద్ధతును బలంగా కొనసాగించాలని క్వాడ్ దేశాలు భావిస్తున్నాయి. ఐదేళ్లకు సంబంధించి కనీసం 1.58 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు అమెరికా తెలిపింది. 

 

అదనంగా, క్వాడ్ దేశాలు గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష ఖర్చును తగ్గించడానికి సంబంధిత పరికరాలను భారీగా కొనుగోలు చేయడంపై ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేయనున్నాయి. మెడికల్ ఇమేజింగ్, రేడియేషన్ థెరపీని కూడా అందుబాటులో ఉంచేందుకు, వాటి నాణ్యతను మెరుగుపరచడానికి అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీతో కలిసి పనిచేయనున్నాయి.

అమెరికా

 

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన వాయుసేన ద్వారా 2025 నుంచి ఇండో-పసిఫిక్ భాగస్వాములతో హెచ్‌పీవీ వ్యాక్సిన్ నిపుణుల మార్పిడికి సహాయం చేయాలని అమెరికా భావిస్తోంది. ఇది హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ వంటి నివారణ చర్యలపై దృష్టి సారిస్తూ భాగస్వామ్య దేశాలకు చెందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు సరైన శిక్షణ పొందేందుకు, సామర్థ్యాన్ని పెంచటానికి, బలోపేతం చేయటానికి, ఇండో-పసిఫిక్ అంతటా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తుంది. క్యాన్సర్‌పై ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఆరోగ్య భద్రతను పెంపొందించాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. 


ఎఫ్‌డీఏకు చెందిన 'ప్రాజెక్ట్ ఆశా' కింద భాగస్వాములతో సహకారాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చే పన్నెండు నెలల్లో భారత్‌లో సాంకేతిక సందర్శన చేయాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ)కు చెందిన ఆంకాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భావిస్తోంది. ఎఫ్‌డీఏ భారత కార్యాలయం, ప్రముఖ ఆంకాలజిస్టులు, రోగులకు సంబంధించి పనిచేసే సంస్థలు(అడ్వకసీ గ్రూపులు), క్లినికల్ ట్రయల్ స్పాన్సర్లు, ప్రభుత్వ భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది. ఈ కొత్త భాగస్వామ్యం క్లినికల్ డిజైన్, ప్రవర్తన, క్లియకల్ ప్రయోగాల నిర్వహణలపై కావాల్సిన విద్య.. అంతర్జాతీయ ప్రమాణాలను ప్రోత్సహించటం, అనుమతుల ప్రక్రియలను క్రమబద్దీకరించటం, చట్టపరమైన నిపుణతను పంచుకోవటం, క్యాన్సర్ క్లినికల్ ప్రయోగాల అందుబాటును మెరుగపరచటంపై దృష్టి పెడుతుంది.

 

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రపంచ క్యాన్సర్ పరిశోధన, నైపుణ్య శిక్షణ విషయంలో ఎక్కువ నిధులు సమకూర్చటం ద్వారా సహాయం చేయాలని యూఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్(ఎన్‌సీఐ) ఉండాలని భావిస్తోంది. పరిశోధన, నైపుణ్య శిక్షణలో ప్రస్తుతం దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్‌లోని పరిశోధకులు, సంస్థలతో కూడిన దాదాపు 400 క్రియాశీల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ప్రధాన ప్రాజెక్టులు.. గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు, వ్యాక్సినేషన్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు, బాలికలకు ఉపయోగపడే చికిత్సల విషయంలో కావాల్సిన సహాయం, వ్యూహాలపై దృష్టి సారించాయి. ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ పార్టనర్షిప్, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) సహకార కేంద్రం ద్వారా వివిధ దేశాలకు అందించే శాస్త్రీయ సహకారం ద్వారా ప్రపంచ క్యాన్సర్ నియంత్రణ చర్యలకు మద్దతును ఎన్‌సీఐ మరింత విస్తృతంగా అందించనుంది.

ఆరోగ్య నిపుణులు, క్యాన్సర్ బారిన పడిన వ్యక్తులకు ఉపయోగపడే సాక్షాధారిత(ఎవిడెన్స్ బేస్డ్) క్యాన్సర్ సమాచారాన్ని ప్రపంచ దేశాలకు అందించడానికి ఇండో-పసిఫిక్ దేశాలతో కొనసాగుతున్న సహకారాలను ఎన్‌సీఐ విస్తరిస్తుంది. ఈ ప్రాంతంలోని ఆరోగ్య నిపుణులు, రోగులకు నిపుణులు తయారు చేసిన, సమగ్ర అధికారిక క్యాన్సర్ సమాచారాన్ని అందించడం ద్వారా క్వాడ్ క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమానికి సంబంధించిన ప్రజా అవగాహన అవసరాలకు మద్ధతునివ్వాలని ఎన్‌సీఐ లక్ష్యంగా పెట్టుకుంది. వయోజన, శిశు క్యాన్సర్ చికిత్స, పరీక్షలు, నివారణ, జెనెటిక్స్.. సహాయక, ఉపశమన సంరక్షణ.. సమగ్ర, ప్రత్యామ్నాక, కాంప్లిమెంటరీ చికిత్సలు వంటి క్యాన్సర్ అంశాలపై సమగ్ర సమాచార సేకరణ ఇందులో ఉంటుంది. క్యాన్సర్ పరీక్షలు, నివారణ, రోగ నిర్ధారణ, గర్భాశయ క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన విస్తృతమైన సమాచారం కూడా ఉంటుంది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ఇండో-పసిఫిక్ ప్రాంతంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు సహాయం అందిస్తుంది, వ్యాక్సిన్ పంపిణీని మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ పర్యవేక్షణ, నివారణ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. భవిష్యత్తులో చేపట్టే వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ప్రవర్తనా, సామాజిక అంశాలపై దృష్టి పెడుతూ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మూల్యాంకనంపై ఫిలిప్పీన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయడం కూడా ఇందులో ఉంది. ఇండో-పసిఫిక్‌లో మొత్తం క్యాన్సర్ సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయటానికి క్యాన్సర్ నియంత్రణ ప్రణాళిక అభివృద్ధికి మద్దతునివ్వటం ద్వారా విస్తృత క్యాన్సర్ నియంత్రణ చర్యలకు  సీడీసీ దోహదం చేస్తుంది.

యూఎస్ పసిఫిక్ భూభాగాలు, అమెరికా రక్షణలో ఉన్న స్వతంత్ర దేశాల్లో చేపడుతోన్న ప్రయోగాత్మక గర్భాశయ క్యాన్సర్ పరీక్షల అధ్యయనాల్లో తేలిన ఉత్తమ పద్ధతులను అందరితో పంచుకోవాలని, సాంకేతిక సహాయం అందించాలని, అలాగే యూఎస్ పసిఫిక్ ఐలాండ్(పీఐజే) పరిధిలో తన నిధులతో చేపడుతోన్న జాతీయ క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమాలకు మద్దతునివ్వటం కొనసాగించాలని సీడీసీ భావిస్తోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడాన్ని మెరుగుపరచడానికి సాక్షాధారిత వ్యూహాలను పంచుకోనుంది. అదనంగా, పరీక్షల సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గుర్తింపును పెంచేందుకు భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి పీఐజేలు చేసే ప్రయత్నాలకు సహాయపడే విధంగా అమలు మార్గదర్శనిని(ఇంప్లిమెంటేషన్ గైడ్) తీసుకురావాలని భావిస్తోంది. వీటిలో ప్రాథమిక, తదనంతర హెచ్‌పీవీ పరీక్షలను నిర్వహించడానికి వైద్య, ప్రయోగశాలల సామర్థ్యాన్ని పెంచే విషయంలో మార్గదర్శకత్వం అందించటం… నివారణ, సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంచటానికి క్యాన్సర్ పరీక్షలను పర్యవేక్షించేందుకు డేటా వ్యవస్థలను మెరుగుపరచటం ఉన్నాయి.

గర్భాశయంతో సహా ఇతర క్యాన్సర్‌లను నివారించడానికి, నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి అర్హత కలిగిన ప్రైవేట్ రంగ ప్రాజెక్టులకు సహాయం చేయటంపై యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్‌సీ) పనిచేయనుంది. ముఖ్యంగా నిరుపేద వర్గాలకు వినూత్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడాన్ని వేగవంతం చేయాలని భావిస్తోంది.

హెచ్‌పీవీ టీకాలు అందుబాటులో ఉండటాన్ని మెరుగుపరిచేందుకు కీలకమైన ఆర్థిక, సాంకేతిక మద్దతును అందించాలని యూఎస్‌ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలాప్మెంట్ (యూఎస్ఏఐడీ) భావిస్తోంది. ఇండో-పసిఫిక్, ఇతర ప్రాంతాల్లోని అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారి నుంచి మిలియన్ల మంది మహిళలు, బాలికలను రక్షించడంలో సహాయపడే హెచ్‌పీవీ టీకాలతో సహా ఇతర టీకాల కవరేజీని పెంచడానికి ప్రపంచ దేశాల కృషిని బలపరిచే వ్యాక్సిన్ కూటమి అయిన ‘గవి’కి యూఎస్ఏఐడీ ద్వారా కనీసం 1.58 బిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం అందించనున్నట్లు అమెరికా ప్రభుత్వం హామీ ఇచ్చింది.

గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ అండ్ డిప్లొమసీ(జీహెచ్ఎస్‌డీ)లోని ప్రెసిడెంట్స్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ రిలీఫ్(పీఈపీఎఫ్‌ఏఆర్) ద్వారా హెచ్ఐవీ ఉన్న ప్రజల్లో గర్భాశయ క్యాన్సర్ గుర్తింపు, చికిత్సలను వేగంగా పెంచడం.. అల్ప, మధ్య ఆదాయ దేశాలలో కావాల్సిన పరికరాల కొనుగోలు.. ఆరోగ్య వ్యవస్థల బలోపేతంతో సహా అవలంభిస్తోన్న ఉత్తమ పద్ధతులను ఇతరులతో ఆయా ప్రభుత్వ విభాగం పంచుకోనుంది. గర్భాశయ క్యాన్సర్ పరీక్షలను ఇప్పటికే ఉన్న హెచ్ఐవీ చికిత్సా కార్యక్రమాలలతో ఇది ఏకీకృతం చేస్తుంది. అంతేకాకుండా ప్రాణాలను రక్షించే చికిత్సలను అందుబాటులోకి తెస్తుంది. పరీక్షలు, చికిత్సకు అవసరమైన వైద్య సామాగ్రికి సంబంధించిన సరఫరా గొలుసులను మెరుగుపరచడంపై కూడా ఇది దృష్టి పెడుతుంది.

 

ఆస్ట్రేలియా

ఎలిమినేషన్ పార్ట్‌నర్షిప్ ఇన్ ఇండో-పసిఫిక్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ (ఈపీఐసీసీ) కన్సార్టియానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం, దాతృత్వ విరాళాల ద్వారా సమకూరే నిధులు 29.6 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈపీఐసీసీ అనేది ఇండో-పసిఫిక్‌లోని దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నిర్మూలించేందుకు దశాబ్దాల పరిశోధన, క్లినికల్ పరీక్షల నాయకత్వంతో ఏర్పాటు చేసిన ఒక కొత్త కార్యక్రమం. హెచ్‌పీవీ సంబంధిత విధానాలు, ప్రణాళిక, సంసిద్ధతను మెరుగుపరచడం ద్వారా ఈ ప్రాంతం అంతటా గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనను ముందుకు తీసుకెళ్లనుంది. తైమూర్-లెస్టే, సోలమన్ దీవుల్లో భవిష్యత్‌ విస్తరణగా వీలుగా హెచ్‌పీవీ కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా చేపడుతోంది. మలేషియా, ఫిజి, పపువా న్యూ గినియాల దేశాల సంసిద్ధతకు మద్దతు ఇవ్వడానికి ఉప-జాతీయ వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ఆయా దేశాలకు విస్తరిస్తోంది. తువాలు, వనాటు, నౌరులో జాతీయ సుస్థిర హెచ్‌పీవీ నిర్మూలన కార్యక్రమాల స్థాపనకు సహాయం చేస్తోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను తొలగించడానికి ఈపీఐసీసీ అరు ప్రాధాన్యత అంశాల్లో పనిచేస్తుంది. వీటిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు మద్దతు ఇవ్వటం ద్వారా ప్రాధమిక నివారణను బలోపేతం చేయడం… హెచ్‌పీవీ పరీక్షలు, ముందస్తు(ప్రీ-క్యాన్సర్) చికిత్స ద్వారా ద్వితీయ నివారణ ఉన్నాయి. వీటితో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్ష, రోగ నిర్ధారణ కోసం ప్రయోగశాలలను బలోపేతం చేయటం… నిర్ణయం తీసుకునేందుకు, సంరక్షణ నమూనాలను బలోపేతం చేయడానికి డేటాను రూపొందించడానికి ఆరోగ్యానికి సంబంధించిన డిజిటల్ పనులు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్వహణకు మద్దతు ఇవ్వడం(చికిత్స, ఉపశమన సంరక్షణ రెండింటిలోనూ), గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలనలోని అన్ని అంశాల్లో విధానపరమైన, నమూనాల పరంగా మద్దతు అందించటం కూడా ఉన్నాయి.

ఆస్ట్రేలియా ప్రభుత్వం కేటాయించిన 16.5 మిలియన్ అమెరికన్ డాలర్లతో విస్తరించిన(ఎక్స్‌ప్యాండెడ్) ఈపీఐసీసీ ప్రాజెక్ట్ ఇండో-పసిఫిక్‌లోని మరింత మంది మహిళలకు సేవలను అందించనుంది. ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలనపై పనిచేసే ఈ ప్రాంతంలోని భాగస్వామ్య సంస్థలకు తదుపరి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలనపై ఏర్పడే ప్రపంచ స్థాయి ఫోరమ్‌లో పాల్గొనేందుకు సహాయం చేయనుంది. ఈ నూతన ఫోరమ్ ఇండో-పసిఫిక్ ప్రాంతంపై బలమైన దృష్టిని కలిగి ఉంటుంది.

తమ స్వచ్ఛంద సంస్థ మిండెరూ ఫౌండేషన్ ద్వారా మరో 13.1 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రాణరక్షణ సహయాన్ని డాక్టర్ ఆండ్రూ ఫారెస్ట్ ఎఓ, నికోలా ఫారెస్ట్ ఎఓలు ఈపీఐసీసీకి అందించనున్నారు. ఈ అదనపు నిధులతో ఈపీఐసీసీ ఈ ప్రాంతంలోని 11 దేశాలకు విస్తరిస్తుంది. దీనితో మిండెరూ మొత్తం ఆర్థిక సహాయం 21.7 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. విస్తరణ కార్యక్రమం ద్వారా రాబోయే 4 సంవత్సరాలలో పసిఫిక్ ప్రాంతంలోని 140,000 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే జాతీయ నిర్మూలన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునేందుకు.. రాబోయే తరాల మహిళలు, బాలికల కోసం ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రభుత్వాలకు సహయం చేస్తుంది. .

భారత్

నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్‌సీడీ) పోర్టల్ ద్వారా డిజిటల్ హెల్త్‌లోని సాంకేతిక నైపుణ్యాన్ని ఇతర దేశాలతో పంచుకోనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నేతృత్వంలోని గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్‌కు మద్ధతిచ్చేందుకు 10 మిలియన్ డాలర్ల సహాయంలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతానికి భారత్‌ సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. క్యాన్సర్ పరీక్ష, సంరక్షణపై దీర్ఘకాలిక సమాచారాన్ని ట్రాక్ చేసే నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ పోర్టల్ ఉపయోగించుకునేందుకు కావాల్సిన సాంకేతిక మద్దతు అందించటం కూడా ఇందులో ఉంది.

ఇండో-పసిఫిక్ ప్రాంతానికి 7.5 మిలియన్ డాలర్ల విలువైన హెచ్‌పీవీ నమూనా కిట్లు, రోగ నిర్ధారణ సాధనాలు,  గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సిన్లను అందించడానికి భారత్‌ కట్టుబడి ఉంది. ఈ ప్రాంతంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ భారాన్ని తగ్గించేందుకు సహాయం చేయనుంది. దీనితో పాటు క్యాన్సర్ గుర్తింపు, నివారణ విషయంలో స్థానిక చర్యలను బలోపేతం చేయడం..  ముందస్తుగా గుర్తించేందుకు, నివారణ చేపటేటందుకు సరైన, అందుబాటులో ఉండే సాధనాలతో స్థానిక సమాజాలకు సాధికారత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

నోటి, రొమ్ము, గర్భాశయ ముఖ్యద్వార క్యాన్సర్లకు సంబంధించి నేషనల్ ప్రోగామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ద్వారా జనాభాకు అనుగుణంగా పరీక్షలను భారత్ పెంచుతోంది. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్ష కోసం విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్(వీఐఏ) పద్ధతిని ఉపయోగిస్తుంది. ఇది సరళమైనదే కాకుండా ధర పరంగా ప్రభావవంతమైనది. అంతేకాకుండా సమర్థవంతమైనది కూడా. అధునాతన ప్రయోగశాలలు అవసరం లేకుండా గర్భాశయ క్యాన్సర్ సంకేతాలను ప్రారంభ దశలోనే ఆరోగ్య కార్యకర్తలు గుర్తించే వీలు కల్పిస్తుంది. ఇది ఇండో-పసిఫిక్‌లోని ఇతర ప్రాంతాలకు ఒక నమూనాగా మారనుంది.

భారత్‌ తన "తృతీయ సంరక్షణ క్యాన్సర్ కేంద్రాల బలోపేతం" కార్యక్రమం కింద ప్రత్యేక క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను అందరు ఉపయోగించునేందుకు వీలుగా విస్తరిస్తుంది. దేశవ్యాప్తంగా చికిత్సా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం చేస్తోంది. వెనుకబడిన ప్రాంతాలతో సహా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అధిక-నాణ్యమైన సంరక్షణను పొందేలా చూస్తుంది.

ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన(పీఎంజేఏవై) ద్వారా అందుబాటు ధరల్లో క్యాన్సర్ చికిత్సను అందించేందుకు భారత్ కట్టుబడి ఉంది. పీఎంజేఏవై ద్వారా చేపడుతన్న విస్తృత ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో క్యాన్సర్ చికిత్సలను అందించటానికి కట్టుబడి ఉంది. ఇది ఆర్థిక రక్షణ ఎవరికైతే అత్యంత అవసరంతో వారికి సహాయపడుతుంది. 

 

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలనకు భారత నిబద్ధతకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)నేతృత్వంలోని పరిశోధనలు మరింత బలం చేకూరుస్తున్నాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్ష, వీలైనంత త్వరగా రోగ నిర్ధారణ చేయటం, చికిత్స ప్రారంభించడంపై పరిశోధనలు దృష్టి సారించాయి. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి రాబోయే సంవత్సరాల్లో ఈ పరిశోధన ఫలితాలను ఇండో-పసిఫిక్ దేశాలతో పంచుకోనున్నారు.

జపాన్

ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ), మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) స్కానర్లతో సహా వైద్య పరికరాలతో సహా సుమారు 27 మిలియన్ డాలర్ల విలువైన ఇతర సహాయాన్ని జపాన్ అందిస్తోంది. కంబోడియా, వియత్నాం, తైమూర్-లెస్తెలతో పాటు వివిధ అంతర్జాతీయ సంస్థలకు సహాకరిస్తోంది. 

 

జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, ఇతర సంస్థల ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో సహా క్యాన్సర్‌ను ఎదుర్కోవటానికి ఇండో-పసిఫిక్‌లో 2019-20 నుంచి 2023 ఆర్థిక సంవత్సరం వరకు జపాన్ సుమారు 75 మిలియన్ డాలర్లు కేటాయించింది. ఇందులో సంబంధిత వైద్య పరికరాలు, సౌకర్యాలు, వైద్య నిర్ధారణ, ఆరోగ్య వ్యవస్థల బలోపేతం చేయటం, సాంకేతిక సహాయం ఉన్నాయి.

ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలు లేదా గవి, యూఎన్‌ఎఫ్‌పీఏ, ఐపీపీఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ, నియంత్రణతో సహా వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటాన్ని మెరుగుపరచడానికి, మహిళల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి జపాన్ కట్టుబడి ఉంది. ఈ దిశగా మద్దతు ఇవ్వడానికి తన సహయాన్ని కొనసాగించాలని జపాన్ భావిస్తోంది.

 

సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించే దిశగా, ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో సహా క్యాన్సర్‌ సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని జపాన్ భావిస్తోంది. ఆ దేశానికి చెందిన నేషనల్ క్యాన్సర్ సెంటర్ క్వాడ్‌లోని ప్రతి దేశ క్యాన్సర్ సంబంధింత సంస్థతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఇండో-పసిఫిక్‌లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో సహా ఇతర క్యాన్సర్లను ఎదుర్కొనే విషయంలో సహాయాన్ని జపాన్ కొనసాగిస్తుంది.


ప్రభుత్వేతర సంస్థలు


ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్ విషయంలో పురోగతిని ముందుకు తీసుకెళ్లటంలో ప్రైవేటు, లాభాపేక్ష లేని రంగాల సమష్టి ఆవిష్కరణలు, వనరులు, నిబద్ధత కీలకం కాబట్టి.. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే వాటి మధ్య సహకారం తప్పనిసరి. క్వాడ్ దేశాలు ప్రభుత్వేతర భాగస్వాముల ద్వారా ఈ క్రింది కార్యక్రమల చేపట్టనున్నట్లు హర్షం వ్యక్తం చేశాయి. .

క్యాన్సర్ పరీక్షలు, నివారణను అందుబాటులో ఉంచటాన్ని మెరుగుపరచడం

 

సమగ్ర ఆరోగ్య వ్యవస్థలను ఉపయోగించుకునే విధానం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో గర్భాశయ క్యాన్సర్ నివారణ, చికిత్సకు సంబంధించిన కేటాయింపులను ప్రపంచ బ్యాంకు గణనీయంగా పెంచుతోంది. రాబోయే మూడేళ్లలో హెచ్‌పీవీ విషయంలో ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ డాలర్ల ఖర్చు చేయనుంది. 2030 నాటికి 1.5 బిలియన్ల మందికి నాణ్యమైన, అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందించాలనే తన విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంది. మహిళలు, పిల్లలు, గర్భాశయ క్యాన్సర్ విషయంలో గ్లోబల్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ(జీఎఫ్ఎఫ్)తో కలిసి పనిచేయనుంది. వియత్నాం, లావోస్, కంబోడియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో పలు ప్రాజెక్టులతో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, చికిత్సను భాగం చేయటం ద్వారా వాటికి కావాల్సిన మద్దతిస్తోంది. నిరుపేద జనాభాకు పరీక్షలను అందుబాటులోకి తీసుకురావటం, వారికి వైద్యారోగ్య సేవలను అందించటాన్ని బలోపేతం చేయడం.. రోగనిర్ధారణ, చికిత్సను మెరుగుపరచడానికి భాగస్వామ్యాలను పెంచడం ఇందులో ఉన్నాయి. అదనంగా, సరఫరా గొలుసు సవాళ్లను పరిష్కరించడానికి, హెచ్‌పీవీ టీకాలు స్థిరంగా ఉత్పత్తి జరిగేలా, పంపిణీ అయ్యేలా చూసే కార్యక్రమాలపై కూడా ప్రపంచ బ్యాంక్‌ పనిచేస్తోంది. ఇండో-పసిఫిక్ అంతటా టీకాలు అందుబాటులో ఉండే పరిస్థితిని మెరుగుపరచటంపై దృష్టి పెట్టింది. ఈ విధానం ద్వారా పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను పరిష్కరించగల స్థిరమైన, సమానమైన ఆరోగ్య వ్యవస్థలను సృష్టించాలని.. ఇండో-పసిఫిక్ అంతటా మహిళలు, బాలికలకు దీర్ఘకాలిక ఆరోగ్యం విషయంలో మద్దతునివ్వాలని  ప్రపంచ బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది.

ఆగ్నేయాసియాలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు సంబంధించి నిధులను సమకూర్చేందుకు.. వుమెన్ హెల్త్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ నెట్వర్క్(వెన్-డబ్ల్యూహెచ్ఈఎన్)కు చెందిన మహిళా పెట్టుబడిదారులు, దాతలు వచ్చే మూడేళ్లకు 100 మిలియన్ డాలర్లకు పైగా కేటాయించనున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ, పరీక్ష, రోగ నిర్ధారణ, చికిత్సను మెరుగుపరచడానికి అవసరమైన అంతరాలను పూరించడానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. హెచ్‌పీవీ పరీక్ష, మెడికల్ ఇమేజింగ్, పాథాలజీ, రేడియోథెరపీ, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది శిక్షణ, ఆరోగ్య సౌకర్యాలను సౌర విద్యుత్ సదుపాయల కోసం గ్రాంట్, రాయితీ, పెట్టుబడి మూలధనాన్ని వెన్‌కు చెందిన మహిళా పెట్టుబడిదారులు, దాతలు అందించనున్నారు.

గవి భాగస్వామ్యంతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా… ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పంపిణీ చేసేందుకు 40 మిలియన్ డోసుల హెచ్‌పీవీ టీకాల కొనుగోలుకు సహాయం చేయనుంది. దీనిని డిమాండ్ ఆధారంగా విస్తరించొచ్చు. దీనివల్ల వెనుకబడిన ప్రాంతాలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యను పరిష్కరించడానికి టీకాల స్థిర సరఫరాను నిర్ధారించుకోవచ్చు. ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచటం, వాటిని మెరుగపరచడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడానికి, ఈ ప్రాంతం అంతటా సమానమైన ఆరోగ్య సంరక్షణ అందేలా ప్రోత్సహించడానికి ఇది సహాయపడుతుంది.

 

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలనకు కట్టుబడి ఉన్నట్లు ఇతర దాతలు, దేశాలతో కలిసి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ ఏడాది ప్రారంభంలో  ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా పంపిణీని వేగవంతం  చేయటానికి.. కొత్త రోగనిరోధక(ప్రొఫిలాక్టిక్), చికిత్సా(థెరప్యూటిక్) హెచ్‌పీవీ టీకాలు, రోగనిర్ధారణ సాధనాలను అభివృద్ధి చేయడానికి.. క్లినికల్ అధ్యయనాలకు నిధులు సమకూర్చడంలో సహాయపడటానికి నాలుగేళ్లలో 180 మిలియన్ల అమెరికన్ డాలర్ల వరకు కేటాయించనున్నట్లు ఫౌండేషన్ ప్రకటించింది.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలనను ప్రోత్సహించడానికి దేశీయంగా ఏర్పడే భాగస్వామ్యానికి గ్లోబల్ హెచ్‌పీవీ కన్సార్టియం(జీహెచ్‌సీ) ద్వారా సబిన్ వ్యాక్సిన్ ఇనిస్టిట్యూట్ మద్దతునివ్వనుంది. సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ కన్సార్టియం-ఇండియా (సీసీఈసీ-ఐ) అవసరం అయినప్పుడు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. దీనిలో భాగంగా తన ‘ఇంటిగ్రేటెడ్ సేవ్ వ్యూహం: స్క్రీనింగ్, యాక్సెస్ టు ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్, ఎడ్యుకేషన్’ ద్వారా "100 గర్భాశయ క్యాన్సర్ రహిత(కాన్సర్ ముక్త) జిల్లాల" కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల జీహెచ్‌సీ గత నిబద్ధతకు కొనసాగింపును తెలియజేస్తోంది. గతంలో ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి ఆ దేశ జాతీయ గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన ప్రణాళిక అభివృద్ధిపై పని చేసింది.

ఫిలిప్పీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ భాగస్వామ్యంతో, రోచే మద్దతుతో జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం కమ్యూనికేషన్ కార్యక్రమాల కేంద్రం(జ్పీగో).. హెచ్‌పీవీ పరీక్షల ప్రాముఖ్యత, గర్భాశయ క్యాన్సర్ ప్రమాదంపై మహిళలకు అవగాహన కల్పించడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలపై అవగాహన, డిమాండ్, యాక్సెస్‌ను  పెంచుతోంది. అధిక పనితీరు గల హెచ్‌పీవీ పరీక్షలను సిఫార్సు చేయటం, పట్టణీకరణ ఎక్కువ ఉన్న ఐదు స్థానిక స్వపరిపాలన యూనిట్లలో క్యాన్సర్ ముందస్తు కణాల థర్మల్ అబ్లేషన్ చికిత్సను ప్రవేశపెట్టడం, చికిత్సకు మార్గం కల్పించేందుకు బలమైన సూచన మార్గాలు అందిచటం వంటి వాటితో కూడిన డబ్ల్యూహెచ్ఓ క్యాన్సర్ తొలగింపు వ్యూహాన్ని ప్రవేశపెట్టటం ద్వారా క్యాన్సర్ పరీక్షల కవరేజీని కేంద్రీకృత ప్రయోగశాలల నమూనా ప్రాజెక్టు విస్తరిస్తోంది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఖచ్చితమైన వైద్యం(ప్రిసిషన్ మెడిసిన్) అందించే వాగ్దానాన్ని నెరవేర్చడానికి జన్యు నిర్ధారణ పరీక్షల అభివృద్ధి, విస్తృత ఉపయోగం విషయంలో సహాయం చేయటంపై ఇల్యూమినా కట్టుబడి ఉంది. అడ్వాన్స్డ్ దశ (>50%), నాన్-హెచ్‌పీవీ ఆధారిత(~5%) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రోగులు సరైన చికిత్స అందుకునేందుకు.. పాలీ(ఏడీపీ-రైబోస్) పాలిమరేస్ (పీఎఏఆర్‌పీ) ఇన్హిబిటర్స్, రోగనిరోధక చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ (ఐసీఐ) వంటి తగిన చికిత్సలను పొందేలా చూసే లక్ష్యంతో ఇది పనిచేయనుంది. ఆస్ట్రేలియా, జపాన్‌లోని గైనకాలజికల్ ఆంకాలజీ సంస్థలతో ఇలాంటి కార్యక్రమాలను అన్వేషిస్తున్నారు.

రోచే డయాగ్నోస్టిక్స్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన గర్భాశయ క్యాన్సర్ పరీక్ష, రోగ నిర్ధారణ కార్యక్రమాలను విస్తరిస్తోంది. జపాన్ భాగస్వామ్యంతో మహిళలకు అవగాహన కల్పించటం, ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, సమర్థవంతమైన అనుసరణ సంరక్షణ(ఫాలో-అప్ కేర్) కోసం డిజిటల్ పరిష్కారాలను అభివృద్ధి చేయడం వంటి వాటిలో ఉన్న అనుభవం ఆధారంగా క్యాన్సర్ పరీక్షలను అందుబాటులో ఉంచటాన్ని, అవగాహానను పెంచనుంది. అబార్జినల్, టోర్రెస్ స్ట్రెయిట్ ద్వీపవాసులు, సాంస్కృతికంగా వైవిధ్యమైన సమూహాలతో సహా తక్కువ పరీక్షలు జరుగుతున్న, మొత్తానికే స్క్రీనింగ్ పరీక్షలు జరగని సమూహాలలో గర్భాశయ క్యాన్సర్ పరీక్షలను ప్రోత్సహించడంపై ఆస్ట్రేలియాతో కలిసి పనిచేయనుంది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో గర్భాశయ క్యాన్సర్ పరీక్షలలో బెక్టన్ డికిన్సన్ అండ్ కో(బీడీ) సమగ్రంగా పెట్టుబడులు పెడుతోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షల ఉత్తమ పద్ధతులపై వైద్యులకు విద్యను అందించడానికి ప్రసూతి, గైనకాలజికల్ నిపుణులతో కలిసి పనిచేస్తోంది. 2025 ప్రారంభం నాటికి 1,200 మందికి పైగా క్లినికల్ వైద్యులు, సహాయక సిబ్బందిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెద్ద ఎత్తున హెచ్‌పీవీ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రయోగాత్మక ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. అంతేకాకుండా తక్కువ సేవలు అందుకుంటోన్న సమాజాలను చేరుకోవడానికి కార్యక్రమాల రూపకల్పనను విషయంలో పెట్టుబడులు పెడుతోంది. డైరెక్ట్ రిలీఫ్‌తో వారి దీర్ఘకాలిక భాగస్వామ్యం ద్వారా 20,000 మందికి పైగా మహిళలకు పరీక్షలను సులభంగా అందించటంపై స్వయం ఉపాధి మహిళా సంఘం(సేవా-ఎస్ఈడబ్లూఏ)తో బీడీ కలిసి పనిచేస్తోంది. ఈ కార్యక్రమం కింద పరీక్షలు, రోగ నిర్ధారణ, మానసిక ఆరోగ్యంలో సహాయం చేసేందుకు 400 శిబిరాలను నిర్వహించనుంది.

క్యాన్సర్ సంరక్షణను అందించటాన్ని మెరుగుపరచడం


ప్రాజెక్ట్ ఎకో(ఈసీహెచ్ఓ) ఇండో-పసిఫిక్ ప్రాంతంలో 10 కొత్త లెర్నింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలనను వేగవంతం చేస్తుంది. ఇది సమర్థవంతమైన, అందుబాటులో ఉన్న నివారణ, సంరక్షణను సులభతరం చేస్తుంది. క్యాన్సర్ సంరక్షణ సేవలు అందే తీరును మెరుగుపరచడానికి సామాజిక ఆరోగ్య సంరక్షణ నిపుణులకు సాక్షాధారిత శిక్షణ, మార్గదర్శక ఫ్రేమ్‌వర్క్‌ అయిన ఎకో నమూనాను 33 దేశాలలోని 180కి పైగా ప్రజారోగ్య సంస్థలు ఉపయోగించనున్నాయి. 2028 నాటికి ప్రాజెక్ట్ ఎకో ఇండోనేషియా, వియత్నాం, మలేషియా ఇతర ఇండో-పసిఫిక్ దేశాలలో కనీసం 10 కొత్త సామాజిక కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. ఇవి స్థానిక భాగస్వాములు, ఆరోగ్య మంత్రిత్వ శాఖలతో కలిసి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాల అమలు, క్యాన్సర్ పూర్వ కణాల చికిత్స, అవసరమైన నివారణ చికిత్సల వాడకంతో సహా గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనను వేగవంతం చేయనున్నాయి.

ఇండో-పసిఫిక్ ప్రాంతంతో సహా ప్రపంచవ్యాప్తంగా పౌర సమాజ సంస్థలకు సహాయాన్ని పెంచడం ద్వారా ప్రపంచంలో హెచ్‌పీవీ సంబంధిత క్యాన్సర్లను తగ్గించడానికి అమెరికన్ క్యాన్సర్ సొసైటీ కట్టుబడి ఉంది. మొదట్లో  క్యాన్సర్ పౌర సమాజ సంస్థలు, వైద్య సంఘాలపై దృష్టి సారించనుంది. విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ సిబ్బంది శిక్షణల ద్వారా ప్రాణాలను రక్షించే నివారణను అందుకోవటం, వీటి డిమాండ్‌ మెరగుపరచటమే లక్ష్యంగా సాక్షాధారిత, తక్కువ ఖర్చుతో కూడిన కార్యక్రమాలను అమలు చేసేందుకు ఉత్ప్రేరక గ్రాంట్‌లు, సాంకేతిక సహాయం ఇందులో ఉన్నాయి. 


గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చికిత్సలో అనుసరించాల్సిన ప్రభావంతమైన పద్ధతులపై మారుతోన్న శాస్త్రీయ రుజువుల ఆధారంగా కొత్త ప్రతిపాదనలను అనుసరించేందుకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో బాధపడుతోన్న మహిళలు సంరక్షణ, నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ(ఆస్కో-ఏఎస్‌సీఓ) నవీకరించనుంది. ఇది పూర్తైన తరువాత ఆసియా పసిఫిక్ ప్రాంతీయ మండలితో సహా తన ఇతర సభ్యులు, ఇండో-పసిఫిక్‌లోని భాగస్వామ్య ఆంకాలజీ సొసైటీలతో కలిసి పనిచేస్తుంది. ఈ ప్రాంతంలో క్యాన్సర్ విషయంలో క్లినికల్ వైద్యులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు గర్భాశయ క్యాన్సర్ ప్రాథమిక, ద్వితీయ నివారణపై సహచర మార్గదర్శకాలతో పాటు ఈ మార్గదర్శకాలను వాడుకోవటంపై సహాయం చేయనుంది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రేడియోథెరపీ, మెడికల్ ఇమేజింగ్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) తన రేస్ ఆఫ్ హోప్ కార్యక్రమాన్ని విస్తరిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 13 దేశాలు, ప్రాంతాలు సహాయం కోసం విన్నవించాయి. అవగాహన పెంచడానికి, గర్భాశయ క్యాన్సర్ పరీక్షల రేటును పెంచడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్య, శిక్షణ, పరిశోధన, సృజనాత్మకత, నాణ్యత హామీ వంటి అంశాల్లో సామర్థ్యాన్ని పెంపొందించే కేంద్రాలుగా సేవలందిస్తున్న జపాన్, భారత్‌లోని క్యాన్సర్  ఇనిస్టిట్యూట్‌లను రేస్ ఆఫ్ హోప్ యాంకర్ సెంటర్లుగా ఐఏఈఏ గుర్తించింది.

'గర్భాశయ క్యాన్సర్‌పై ఇండో-పసిఫిక్‌లో ఎలిమినేషన్ పార్ట్‌నర్షిప్'లో భాగంగా వచ్చే మూడేళ్లలో ఇండో-పసిఫిక్ ప్రాంతంతో సహా అసమానతలను తగ్గించటానికి, గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనలో ప్రపంచాన్ని నడిపించడానికి యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్(యూఐసీసీ) 172 దేశాలలోని 1150 మంది సభ్యులతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉంది. దేశంలోని తన భాగస్వాములకు సంరక్షణ సౌకర్యాలు అందించి క్యాన్సర్ విషయంలో పురోగతిని కొనసాగించడానికి, అంతిమంగా ప్రపంచ జనాభాపై క్యాన్సర్ భారాన్ని తగ్గించడానికి యూఐసీసీ మద్దతిస్తోంది. దాని భారీ నెట్‌వర్క్, అన్ని రంగాలతో కలిసి పనిచేసే విషయంలో నిరూపితమైన సామర్థ్యాన్ని ఉపయోగించటంతో సహా ప్రతిష్టాత్మక కన్వీనింగ్ ప్లాట్‌ఫామ్, వ్యవస్థీకృతమైన అభ్యాస అవకాశాలను భాగస్వములు ఉపయోగించుకోనున్నాయి.

క్యాన్సర్ పరిశోధన, మౌలిక సదుపాయాలు, శిక్షణ విషయంలో సామర్థ్యాన్ని పెంచడం

 

మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్, ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీలోని రాయల్ నార్త్ షోర్ హాస్పిటల్ 40 మిలియన్ డాలర్ల ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నాయి. ఇది గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించడం, తొలగించడంతో సహా ప్రిసిషన్ ఆంకాలజీ, లిక్విడ్ బయాప్సీ సాంకేతికతల అంతర్జాతీయ క్లినికల్ ప్రయోగాత్మక పరీక్షలను ముందుకు తీసుకువెళ్తుంది. ఆస్ట్రేలియన్ దాతలు శ్రీ గ్రెగరీ జాన్ పోచే, దివంగత శ్రీమతి కే వాన్ నార్టన్ పోచేలు ప్రతి సంస్థకు 20 మిలియన్ డాలర్ల ఉదార విరాళం అందించనున్నారు. ఈ విరాళాలు ఈ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి సహాయపడుతాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతం, ఇతర ప్రాంతాల్లో అత్యాధునిక రోగనిర్ధారణ, చికిత్సా సాధనాల అభివృద్ధిని ఇది వేగవంతం చేస్తుంది.

గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించటానికి, నివారించేందుకు, చికిత్స అందించేందుకు ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని సంస్థలకు అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) సహాయం అందించనుంది. క్లౌడ్ కంప్యూటింగ్ క్రెడిట్లను అందించటంతో పాటు ఏడబ్ల్యూఎస్ ఓపెన్ డేటా రిజిస్ట్రీ ద్వారా ఏడబ్ల్యూస్, డేటాసెట్లకు వాడుకునేందుకు అనుమతించనుంది. క్యాన్సర్ జీనోమ్ అట్లాస్, ఇతరుల నుండి సేకరించిన డేటాసెట్ల ద్వారా నమూనాలు, వ్యత్యాసాలను గుర్తించడానికి పరిశోధకులు ఏడబ్ల్యూఎస్‌ను ఉపయోగిస్తున్నారు.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రాథమిక సంరక్షణ స్థాయిలో ఆంకాలజీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఫైజర్ తన  ఇండోవేషన్ కార్యక్రమాన్ని విస్తరించనుంది. స్థానిక అంకురాలకు సహాయపడేందుకు రెండేళ్ల క్రితం ఇండోవేషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ఫైజర్.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై పనిచేస్తున్న వాటితో సహా ఇతర అంకురాలకు దాదాపు 1 మిలియన్ డాలర్ల గ్రాంట్‌లను అందిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో పనిచేస్తోంది. ప్రాథమిక సంరక్షణ ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఫైజర్ ఇప్పుడు ఆంకాలజీపై దృష్టి సారించే కార్యక్రమాన్ని విస్తరిస్తోంది. ప్రారంభ స్థాయిలోనే గుర్తించటాన్ని మెరుగపరిచే.. ప్రాథమిక సంరక్షణ స్థాయిలోనే నిర్ధారణ, రోగి సేవలను మెరుగుపరిచే.. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేసేందుకు వీలైన పరిష్కారాలను అందించే 10 అంకురాల వరకు గ్రాంట్లను అందించనుంది.

ఇండో-పసిఫిక్‌లో రేడియోథెరపీ సామర్థ్యాన్ని ఎలెక్టా విస్తరించనుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను  తొలగించేదుకు దోహదం చేసేందుకు ఈ ప్రాంతంలో చికిత్సలో ఉన్న ముఖ్యమైన అంతరాన్ని పూడ్చనుంది. ఆగ్నేయాసియాలో రేడియోథెరపీ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం, ప్రాంతీయ వైద్య కేంద్రాలతో చికిత్సా కోర్సులను నిర్వహించడం, విజ్ఞానాన్ని పంచుకోవటం ద్వారా రేడియోథెరపీలో సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫామ్‌లను అమలు చేయటం, ఆసియా-పసిఫిక్ రేడియేషన్ ఆంకాలజీ నెట్‌వర్క్‌ సభ్యత్వ కేంద్రాల మధ్య పీర్ రివ్యూ సెషన్లు ఇందులో ఉండనున్నాయి.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరిశోధన, శిక్షణ, విద్య విషయంలో చేపడుతోన్న కార్యక్రమాలను ఇండో-పసిఫిక్ ప్రాంతానికి విస్తరించడానికి ఎండీ అండర్సన్ కట్టుబడి ఉంది. ప్రస్తుతం ఆ సంస్థ.. గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు, రోగ నిర్ధారణ, చికిత్సా కార్యక్రమాల అమలు, మూల్యాంకనానికి సంబంధించి ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తోంది. కాల్పోస్కోపీ, అబ్లేషన్, లూప్ ఎలక్ట్రోసర్జికల్ ఎక్సిషన్ ప్రొసీజర్(ఎల్ఈపీ), శస్త్రచికిత్సల విషయంలో దేశంలోని వైద్యులకు శిక్షణ ఇస్తోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నిర్మూలించడానికి భాగస్వామ్యంపై ఆసక్తి ఉన్న ఇండో-పసిఫిక్‌లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖలకు ఈ కార్యక్రమాలను విస్తరించనున్నట్లు  హామీ ఇచ్చింది. 


ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహనను పెంచడం

గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్ విషయంలో డయాగ్నోస్టిక్, మెడికల్ ఇమేజింగ్ పరిష్కారాల్లో ప్రపంచ నాయకత్వ స్థాయిలో ఉన్న హోలాజిక్.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన పెంచడానికి ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని ప్రభుత్వ సంస్థలు, వైద్యారోగ్య నిపుణులతో కలిసి పనిచేస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వైద్యారోగ్య నిపుణుల కొరతను అధిగమించడానికి జనాభాకు అనుగుణంగా కార్యక్రమాలను పెంచడానికి గర్భాశయ క్యాన్సర్ పరీక్షల్లో కృత్రిమ మేధస్సు వంటి వినూత్న సాంకేతికతల యాక్సెస్‌ను హోలాజిక్ ప్రస్తుతం విస్తరిస్తోంది. అదనంగా, మహిళల ఆరోగ్యం గురించి సమగ్ర ప్రపంచ సర్వే అయిన ‘గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ ఇండెక్స్’ నిరంతర ప్రచురణను హోలాజిక్ కొనసాగించనుంది. ప్రపంచంలోని మహిళలు, బాలికల ఆరోగ్యం, శ్రేయస్సు గురించి ప్రపంచానికి తెలిసిన సమాచారం విషయంలో ఉన్న కీలకమైన అంతరాన్ని ఇది భర్తీ చేస్తుంది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వాములతో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, గర్భాశయ ముఖద్వారా పరీక్షలు, ప్రారంభ చికిత్స ప్రాజెక్టులను గ్లోబల్ ఇనిషియేటివ్ అగెనెస్ట్ హెచ్‌పీవీ అండే సర్వైకల్ క్యాన్సర్ ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాంతంలో అనుసరిస్తోన్న ఉత్తమ పద్ధతులు, విజ్ఞానాన్ని పంచుకోవడానికి బ్యాంకాక్‌లో ఆసియా-పసిఫిక్ వర్క్ షాప్‌ను నిర్వహించడం.. ఇండో-పసిఫిక్ అంతటా అవగాహన కార్యక్రమాలను మరింత పెంచడానికి అవగాహన ప్రయత్నాలను విస్తరించడం వంటివి ఇందులో ఉన్నాయి.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Government announces major projects to boost capacity at Kandla Port with Rs 57,000-crore investment

Media Coverage

Government announces major projects to boost capacity at Kandla Port with Rs 57,000-crore investment
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
President of the European Council, Antonio Costa calls PM Narendra Modi
January 07, 2025
PM congratulates President Costa on assuming charge as the President of the European Council
The two leaders agree to work together to further strengthen the India-EU Strategic Partnership
Underline the need for early conclusion of a mutually beneficial India- EU FTA

Prime Minister Shri. Narendra Modi received a telephone call today from H.E. Mr. Antonio Costa, President of the European Council.

PM congratulated President Costa on his assumption of charge as the President of the European Council.

Noting the substantive progress made in India-EU Strategic Partnership over the past decade, the two leaders agreed to working closely together towards further bolstering the ties, including in the areas of trade, technology, investment, green energy and digital space.

They underlined the need for early conclusion of a mutually beneficial India- EU FTA.

The leaders looked forward to the next India-EU Summit to be held in India at a mutually convenient time.

They exchanged views on regional and global developments of mutual interest. The leaders agreed to remain in touch.