ప్రధాన మంత్రి అందుకొన్న జ్ఞాపిక ల ప్రదర్శన మరియు ఇ-ఆక్శనింగ్ ఈ రోజు న అంటే, అక్టోబరు 24వ తేదీ న ముగిసింది. ఈ వేలంపాట కు బ్రహ్మాండమైన స్పందన లభించింది. వేలాది బిడ్ లు వచ్చాయి. ఇ-ఆక్శన్ నుండి అందిన సొమ్ముల ను నమామీ గంగే మిశన్ కు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు విరాళం గా ఇవ్వనున్నారు.
ప్రధాన మంత్రి కి బహుమతుల రూపం లో ఇవ్వబడినటువంటి మొత్తం 2772 జ్ఞాపికల ను విక్రయించడం కోసం ఇ-ఆక్శన్ ను కేంద్ర సంస్కృతి మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 14వ తేదీ నుండి నిర్వహించింది. ఈ కానుకల ను న్యూ ఢిల్లీ లోని నేశనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ లో ప్రదర్శించారు. మెమెంటోల లో చిత్రలేఖనాలు, శిల్పాలు, శాలువా లు, పొట్టి కోటు లు మరియు సంప్రదాయ సంగీత పరికరాలు సహా విభిన్నమైనటువంటి నజరానా లు కలసి ఉన్నాయి.
ఇ-ఆక్శన్ ను అక్టోబర్ 3వ తేదీ వరకు నిర్వహించాలని మొదట్లో అనుకొన్నారు. అయితే, సార్వజనిక ప్రతిస్పందన విరివి గా ఉండటం తో పాటు దీని లో పాలు పంచుకొంటామంటూ మరింత ఎక్కువ మంది అభ్యర్ధించడం తో, వేలంపాట ప్రక్రియ ను అదనం గా మూడు వారాల వరకు పొడిగించాలనే నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ రోజు వరకు చూస్తే, వేలం కోసం ఉద్దేశించిన అన్ని వస్తువులు అమ్ముడయిపోయాయి. శ్రీయుతులు అనిల్ కపూర్, అర్జున్ కపూర్ లతో సహా పలువురు హిందీ చలన చిత్ర నటులే కాక గాయకుడు శ్రీ కైలాశ్ ఖేర్ ఈ హర్రాజు కు ప్రాచుర్యాన్ని కల్పించడం తో ప్రసిద్ధ వ్యక్తులు, రాజకీయ వాదులు, ఇంకా కార్యకర్తలు వేలం పట్ల ఆసక్తి ని కనబరచారు.
ప్రదర్శన కు ఉంచిన జ్ఞాపికల లో భగవాన్ గణపతి యొక్క చిన్న విగ్రహం మరియు కమలం ఆకారం గల అలంకరించిన చెక్క పెట్టె ల వంటి వాటి ని అతి తక్కువ మూల ధర.. 500 రూపాయలు.. శ్రేణి లో ఉంచారు. ప్రధాన మంత్రి వెనుక భాగం లో మువ్వన్నెల తో గాంధీ మహాత్ముని బొమ్మ ఉన్న అక్రిలిక్ పెయింటింగ్ కు అత్యంత అధిక మూల ధర.. 2.5 లక్షల రూపాయలు.. గా ఖాయం చేశారు. ఇది
25 లక్షల రూపాయల అంతిమ బిడ్ ను అందుకొన్నది.
ప్రధాన మంత్రి తన మాతృమూర్తి వద్ద నుండి ఆశీర్వాదాల ను అందుకొంటున్న ఒక ఛాయాచిత్ర పటాన్ని 1000 రూపాయల మూల ధర తో ఉంచగా, ఆ ఫోటో ఫ్రేము కు 20 లక్షల రూపాయల విలువ కలిగిన బిడ్ వచ్చింది. బహుళ జనాదరణ కు పాత్రమైన ఇతర కానుకల లో- మణిపురి జానపద కళల చిత్రాకృతి (సిసలు మూల ధర 50,000 లు కాగా, ఇది 10 లక్షల రూపాయల బిడ్ కు అమ్ముడయింది), ఒక దూడ కు పాలిస్తున్న ఒక గోమాత లోహ శిల్పాకృతి (4,000 రూపాయల మూల ధర కలిగింది 10 లక్షల రూపాయల బిడ్ కు విక్రయమైంది)లతో పాటు స్వామి వివేకానందుల వారి 14 సెం.మీ. లోహ ప్రతిమ (మూల ధర 4,000 రూపాయలు గా ఉండగా, 6 లక్షల రూపాయల అంతిమ ధర పలికింది) వంటివి- ఎన్నదగ్గవి గా ఉన్నాయి.