ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఫ్రాన్స్ అధ్యక్షుని దౌత్యసంబంధి సలహాదారు శ్రీ ఇమేన్యుయల్ బోనే ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి త్వరలో ఫ్రాన్స్ ను సందర్శించనుండగా ద్వైపాక్షిక సహకారం పరం గా వివిధ రంగాల లో చోటు చేసుకొంటున్న పురోగతి ని శ్రీ బోనే ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు.
జులై 14 వ తేదీ నాడు జరుగనున్న బేస్టిల్ డే వేడుకల లో గౌరవ అతిథి గా పాలుపంచుకోవాలంటూ అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ ఆహ్వానించినందుకు ప్రధాన మంత్రి కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.
అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ తో హిరోశిమా లో ఇటీవల తాను జరిపిన సమావేశాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొంటూ, తమ ఇద్దరి సంభాషణ ను పేరిస్ లోనూ కొనసాగించాలని ఉత్సుకత తో ఉన్నానన్నారు. ఆ సంభాషణ భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలోపేతం చేయగలదన్న అంచనా ఉంది.