జి-20 సమిట్ కు హాజరు కావడం కోసం నేను జపాన్ లోని ఒసాకా కు వెళ్తున్నాను. మన ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళ ను మరియు అవకాశాల ను గురించి ప్రపంచం లోని ఇతర నేతల తో చర్చించడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. మహిళల సాధికారిత, డిజిటలైజేషన్ మరియు ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ లకు సంబంధించిన అంశాలు, ఎస్‌డిజి ల సాధన లో పురోగతి, అలాగే ఉగ్రవాదం, ఇంకా జల వాయు పరివర్తన ల వంటి ప్రధానమైన ప్రపంచ సవాళ్ళ పరిష్కారం కోసం మనం అందరం ఉమ్మడి గా చేస్తున్న ప్రయత్నాలు ఈ శిఖర సమ్మేళనం యొక్క కార్యక్రమాల పట్టిక లో ప్రధానం గా చోటు చేసుకొంటున్నాయి.
ప్రస్తుతం వేగం గా మార్పు చెందుతున్న ప్రపంచం లో నియమాల పై ఆధారపడివుండే అంతర్జాతీయ క్రమాన్ని పరిరక్షించడం కోసం కీలకమైనటువంటి సంస్కరణ కు లోనైన బహుళ పార్శ్విక వాదాని కి మన యొక్క బలమైన మద్ధతు ను పునరుద్ఘాటించడాని కి, మరి దాని ని ఆచరణ లోకి తీసుకు రావడాని కి ఈ శిఖర సమ్మేళనం ఒక ముఖ్యమైన అవకాశాన్ని ప్రసాదించనుంది. గడచిన అయిదు సంవత్సరాల లో భారతదేశం పొందినటువంటి బలమైన అభివృద్ధియుత అనుభవాన్ని వెల్లడి చేసేందుకు ఒక వేదిక గా కూడా ఈ శిఖర సమ్మేళనం దోహదపడనుంది. ఈ దృఢమైన అభివృద్ధియుత అనుభవం ప్రగతి తోను, స్థిరత్వం తోను కూడిన మార్గం లో సాగిపోయేందుకు ప్రభుత్వాని కి భారతదేశ ప్రజలు ఒక తిరుగులేనటువంటి తీర్పు ను ఇచ్చేందుకు ఒక ప్రాతిపదిక గా నిలచింది.
2022వ సంవత్సరం లో ఎప్పుడైతే- మేము మా స్వాతంత్య్రం యొక్క 75వ వార్షికోత్సవ సంవత్సరం లో అడుగుపెడతామో, మరి అలాగే ఒక ‘న్యూ ఇండియా’ ను ప్రవేశపెట్టుకొంటామో- ఆ సంవత్సరం లో జి-20 సమిట్ కు ఆతిథ్యాన్ని ఇచ్చే దిశ గా భారతదేశాని కి ఒసాకా సమిట్ ఒక ముఖ్యమైనటువంటి సోపానం గా కూడా ఉపయోగపడనుంది.
ఈ శిఖర సమ్మేళనాన్ని పురస్కరించుకొని మా యొక్క ప్రధాన భాగస్వామ్య దేశాల నాయకుల తో ముఖ్యమైన ద్వైపాక్షిక అంశాల పైన మరియు ప్రపంచ వ్యాప్తం గా ప్రాముఖ్యం కలిగిన అంశాల పైన సంభాషణ లు జరపడం కోసం కూడా నేను నిరీక్షిస్తున్నాను.
అదే సమయం లో తదుపరి రష్యా, ఇండియా ఎండ్ చైనా (ఆర్ఐసి) లాంఛన ప్రాయం కానటువంటి శిఖర సమ్మేళనాని కి ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు కూడా నేను వేచి ఉన్నాను. అంతేకాదు, బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్ – బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణ ఆఫ్రికా), ఇంకా, జెఎఐ (జపాన్, అమెరికా మరియు ఇండియా) ల నాయకుల తో లాంఛనప్రాయం కానటువంటి సమావేశాల లో పాలుపంచుకోవడం కోసం కూడాను నేను ఎదురు చూస్తున్నాను.