ఆసియాన్- ఇండియా డైలాగ్ రిలేశన్స్ 25వ జయంతి కి గుర్తుగా 2018 జనవరి 25 వ తేదీన న్యూ ఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏశియన్ నేశన్స్ (ASEAN) సభ్యత్వ దేశాలు/ప్రభుత్వాల అధినేతలం అయిన మనం ‘‘శేర్ డ్ వేల్యూస్, కామన్ డెస్టిని’’ అనే అంశం ప్రాతిపదికగా కలుసుకుంటున్నాం.
ఆసియాన్ చార్టర్ కు 2012 డిసెంబర్ 20 న జరిగిన ఆసియాన్- ఇండియా డైలాగ్ రిలేశన్స్ ఇరవైయ్యో వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఆసియాన్- ఇండియా స్మరణాత్మక శిఖర సమ్మేళనంలో ఆమోదించిన దార్శనిక పత్రానికి, పరస్పర ప్రయోజనకర సంబంధాల ప్రాతిపదికగా రూపొందిన తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు డిక్లరేశన్, ట్రీటీ ఆఫ్ ఎమిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏశియా (టిఎసి), ఐక్య రాజ్య సమితి చార్టర్ లో పొందుపరిచిన సూత్రాలు, విలువలు, ప్రయోజనాలకు అనుగుణంగా ఆసియాన్- ఇండియా డైలాగ్ రిలేశన్స్ ను ముందుకు తీసుకుపోవడాని; అలాగే ఆసియాన్ చార్టర్ కు మద్దతునిచ్చేందుకు మా నిబద్ధతను పునరుద్ఘాటించడం జరిగింది;
ఆగ్నేయ ఆసియాకు, భారతదేశానికి మధ్య వేలాది సంవత్సరాలుగా నెలకొన్న నాగరకత బంధం, సాంస్కృతిక బృందాల రాకపోకలను ఆసియాన్ మరియు ఇండియా ల మధ్య సహకారానికి ఒక బలమైన పునాది గా గుర్తిస్తున్నాం;
ఆసియాన్- ఇండియా డైలాగ్ రిలేశన్స్ గత పాతిక సంవత్సరాలుగా ప్రత్యేకించి రాజకీయ, భద్రత, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో సాధించిన ప్రగతిని ప్రశంసా పూర్వకంగా గుర్తించడమైంది;
శాంతి, ప్రగతి మరియు ఉమ్మడి సౌభాగ్యానికి సంబంధించిన భాగస్వామ్యం (2016-20)తో పాటు, 2016-18 ప్రాధమ్యాల జాబితా అమలు విషయంలోను, ఆసియాన్- ఇండియా సాధించిన పురోగతిని సంతృప్తితో గుర్తించడమైంది;
ప్రాంతీయంగా ఆసియాన్ ప్రాధాన్యాన్ని సంతరించుకోవడం కోసం భారతదేశం ప్రకటించిన మద్దతును అభినందించడమైంది;
ప్రాంతీయంగా శాంతి, భద్రత మరియు సౌభాగ్యాలకు అది నిరంతరంగా అందిస్తున్నటువంటి మద్దతును స్వాగతించడం జరుగుతోంది. అలాగే, ఆసియాన్ ఇంటిగ్రేశన్ (ఐఎఐ) వర్క్ ప్లాన్ 3 చొరవ, ఆసియాన్ కనెక్టివిటీ 2025 మాస్టర్ ప్లాన్ (ఎమ్ పిఎసి), ఆసియాన్ 2025: కలిసి ముందుకు సాగుదాం నినాదం అమలుకు మద్దతు, ఆసియాన్ కమ్యూనిటీ నిర్మాణ ప్రక్రియల వంటి వాటిని అభినందించడం జరిగింది.
2017 సంవత్సరం పొడవునా ఆసియాన్ చర్చల కృషిని గుర్తు చేసుకొంటూ ఆసియాన్ సభ్యత్వ దేశాలలో, భారతదేశంలో జరిగిన వివిధ కార్యక్రమాలకు అభినందనలు తెలపడం జరిగింది. అలాగే ఆసియాన్- ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ఆసియాన్- ఇండియా యువజన శిఖర సమ్మేళనం నిర్వహణను, ఆసియాన్- ఇండియా యువజన అవార్డులు మరియు యువజన నాయకత్వ కార్యక్రమాలను, ఇంకా ఆసియాన్ ఇండియా సంగీత ఉత్సవాన్ని సైతం అభినందించడం జరిగింది;
ఈ కింది వాటికి అంగీకారం తెలియజేస్తున్నాం:
1. ఆసియాన్- ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పరస్పర ప్రయోజనకరంగా ఉండే రీతిలో మరింత బలోపేతం, పటిష్టం చేయడం, దానిని రాజకీయ, ఆర్థిక, భద్రత, సామాజిక, సాంస్కృతిక, అభివృద్ధ సహకారానికి విస్తరింపచేయడం, ఈ ప్రాంతంలో శాంతియుత, సుహృద్భావపూరిత, పరస్పరం సహకరించుకునే సముదాయం దిశగా ప్రభుత్వం సంస్థలు, పార్లమెంటేరియన్ లు, వ్యాపార వర్గాలు,శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు, ప్రసార మాధ్యమాలు, యువజనులు, ఇతర భాగస్వాముల స్థాయికి కూడా నెట్ వర్క్‌ను విస్తరింప చేసి వ్యవస్థాగత యంత్రాంగాన్నిబలోపేతం చేయడం.
2 . శాంతి, ప్రగతి, పరస్పర శ్రేయస్సు (2016-2020) కు ఆసియాన్- ఇండియా భాగస్వామ్యానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను పూర్తి స్థాయి లో, సమర్ధంగా సకాలంలో అమలు చేసేందుకు చర్యలు కొనసాగించడంతో పాటు సహకారాన్ని అందించడం.
3. ఆసియాన్- ఇండియా చర్చల భాగస్వామ్యానికి, ఆసియాన్ నేతృత్వం లోని వ్యవస్థలు, ఉదాహరణకు ఆసియాన్- ఇండియా శిఖర సమ్మేళనం, తూర్పు ఆసియా సమిట్ (ఇఎఎస్), ఇండియాతో పోస్ట్ మినిస్టీరియల్ కాన్పరెన్స్ (పిఎంసి ప్లస్ 1), ఆసియాన్ ప్రాంతీయ వేదిక (ఎఆర్ఎఫ్), ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం (ఎడిఎమ్ఎమ్) ప్లస్, ఇంకా ఇతర ఆసియాన్- ఇండియా మంత్రిత్వ శాఖ, వివిధ రంగాల యంత్రాంగాలతో చర్చలు, సహకారాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకుపోవడం, మరింత సహకారాన్ని అందించడం.
4. ఆసియాన్ ఇంటిగ్రేషన్‌కు మద్దతు ఇవ్వడం, దానికి దోహదపడడం, ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2025 లక్ష్యాలను సాకారం చేసేందుకు కమ్యూనిటీ నిర్మాణ ప్రక్రియను చేపట్టడం.
రాజకీయపరమైన మరియు భద్రత సంబంధిత సహకారం
5. ఇరు పక్షాలకు అందోళన కలిగించే ఉమ్మడి ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత అంశాలపై ఉమ్మడిగా సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు కట్టుబడడం. అలాగే ప్రస్తుతం ఉన్న ఆసియాన్ నాయకత్వంలోని ఫ్రేమ్‌వర్క్‌లు, పిఎంసి ప్లస్ 1 వంటి యంత్రాంగాలు, ఎఆర్ ఎఫ్, ఇఎఎస్, ఎడిఎమ్ఎమ్ ప్లస్, వివిధ దేశాలలో లావాదేవీల సంబంధిత నేరాలపై ఆసియాన్ సీనియర్ అధికారుల సమావేశం (ఎస్ఒఎమ్ టిసి) ప్లస్, ఇండియా సంప్రదింపులకు సంబంధించి సమ్మిళిత, నిబంధనల ఆధారిత ప్రాంతీయ వ్యవస్థల నిర్మాణం.
6. శాంతి, సుస్థిరత, జల మార్గ భద్రత, రక్షణ, నౌకాయాన స్వేచ్ఛ, చట్టబద్ధమైన కార్యకలాపాలకు సముద్ర మార్గాల వినియోగం, చట్టబద్ధమైన సముద్ర మార్గ వాణిజ్యానికి అడ్డంకులు లేకుండా చూడడం, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఎటువంటి అడ్డంకులు లేని సముద్ర వాణిజ్యం, అంతర్జాతీయంగా గుర్తించిన నిబంధనలకు అనుగుణంగా ,1982 నాటి ఐక్య రాజ్య సమితి సముద్ర చట్టం ఒప్పందానికి అనుగుణంగా శాంతియుతంగా వివాదాల పరిష్కారం, అంతర్జాతీయ పౌర విమాన యాన సంస్థ, అంతర్జాతీయ సముద్ర యాన సంస్థ సిఫారసు చేసిన విధానాల అమలు ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు వాటి పునరుద్ఘాటనకు కృషి చేయడం. ఇందుకు అనుగుణంగా దక్షిణ చైనా సముద్రం విషయంలో వివిధ పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో సమర్ధంగా అమలు చేయడానికి మద్దతు ఇవ్వడం, దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి కోడ్ ఆఫ్ కాండక్ట్ త్వరగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షను వ్యక్తం చేయడం.
7. సముద్ర మార్గ రవాణాకు సంబంధించిన ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి విస్తారిత ఆసియాన్ మారిటైమ్ ఫోరం తో పాటు ప్రస్తుతం ఉన్న వివిధ యంత్రాంగాల ద్వారా సముద్ర మార్గ రవాణాలో సహకారం.
8. సముద్ర ప్రాంతంలో ప్రమాదాలను నివారించడంలో సమష్టిగా కృషి చేయడం, సముద్ర ప్రమదాల విషయంలో గాలింపు, సహాయక చర్యల విషయంలో ఆసియాన్, ఇండియాల మధ్య పటిష్ట సహకారం, ఇందుకు ప్రస్తుత ప్రక్రియలు, విధానాలైన ఐసిఎఒ, ఐఎమ్ఒ లను సమర్ధంగా వినియోగించుకోవడం, సముద్ర సంబంధింత అంశాలపై పరిశోధన సంస్థల మధ్య సహకారం పెంపు, సముద్రమార్గ అంశాలపై విద్య, పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణల విషయంలో పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం.
9. పరస్పరం సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థల మధ్య సహకారం, ఆసియాన్ నాయకత్వం లోని వ్యవస్థలను పటిష్టం చేయడం ద్వారా ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అన్ని రూపాలలో ఎదుర్కొనేందుకు లోతైన సహకారాన్ని అందించుకోవడం. ఆసియాన్ నాయకత్వంలోని ప్రస్తుత వ్యవస్థలైన ఆసియాన్ ఎస్ఒఎమ్ టిసి) ప్లస్ ఇండియా సంప్రదింపులు, ఎడిఎమ్ఎమ్ ప్లస్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ ఆన్ కౌంటర్ టెర్రరిజం, అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సహకారానికి సంబంధించిన 2003 ఆసియాన్- ఇండియా జాయింట్ డిక్లరేశన్, 2015 లో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రకటించిన ఇఎఎస్ ప్రకటన, ఉగ్రవాద సిద్ధాంతాల సవాళ్లను ఎదుర్కోవడం, ఉగ్రవాద సంస్థల ప్రచారాన్ని తిప్పికొట్టడం, మనీ లాండరింగ్‌కు, ఆర్థిక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 2017 లో ఇఎఎస్ నాయకులు చేసిన ప్రకటన విషయంలో సహకారం అందిపుచ్చుకోవడం. మాదకద్రవ్యాల అక్రమరవాణా, మానవ అక్రమరవాణా, సైబర్ నేరాలు, సముద్రపు దోపిడీ, నౌకలపై సాయుధ దోపిడీ ల వంటి వాటిని ఎదుర్కొనే విషయంలో పరస్పరం సహకరించుకోవడం.
10. సామాజిక సామరస్యం, సమాన అవకాశాలతో కూడిన అభివృద్ధి, సుస్థిర, సమ్మిళిత వృద్ధి కి శాంతి, భద్రత, చట్టబద్ధ పాలనలను పెంపొందించడానికి సంబంధించి గ్లోబల్ మూవ్‌మెంట్ ఆఫ్ మాడరేట్స్ లంకావీ డిక్లరేశన్ ను అమలు చేసేందుకు మద్దతు.
11. ఏ రూపంలోనూ ఉగ్రవాద చర్యలకు సమర్ధింపు లేదని నొక్కిచెప్పడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల వ్యాప్తిని నిరోధించేందుకు అత్యవసరంగా మరిన్ని చర్యలు ముందుకు తీసుకెళ్లడం, ఉగ్రవాద గ్రూపులు వాటికి ఆశ్రయమిస్తున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొనే చర్యలకు మద్దతు పలకడం, ఉగ్రవాద సంస్థల లోకి ప్రజలను తీసుకోకుండా నిరోధించడం, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక వనరులు అందకుండా చూడడానికి సహకారాన్ని ముమ్మరం చేయడం, ఉగ్రవాద మూకలు సామాజిక మాధ్యమాలతో సహా ఇంటర్ నెట్ మాధ్యమాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడం, ఉగ్రవాదులు ఒక దేశం నుండి మరో దేశానికి సరిహద్దులు దాటి వెళ్తుండడాన్ని అడ్డుకోవడం, ఉగ్రవాద నెట్‌వర్క్ లను నియంత్రించడం, వారి కార్యకలాపాలను అడ్డుకోవడం తదితరాల దిశగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర విధానాన్ని ప్రోత్సహించేందుకు తమ నిబద్ధతను పునరుధ్ఘాటించడం జరుగుతోంది.
12. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సంబంధించి ఐక్య రాజ్య సమితి భద్రత మండలి తీర్మానాల అమలుకు కలసికట్టుగా కృషి చేయడం, ఐక్య రాజ్య సమితి లో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందానికి సంబంధించిన సంప్రదింపుల కృషిలో కలసికట్టుగా పాలుపంచుకోవడం.
13. 2018లో జరగనున్న ప్రతిపాదిత తొలి ఆసియాన్- ఇండియా సైబర్ డైలాగ్ లో 2015 ఆసియాన్- ఇండియా సైబర్ సెక్యూరిటీ సదస్సు చర్చలను ముందుకు తీసుకుపోవడం, ప్రాంతీయంగా సైబర్ భద్రత చర్యలను పటిష్టం చేసే దిశగా ఇతర ఆసియాన్ వ్యవస్థాగత సంస్థలు తీసుకొన్న చర్యలను ప్రోత్సహించడం, ఐసిటి వినియోగానికి సంబంధించి భద్రత విషయంలో ఎఆర్ ఎఫ్ వర్క్‌ప్లాన్, భద్రతపై ఎఆర్ ఎఫ్ ఇంటర్- సెశనల్ సమావేశం, ఆసియాన్ సైబర్ సెక్యూరిటీ సహకార వ్యూహం అమలుకు మద్దతు ఇవ్వడం, ఆసియాన్- ఇండియా ల మధ్య సైబర్ సెక్యూరిటీ సామర్ధ్యాల నిర్మాణం, విధానపరమైన సహకారాన్ని పటిష్టం చేయడం.
ఆర్థిక సహకారం
14. ఆసియాన్- ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాన్ని సమర్థంగా అమలు చేయడం, ఆసియాన్- ఇండియా ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం, ఆధునిక, సమగ్ర, ఉన్నత నాణ్యత కలిగిన పరస్పర ప్రయోజనకర రీతిలో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యానికి పాటుపడడం.
15. హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలలో సముద్ర వనరుల సుస్థిర వినియోగం పరిరక్షణకు సహకారాన్ని అందించడం, అంతర్జాతీయ చట్టాలు, ప్రత్యేకించి యునైటెడ్ నేశన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యుఎన్ సిఎల్ఒఎస్) కు అనుగుణంగా చర్యలు తీసుకోవడం. అలాగే అక్రమంగా చేపల వేటకు ఒడిగట్టడం, సమాచారం ఇవ్వకుండాను, నియంత్రణకు లోబడకుండాను చేపలు పట్టడం, కోస్తా ప్రాంత పర్యావరణానికి ముప్పు కలిగించడం, పర్యావరణానికి హాని, సముద్ర ప్రాంతాన్ని ఆమ్లమయం చేయడం, సముద్ర ప్రాంతంలో శిథిలాల పారబోత, సముద్ర పర్యావరణాన్ని దెబ్బతీస్తూ వివిధ జీవజాలానికి ముప్పు కలిగించే చర్యలపై దృష్టి సారించడం. సముద్ర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సహకారానికి గల అవకాశాలను అన్వేషించడం,ఇందుకు సంబంధించి తగిన కార్యాచరణ విషయంలో భారతదేశం చేసినటువంటి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం.
16. ఆసియాన్- ఇండియా ఏవియేషన్ కో ఆపరేషన్ ప్రేమ్‌వర్క్ పరిధికి లోబడి 2008 నవంబర్ 6న మనిలా లో జరిగిన ఆసియా రవాణా మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు విమాన యాన రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించడం. ప్రాంతీయ ఎయిర్ సర్వీసెస్ ఏర్పాట్ల ద్వారా ఆసియాన్- ఇండియా వర్కింగ్ గ్రూప్ సంప్రదింపులను జరపడం, సాంకేతిక, ఆర్థిక, రెగ్యులేటరీ అంశాలపై ఆసియాన్, ఇండియా ల మధ్య ఏర్ ట్రాన్స్‌పోర్ట్ సహకారాన్ని విస్తరించడం, పర్యాటక, వాణిజ్య రంగాలను ప్రోత్సహించడంతో పాటు ఈ ప్రాధాన్య రంగాలలో ఆసియాన్, ఇండియా ల మధ్య సన్నిహిత విమానయాన అనుసంధానాన్ని ఏర్పాటు చేయడం.
17. ఆసియాన్, ఇండియా ల మధ్య సముద్ర యాన రవాణాలో సహకారానికి ప్రోత్సాహం. అలాగే సీపోర్టులు, సముద్ర ప్రాంత నౌకారవాణా సదుపాయాలు, నెట్‌వర్క్, సముద్రయాన సర్వీసులను క్రమపద్ధతిలో పెట్టడం, సమర్ధమైన అనుసంధానంతో వంటి వాటిలో ప్రైవేటు రంగంగానికి ప్రోత్సాహంతో పాటు ఈ రంగంలో ఆసియాన్, ఇండియాల మధ్య చర్చలు కొనసాగేందుకు చర్యలు.
18. విమానయాన రంగం, సముద్రయాన రవాణా రంగాలలో సహకారాన్ని పటిష్టం చేయడం, ఆసియాన్- ఇండియా ఏర్ ట్రాన్స్‌పోర్ట్ ఒప్పందం (ఎఐ- ఎటిఎ), ఆసియాన్, ఇండియా మారిటైమ్ ట్రాన్స్‌పోర్ట్ అగ్రిమెంట్ (ఎఐ- ఎమ్ టిఎ) ఒప్పందాలను త్వరగా ముగింపు దశకు తెచ్చేందుకు చర్యలు.
19. ఐసిటి విధానాలను పెంపొందించేందుకు ఐసిటి రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం, సామర్ధ్యాల నిర్మాణాన్ని, డిజిటల్ కనెక్టివిటి ని, మౌలిక సదుపాయాలను, సేవలను మెరుగు పరచడం, ఇందుకు సాఫ్ట్‌వేర్ డివెలప్‌మెంట్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఐసిటి రంగంలో మానవ వనరులను అభివృద్ధి పరచడం, ఐసిటి స్టార్ట్- అప్ లను ప్రోత్సహించడం, ఆసియాన్ ఐసిటి మాస్టర్ ప్లాన్ 2020 మరియు మాస్టర్ ప్లాన్ ఆన్ ఆసియాన్ కనెక్టివిటి 2025 లకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొనేందుకు చర్యలు తీసుకోవడం.
20. సూక్ష్మ, లఘు, మధ్యతరహా సంస్థల స్థిరమైన, మన్నికైన వృద్ధి ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవడం. ఇందుకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, సామర్ధ్యాల నిర్మాణం, సాంకేతిక సహాయం, పంపిణీ మార్గాల అభివృద్ధి, ఫైనాన్సింగ్ సౌకర్యాలు, ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకురావడం, అంతర్జాతీయ, ప్రాంతీయ విపణులు, వేల్యూ చెయిన్ లతో అనుసంధానానికి అవకాశాలు కల్పించడం, అవసరమైన చోటులలో ప్రాజెక్ట్ డివెలప్‌మెంట్ ఫండ్ ను, క్విక్ ఇంపాక్ట్ ఫండ్ ను ఉపయోగించుకోవడం.
21. వ్యవసాయం, ఇంధన రంగాలలో పరస్పర సహకారాన్ని ఈ ప్రాంతంలో బలోపేతం చేస్తూ దీర్ఘకాలిక ఆహార, ఇంధన భద్రతకు సహకారాన్ని పెంపొందించేందుకు చర్యలు కొనసాగించడం. నవీకరణ యోగ్య ఇంధన వనరులకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ వేదికలైన ఇంటర్ నేశనల్ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఎ) వంటి సంస్థలతో అవసరమైన చోట కలిసి పనిచేయడం.
22. ఆసియాన్, ఇండియా ఇనవేశన్ ప్లాట్ ఫారమ్, ఆసియాన్- ఇండియా రిసర్చ్, ట్రైనింగ్ ఫెలోషిప్ పథకం, ఆసియాన్- ఇండియా కొలాబరేటివ్ రిసర్చ్ & డివెలప్‌మెంట్ ప్రోగ్రాం ల వంటి వాటితో కలిసి శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఆసియాన్ కార్యాచరణ ప్రణాళికకు ఎపిఎఎస్‌టిఐ 2016-2025 కు అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక సంబంధాలను మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకోవడం. అలాగే నానో టెక్నాలజీ, మెటీరియల్ సైన్స్, బయోటెక్నాలజీ, శాస్త్ర విజ్ఞానం సాంకేతిక విజ్ఞానం (ఎస్& టి) రంగాలలో రంగాల వారీ సంబంధాలను గాఢతరం చేయడం.
23. శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్షాన్ని ఉపయోగించుకొనేందుకు పరస్పరం సహకరించుకోవడం. ఇందుకు ఆసియాన్- ఇండియా స్పేస్ కోఆపరేషన్ ప్రోగ్రాము అమలు, ఉపగ్రహాల ప్రయోగం, టెలిమెట్రీ ట్రాకింగ్, కమాండ్ స్టేషన్ ల ద్వారా వాటిని పర్యవేక్షించడం, ఉపగ్రహ చిత్రాల వినియోగంలో పరస్పర సహకారానికి చర్యలు. భూతలం, సముద్రం, వాతావరణానికి సంబంధించిన సమాచార చిత్రాల వివరాలను పరస్పర అభివృద్ధికి వినియోగించుకోవడం, చిన్న ఉపగ్రహాల తయారీ, అంతర్ ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థ, శాటిలైట్ ప్రపల్శన్, అంతరిక్ష పరిశోధన సమాచారంలో పరస్పర సహకారానిక చర్యలు కొనసాగించడం.
24. బిజినెస్- టు- బిజినెస్ సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడాన్ని ఆసియాన్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ద్వారా కొనసాగించడం; ఆసియాన్, ఇండియా ఉత్పత్తులకు, సేవలకు సంబంధించి బ్రాండ్ చైతన్యాన్ని విస్తరించేందుకు ట్రేడ్ ఈవెంట్ లను ప్రోత్సహించడం, ఇకనామిక్ లింకేజ్ లు మరింతగా ఉండేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆసియాన్- ఇండియా ట్రేడ్ అండ్ ఇన్ వెస్ట్‌మెంట్ సెంటర్ ఏర్పాటు జరగాలని, ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం కావాలని ఆకాంక్షిస్తున్నాము.
సామాజిక- సాంస్కృతిక సహకారం.
25. ఆసియాన్, ఇండియా మధ్య నాగరకత, చారిత్రక సంబంధాలను పెంపొందించేందుకు సహకరించుకోవడం. ఇందుకు సంబంధించిన విజ్ఞానాన్ని పరస్పరం విధాన నిర్ణేతలు, మేనేజర్లు, ఈ అంశంతో నేరుగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న విద్యావేత్తల మధ్య మార్పిడి చేసుకోవడం, అలాగే ఆసియాన్, ఇండియా చరిత్ర, సంస్కృతి లకు సంబంధించిన సాంస్కృతిక , చారిత్రక చిహ్నాలను, కట్టడాలను పరిరక్షించడం, మెకాంగ్ నది వెంట శాసనాలపై లిపిని గుర్తించి క్రోడీకరించడం ఆసియాన్- ఇండియా సాంస్కృతిక, నాగరకతా సంబంధాలపై సదస్సులు కార్యక్రమాలు నిర్వహించడం.
26. ఆసియాన్ 2015 అనంతర ఆరోగ్య అభివృద్ధి అజెండా కు సంబంధించి ఆరోగ్య రంగంలో పరస్పర సహకారానికి చర్యలు తీసుకోవడం, ప్రత్యేకించి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం, భద్రమైన, సురక్షితమైన, మంచి నాణ్యత గల మందులను ఉత్పత్తి చేయడం, సంప్రదాయ మందులతో పాటు ఇతర అనుబంధ మందులను కూడా చౌకధరలో అందుబాటులోకి తీసుకురావడం.
27. సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా బలమైన సాంస్కృతిక బంధాన్ని ఏర్పాటు చేయడం, ఇందుకు ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడం. ఢిల్లీ డైలాగ్, ఆసియాన్- ఇండియా నెట్‌వర్క్ ఆఫ్ థింక్ టాంక్స్ (ఎఐఎన్ టిటి), ఆసియాన్- ఇండియా ఎమినెంట్ పర్సన్స్ లెక్చర్ సిరీస్ (ఎఐఇపిఎల్ ఎస్) ల వంటి వేదికల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మరింత విస్తృతం చేయడం, రాయబారుల శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, విద్యార్థులు, పార్లమెంటేరియన్ లు, రైతులు, ప్రసార మాధ్యమాలు, యువజన తదితర రంగాలకు చెందిన వారి కార్యక్రమాల ద్వారా ప్రజల రాకపోకల కార్యక్రమాలను ఏర్పాటు చేయడం.
28. విద్య, యువజన రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడం. ఇందుకు సంబంధించి ఆంగ్ల భాషా శిక్షణ కార్యక్రమాలు, వాణిజ్య అభివృద్ధి నైపుణ్యాలు, వృత్తి విద్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఇండియన్ టెక్నికల్ ఇకనామిక్ కో ఆపరేషన్ (ఐటిఇసి) స్కాలర్‌షిప్‌లు, ఆసియాన్- ఇండియా గుడ్‌విల్ స్కాలర్‌షిప్, నాలందా స్కాలర్‌షిప్ ల వంటి వార్షిక ఉపకార వేతనాలను మంజూరు చేయడం, ఆసియాన్- ఇండియా నెట్ వర్క్ ఆఫ్ యూనివర్సిటీ స్ ను ఏర్పాటు చేయడం, విశ్వవిద్యాలయాల నుండి విశ్వవిద్యాలయాలకు ఆదాన ప్రదానాలను, రాకపోకలను ప్రోత్సహించడం, ఆసియాన్ యూనివర్సిటీ నెట్‌వర్క్ ను ఏర్పాటు చేయడం.
29. ప్రకృతి వైపరీత్యాలు, మానవతా సహాయాల సమయంలో ఆసియాన్ , ఇండియాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడం; ‘ఒక ఆసియాన్, ఒకే ప్రతిస్పందన’ నినాదాన్ని సాకారం చేసే దిశగా ఆసియాన్ కో ఆర్డినేశన్ సెంటర్ ఫర్ హ్యూమేనిటేరియన్ అసిస్టెన్స్ (ఎహెచ్ఎ కేంద్రాన్ని) చేపట్టే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, ఆసియాన్ లోపల , ఆసియాన్ వెలుపల ప్రకృతి వైపరీత్యాలకు స్పందించడంలో ఒక్కటిగా వ్యవహరించడం, ప్రాంతీయంగా విపత్తుల నిర్వహణలో ఎహెచ్ఎ కేంద్రం, దాని భారతీయ సంస్థ మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని, మెరుగైన సమన్వయాన్ని కలిగివుండడం.
30. మహిళల సాధికారితకు సంబంధించి ఆసియాన్ మరియు ఇండియా లకు చెందిన సంబంధిత పక్షాలు, ప్రభుత్వాల మధ్య చర్చలను ప్రోత్సహించడం; మహిళలు, బాలల హక్కుల రక్షణను ప్రోత్సహించడం, వారిపై ఏ రూపంలోనూ హింస లేకుండా చూడడం, ఆసియాన్- ఇండియా కార్యాచరణ ప్రణాళిక (పిఒఎ) 2016-2020 కు అనుగుణంగా మహిళా వాణిజ్యవేత్తలను ప్రోత్సహించడం, ఇందుకు సంబంధించి ఆసియాన్ ఫ్రేమ్‌వర్క్‌లు, యంత్రాంగాలకు తగిన మద్దతు నివ్వడం.
31. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, ఎఎస్‌సిసి బ్లూప్రింట్ 2025 లో పేర్కొన్న వ్యూహాత్మక చర్యల అమలుకు మద్దతు ఇచ్చేందుకు సహకారం, పర్యావరణంపై ఆసియాన్ సీనియర్ అధికారుల (ఎఎస్ఒఇఎన్) ప్రాధాన్యాల విషయంలో, పర్యావరణ మార్పుపై ఆసియాన్ వర్కింగ్ గ్రూప్ (ఎడబ్ల్యు జిసిసి) వర్క్‌ప్లాన్ 2016-2025 కు సహకారాన్ని ప్రోత్సహించడం.
32. జీవ వైవిధ్య పరిరక్షణ, నిర్వహణలకు సంబంధించిన విజ్ఞానాన్ని, అనుభవాన్ని పరస్పరం అందించుకోవడం ద్వారా జీవ వైవిధ్య రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడం; సంయుక్త పరిశోధన కార్యక్రమాలను నిర్వహించడం, జీవ వైవిధ్యానికి కలిగే నష్టాన్ని నివారించడం, పర్యావరణానికి ముప్పు, వంటి సమస్యలను ఎదుర్కోవడం, ఆసియాన్ సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ (ఎసిబి) కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం.
33. సివిల్ సర్వీసు అంశాలలో ఇండియా, ఆసియాన్ ల మధ్య నెట్‌వర్కింగ్ మరియు భాగస్వామ్యాల ఏర్పాటు లలో సహకారానికి ఉన్న అవకాశాలను అన్వేషించడం, ఆసియాన్ దేశాలలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఆసియాన్ కమ్యూనిటీతో అనుసంధానానికి మరియు ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2025 అమలుకు వీలుగా తగిన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం.
అనుసంధానం
34. ఎమ్ పిఎసి 2025 కి, ఎఐఎం 2020 కి అనుగుణంగా భౌతిక అనుసంధానాన్ని, డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించే విధంగా మన నిబద్ధతను పునరుద్ఘాటించడం జరుగుతోంది. అలాగే ఇతర అంశాలతో పాటు డిజిటల్ కనెక్టివిటీ, భౌతిక మౌలిక సదుపాయాలను ప్రోత్సహించేందుకు భారతదేశం ప్రకటించిన ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ను వినియోగించుకోనున్నాం.
35. ఇండియా-మయన్మార్-థాయీలాండ్ ట్రైలేటరల్ హైవే ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అయ్యేటట్లు ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు ఈ ట్రైలేటరల్ హైవే ప్రాజెక్టు ను కంబోడియా కు, లావో పిడిఆర్ కు, ఇంకా వియత్ నామ్ కు కూడా విస్తరించాలి.
అభివృద్ధిలో అంతరాన్ని కుదించడంలో సహకారం
36. ఆసియాన్ సభ్యత్వ దేశాలలోను, ఆ దేశాలకు మధ్య ఉన్న అభివృద్ధి పరమైన అంతరాన్ని కుదించడం కోసం ఆసియాన్ చేస్తున్న కృషికి ఐఎఐ వర్క్ ప్లాన్ III ను అమలుపరచడం ద్వారా భారతదేశం మద్దతును అందిస్తూవస్తుండటాన్ని స్వాగతించడం తో పాటు అభినందించడమైంది.
2018 సంవత్సరం జనవరి 25వ తేదీ నాడు భారతదేశంలోని న్యూ ఢిల్లీ లో ఈ డిక్లరేశన్ ను ఆమోదించడమైంది.