ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ నాయకత్వం లోని ఓ ప్రతినిధి వర్గం ఈ రోజు కలుసుకొంది. ఈ ప్రతినిధి వర్గం లో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కి చెందిన సభ్యులు కూడా ఉన్నారు.
ప్రతినిధి వర్గం కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి ‘సేవా భోజ్ యోజన’ ను తీసుకు వచ్చినందుకు ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలిపింది. గురుద్వారా లతో సహా ధార్మిక దానశీల సంస్థలు ఉచితంగా అందించేటటువంటి లంగర్ కు మరియు ప్రసాదానికి ఉద్దేశించిన సరకుల పైన విధించే సిజిఎస్‌టి ఇంకా ఐజిఎస్‌టి లలో కేంద్ర వాటా ను- ఈ పథకం లో భాగంగా- తిరిగి చెల్లించనున్నారు.
చెరకు రైతుల పై భారాన్ని తగ్గించడానికి సైతం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలను తీసుకొన్నందుకు గాను ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలియజేసింది.