బిజెపి కి చెందిన ఒబిసి పార్లమెంటు సభ్యులు మరియు నాయకుల తో కూడిన ఒక ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో న్యూ ఢిల్లీ లో ఈ రోజు సమావేశమైంది.
ఒబిసి కమిషన్ కు రాజ్యాంగ హోదా ను ఇచ్చినందుకు ప్రధాన మంత్రి కి ప్రతినిధి వర్గ సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ చరిత్రాత్మకమైన నిర్ణయం ఒబిసి సముదాయాన్ని బలోపేతం చేయడం లో తోడ్పడగలదని సభ్యులు అన్నారు.
ప్రతినిధి వర్గం అభినందన పూర్వకమైన పలుకులు పలికినందుకు, ఇంకా వారి సమర్ధన ను చాటినందుకు ప్రతినిధి వర్గానికి ప్రధాన మంత్రి తన ధన్యవాదాలను తెలియజేశారు. ఒబిసి సముదాయం యొక్క అభ్యున్నతికి, ప్రత్యేకించి అట్టడుగు స్థాయి లో కృషి చేయడాన్ని కొనసాగించండంటూ ప్రతినిధి వర్గాన్ని ప్రధాన మంత్రి ప్రోత్సహించారు. ఒబిసి హక్కుల పట్ల ఆ సముదాయం లో చైతన్యాన్ని పెంచండంటూ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రదాన్ తో పాటు సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ సంతోష్ కుమార్ గంగ్ వార్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు.