ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భూటాన్ కు తాను బయలుదేరి వెళ్ళే ముందు విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ క్రింది విధంగా ఉంది.
“నేను 2019వ సంవత్సరం ఆగస్టు 17వ మరియు 18వ తేదీల లో భూటాన్ కు ఆధికారిక పర్యటన పని మీద వెళ్ళనున్నాను.
ప్రస్తుత పదవీకాలం ఆరంభం లో నా యొక్క భూటాన్ సందర్శన మన విశ్వాసపాత్రమైన మిత్ర దేశం మరియు మన పొరుగు దేశమైనటువంటి భూటాన్ తో భారతదేశ సంబంధాల కు ప్రభుత్వం ఇస్తున్న అధిక ప్రాముఖ్యాని కి ఒక సూచిక గా ఉన్నది.
ఇండియా మరియు భూటాన్ ల మధ్య శ్రేష్టమైన ద్వైపాక్షిక సంబంధాలు వర్ధిల్లుతున్నాయి. ఈ విస్తృతమైన అభివృద్ధియుత భాగస్వామ్యం ఉభయ పక్షాల కు ప్రయోజనకారి గా నిలుస్తున్న జల-విద్యుత్తు సంబంధ సహకారం, ఇంకా బలమైన వ్యాపార సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఇందుకు ఒక నిదర్శనం గా ఉన్నాయి. ఈ సంబంధాలు ప్రజల కు ప్రజల కు మధ్య నెలకొన్న బలమైన సంబంధాలు మరియు ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వం తో పరిపుష్టం అయ్యాయి.
ఇరు దేశాలు కిందటి సంవత్సరం లో లాంఛన ప్రాయ దౌత్య సంబంధాల కు అంకురార్పణ జరిగిన తరువాత స్వర్ణోత్సవాన్ని జరుపుకొన్నాయి.
ఈనాటి భారతదేశం, భూటాన్ భాగస్వామ్యం ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగినటువంటిది. మరి అంతేకాకుండా, భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానానికి ఒక ముఖ్యమైన స్తంభం గా కూడా ఉన్నది.
భూటాన్ రాజు మాన్య శ్రీ నాలుగో డ్రూక్ గ్యాల్పో తోను, భూటాన్ ప్రధాన మంత్రి తోను మన ద్వైపాక్షిక సంబంధాలన్నింటి విషయం లోను ఫలప్రదమైన చర్చలు జరపడం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ప్రతిష్టాత్మకమైనటువంటి రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్ లో యువ విద్యార్థుల ను ఉద్దేశించి ప్రసంగించడం కోసం కూడా నేను నిరీక్షిస్తున్నాను.
నా యొక్క పర్యటన భూటాన్ తో కాల పరీక్ష కు తట్టుకొని నిలచినటువంటి మరియు విలువల తో పెనవేసుకొన్నటువంటి మైత్రి ని పెంపొందించడం తో పాటు, దానిని మన ఇరు దేశాల ప్రజల పురోగతి ని మరియు సమృద్ధమైన భవిష్యత్తు ను కూడా వర్ధిల్లజేస్తుందన్న విశ్వాసం నాలో ఉంది.”