ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన పాలు పంచుకొంటున్న ‘మన్ కీ బాత్’ (‘మనసులో మాట’) కార్యక్రమం ద్వారా మాత మరియమ్ థ్రెసియా యొక్క కేననైజేశన్ పట్ల ప్రశంస ను వ్యక్తం జేసినందుకు కాంగ్రిగేశన్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలిపింది.
“ ‘మన్ కీ బాత్’ (‘మనసులో మాట’) కార్యక్రమం ద్వారా మాత మరియమ్ థ్రెసియా యొక్క కేననైజేశన్ పట్ల ప్రశంస ను వ్యక్తం చేసినందుకు కాంగ్రిగేశన్ ఆప్ ద హోలీ ఫ్యామిలీ సుపీరియర్ జనరల్ శ్రీ ఉదయా సిహెచ్ఎఫ్ ధన్యవాదాలు తెలియ జేయడమైంది. ఆమె దార్శనికత కలిగినటువంటి ఒక పునీతురాలైన మహిళ. ఎన్నో కష్టాల కు ఓర్చుకొని, తన ఉద్యమం లో ముందంజ వేశారు. విద్య ద్వారా మరియు ప్రేమ ను, శాంతి ని బోధించడం ద్వారా కుటుంబాల అభ్యున్నతి కి ఎంతగానో శ్రమించిన నూతన భారతీయ పునీత మరియమ్ థ్రెసియా పట్ల మీరు హృదయ పూర్వకం గా మీ యొక్క అభినందన ను చాలా స్పష్టం గా వ్యక్తం చేశారు. ఆ విధం గా ఆమె జాతి నిర్మాణాని కి ఎంతగానో దోహద పడ్డారు. యువర్ ఎక్స్‌లెన్సీ, మోదీ గారు, ‘మన్ కీ బాత్’ (‘మనసులో మాట’) కార్యక్రమం ద్వారా మీరు వెలిబుచ్చిన ప్రశంస చాలా బాగుంది. మా సముదాయం లోని ప్రతి ఒక్కరు దీని ని మెచ్చుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి కి కాంగ్రిగేశన్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ వ్రాసిన ఒక లేఖ లో పేర్కొంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి నెలా ఆకాశవాణి ద్వారా నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ (‘మనసులో మాట’) కార్యక్రమం లో మరియమ్ థ్రెసియా యొక్క కేననైజేశన్ పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. “హిజ్ హోలీ నెస్ పోప్ ఫ్రాన్సిస్ రానున్న అక్టోబరు 13వ తేదీ నాడు సోదరి మరియమ్ థ్రెసియా ను పునీతురాలి గా ప్రకటించనుండడం భారతదేశం లో ప్రతి ఒక్కరి కి గర్వకారణం. సోదరి మరియమ్ థ్రెసియా కు ఇవే నా హృదయ పూర్వక నివాళులు. అదే విధంగా ఈ కార్య సాధన కు గాను మన క్రైస్తవ సోదరీమణులు మరియు సోదరుల కు, ఇంకా భారతదేశం లో పౌరులు అందరి కీ నా శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.