భారతదేశం లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాధించిన విజయానికి గాను రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ మూన్ జే-ఇన్, జింబాబ్వే అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ ఇ.డి. మనంగ్వా, మొజాంబీక్ అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ ఫిలిప్ జెసింటో న్యూసీ లు తమ అభినందనల ను ఈ రోజు న టెలిఫోన్ ద్వారా శ్రీ మోదీ కి తెలిపారు.
రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుని శుభాకాంక్షల సందేశానికి గాను ప్రధాన మంత్రి ఆయన కు ధన్యవాదాలు తెలిపారు. 2019వ సంవత్సరం ఫిబ్రవరి లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా ను తాను సందర్శించిన విషయాన్ని ఈ సందర్భం లో ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. అలాగే ప్రథమ మహిళ కిమ్ 2018వ సంవత్సరం లో భారతదేశం లో జరిగిన ‘దీపోత్సవ్’కు హాజరు అయిన సంగతి ని కూడా ఆయన జ్ఞప్తి కి తెచ్చారు. ఈ పర్యటన భారతదేశం- రిప్లబిక్ ఆఫ్ కొరియా సంబంధాల లో ఒక కొత్త అధ్యాయాన్ని జోడించిందని ప్రధాన మంత్రి అన్నారు. ఉభయ దేశాల మధ్య ప్రత్యేకమైనటువంటి వ్యూహాకత్మ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న తన దృఢమైన వచనబద్ధత ను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
జింబాబ్వే అధ్యక్షుడు శ్రీ మనంగ్వా ఇటీవలి సాధారణ ఎన్నికల లో ప్రధాన మంత్రి సాధించిన విజయాని కి గాను ఆప్యాయం గా అభినందనలు పలికారు. అధ్యక్షులు శ్రీ మనంగ్వా అందించిన శుభాకాంక్షల కు ప్రధాన మంత్రి ఆయన కు ధన్యవాదాలు పలికారు. భారతదేశంలో ఎన్నికల సంబంధ కథనాల ను వ్రాసేందుకు జింబాబ్వే నుండి ఇద్దరు పాత్రికేయులు భారతదేశాన్ని సందర్శించడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. అంతేకాకుండా భారతదేశ ఉప రాష్ట్రపతి కిందటి ఏడాది లో జింబాబ్వే ను సందర్శించారని, ఆయన పర్యటన విజయవంతం అయిందని కూడా ప్రధాన మంత్రి గుర్తుచేశారు. భారతదేశం- జింబాబ్వే సంబంధాల ను కొత్త శిఖరాల కు తీసుకుపోవాలన్న అభిలాష ను ఆయన వ్యక్తం చేశారు.
ఈ సంవత్సరం ఆరంభం లో మొజాంబీక్ లో వాటిల్లిన ఒక తుఫాను తదనంతర పరిణామాల లో జరిగిన ప్రాణ నష్టాని కి మరియు ఆస్తి నష్టాని కి గాను అధ్యక్షులు శ్రీ న్యూసి కి ప్రధాన మంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆ కాలం లో భారతీయ నౌకాదళం అందించిన సత్వర సహాయాని కి గాను అధ్యక్షులు శ్రీ న్యూసీ ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలియజేశారు. భారతదేశం సదా మొజాంబీక్ కు వెన్నంటి నిలచి తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.