వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఈ రోజు న భేటీ అయ్యారు. ఈ కార్యక్రమం లో దేశ వ్యాప్తం గా వేల కొద్దీ ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ లబ్ధిదారులు, ఇంకా కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, విధాన సభ ల సభ్యులు మరియు స్థానిక ప్రతినిధులు పాలుపంచుకొన్నారు.
ఛత్తీస్‌గఢ్ లో కాంకెర్ కు చెందిన వ్యవసాయ కుటుంబం లో సభ్యురాలైన శ్రీమతి భూమిక భువారాయా ప్రధాన మంత్రి తో సమావేశం సందర్భం లో తాను తన ఊరి లో గల 29 వన్ ధన్ సమూహాల లో ఒక సమూహాని కి కార్యదర్శి గా పని చేస్తున్నానని, వన్ ధన్ యోజన్, ఉజ్జ్వల గ్యాస్ కనెక్శన్, జల్ జీవన్, ఎమ్ఎన్ఆర్ఇజిఎ కార్డు, రేశన్ కార్డు, ఇంకా పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి తదితర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల ను తాను అందుకొంటున్నానని తెలియ జేశారు.
ప్రభుత్వ పథకాలన్నిటి పేరుల ను జ్ఞాపకం పెట్టుకొన్న శ్రీమతి భూమిక యొక్క అవగాహన కు సంతోషించిన ప్రధాన మంత్రి, ఈ వైఖరి ప్రజల కోసం ఇతోధిక ఉత్సాహం తో పని చేసేందుకు ప్రభుత్వాని కి ఉత్తేజాన్ని ఇస్తుంది అని పేర్కొన్నారు. ఆహార పదార్థాలు సకాలం లో అందుతున్నాయా? అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆరా తీశారు. ప్రభుత్వ పథకాల గురించినటువంటి సమాచారాన్ని చాలా వరకు శ్రీమతి భూమిక యొక్క కుటుంబం మరియు తల్లితండ్రులు ఏ విధం గా తెలుసుకోగలిగిందీ ప్రధాన మంత్రి వివరం గా అడిగి తెలుసుకొన్నారు. ఆమె కు మరియు కళాశాల లో చదువుకొంటున్న ఆమె చిన్న తమ్ముడికి ఆమె యొక్క తల్లితండ్రులు విద్య ను బోధిస్తూ ఉన్నందుకు శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు. పల్లె లోని ఇతరులు కూడా వారి వారి పిల్లల కు చదువు ను చెప్పించడం పట్ల మక్కువ ను చూపవలసింది గా ఆయన విజ్ఞప్తి చేశారు.
శ్రీమతి భూమిక తన యొక్క వన్ ధన్ సమూహం మాహ్‌వా లడ్డూ ను మరియు ఉసిరికాయ పచ్చళ్ళ ను తయారు చేసి, వాటిని బజారు లో కిలో కు 700 రూపాయల ధర కు అమ్మగలుగుతున్నట్లు ప్రధాన మంత్రి కి తెలియ జేశారు. ఎటువంటి ఇబ్బందుల కు తావు లేకుండా, అన్ని ప్రయోజనాలు లబ్ధిదారుల కు అందుబాటు లోకి వచ్చినందుకు ప్రధాన మంత్రి సంతృప్తి ని వ్యక్తం చేశారు. సాధారణం గా మత్తు పదార్థం గా వాడేటటువంటి మాహ్‌వా ను సరి అయినటువంటి రీతి లో ఉపయోగించుకొనేందుకు ఆవిడ చేసిన ప్రయత్నాల ను కూడా ఆయన మెచ్చుకొన్నారు. ‘‘ఆదివాసి ప్రాంతాల లో నివసిస్తున్న పౌరుల వికాసాని కి ప్రభుత్వం కంకణం కట్టుకొందని’’ ప్రధాన మంత్రి అన్నారు. వన్ ధన్ కేంద్రాలు సాగించిన సానుకూల ఫలితాల కు గాను ఖ్యాతి శ్రీమతి భూమిక కు దక్కుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. పిఎమ్ జన్ మన్ యోజన ను భగవాన్ శ్రీ బిర్ సా ముండా జయంతి సందర్భం లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆదివాసీ ప్రజల కు ఎంతగానో సహాయకారి గా ఉండబోతోంది అనే అంశాల ను ఆయన దృష్టి కి తీసుకు రావడమైంది.