చంద్రయాన్-3 ప్రయోగం తరుణం లో, భారతదేశం శాస్త్రజ్ఞుల మొక్కవోని అంకితభావాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘చంద్రయాన్-3 భారతదేశం అంతరిక్ష సంబంధి సాహస యాత్రల లో ఒక క్రొత్త అధ్యాయాన్ని లిఖించింది. అది భారతదేశం లో ప్రతి ఒక్కరి స్వప్నాల ను మరియు ఆకాంక్షల ను సాకారం చేస్తూ నింగి కెగసింది. ఈ మహత్వపూర్ణమైనటువంటి కార్యసాధన మన శాస్త్రవేత్త ల యొక్క మొక్కవోని అంకితభావాని కి ఒక నిదర్శన గా ఉన్నది. వారి ఉత్సాహాని కి, వారి ప్రజ్ఞ కు నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Chandrayaan-3 scripts a new chapter in India's space odyssey. It soars high, elevating the dreams and ambitions of every Indian. This momentous achievement is a testament to our scientists' relentless dedication. I salute their spirit and ingenuity! https://t.co/gko6fnOUaK
— Narendra Modi (@narendramodi) July 14, 2023