ఫ్రెంచ్ అధ్యక్షుడు గౌరవనీయులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు దౌత్య సలహాదారుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ బోన్నే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
ఉగ్రవాద నిరోధకత, సైబర్ భద్రత, రక్షణ, వ్యూహాత్మక సహకారం మొదలైన కీలక రంగాలలో, భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇరు దేశాలు సాధించిన పురోగతిపై ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
సముద్ర రంగం మరియు బహుపాక్షిక సహకారంతో సహా వివిధ ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై భారత-ఫ్రాన్స్ సహకారం గురించి శ్రీ బోన్, భారత ప్రధానమంత్రికి వివరించారు.
ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఇటీవల జరిగిన సంభాషణలను, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ, ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోవిడ్ షరతులు అనుమతించిన వెంటనే భారతదేశాన్ని సందర్శించాలని, అధ్యక్షుడు మాక్రాన్‌కు చేసిన ఆహ్వానాన్ని, నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు.
2021 జనవరి, 7వ తేదీన జరిగిన ఇండియా-ఫ్రాన్స్ వ్యూహాత్మక చర్చల సందర్భంగా, శ్రీ ఇమ్మాన్యుయేల్ బోన్న, భారత పర్యటనలో ఉన్నారు.