‘‘తక్కువ ఖర్చు తో కూడిన సౌర విద్యుత్తు ఉత్పాదన సంబంధ సామర్ధ్య నిర్మాణం లో ప్రవాసి భారతీయులు పోషించవలసిన పాత్ర’’ అనే అంశంపై ఏర్పాటైన ప్రవాసి భారతీయ మండలి సభ్యులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రవాసి భారతీయులు మరియు భారతదేశంలోని ప్రముఖ నిపుణులు, విద్యావేత్తలు, నూతన ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తల తో పాటు నవ పారిశ్రామికులు ఈ మండలి లో సభ్యులుగా ఉన్నారు. వారు గత రెండు రోజులుగా తాము తదుపరి తరానికి చెందిన సౌర సాంకేతికతలు, సౌర శక్తి నిల్వ, మైక్రోగ్రిడ్ సొల్యూశన్స్, ఆఫ్-గ్రిడ్ సొల్యూశన్స్ తో పాటు నవీకరణ యోగ్య శక్తి రంగం లో ఆర్థిక సహాయానికి సంబంధించిన కొత్త కొత్త ఐచ్ఛికాలు వంటి రంగాలపై జరిపినటువంటి చర్చల తాలూకు ఫలితాలను ఈ సందర్భంగా ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకువచ్చారు.
ఆచరణాత్మకమైన సిఫారసులతో ముందుకురావడాన్ని ప్రధాన మంత్రి స్వాగతించారు. ఈ నిపుణుల అభిప్రాయాలకు విధాన రూపకల్పన లో తగు స్థానాన్ని కల్పించాలంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ను, నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ ను ఆయన ఆదేశించారు.