ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జపాన్ పార్లమెంట్ సభ్యుల ప్రతినిధివర్గం ఈ రోజు సమావేశమయింది. శ్రీ తోషిహిరో నికాయ్ నాయకత్వం వహించిన ఈ ప్రతినిధివర్గంలో శ్రీ మోతూ హయాషి మరియు శ్రీ తత్సువో హిరానొ లు కూడా ఉన్నారు.
ప్రధాన మంత్రి సెప్టెంబర్ లో జపాన్- ఇండియా పార్లమెంటేరియన్స్ ఫ్రెండ్ షిప్ లీగ్ తో తాను జరిపిన సంభాషణను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు. ఉభయ దేశాల చట్ట సభల మధ్య తరచుగా సంభాషణలు చోటు చేసుకొంటూ ఉండడాన్ని స్వాగతించారు. అంతే కాకుండా, రాష్ట్ర స్థాయి చట్ట సభలు సైతం ఒకదానితో మరొకటి వాటి వాటి అభిప్రాయాలను తెలియజేసుకొంటూ పరస్పర సంబంధాలను పటిష్టం చేసుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
సునామీలు విసరుతున్న బెదిరింపు పట్ల చైతన్యాన్ని పెంచడం కోసం శ్రీ తోషిహిరో నికాయ్ ఒక కార్యక్రమం చేపట్టడాన్ని ప్రధాన మంత్రి స్వాగతించారు. విపత్తు నష్ట భయాన్ని తగ్గించడం, ఇంకా విపత్తు నిర్వహణ సంబంధ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని దృఢపరచుకోవాలని ఆయన కోరారు.
వచ్చే వారంలో జపాన్ లో పర్యటించడం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు.